తంబూరా మోగిందో.. ప్రాణం ఆగిపోవాల్సిందే!

15 Sep, 2019 11:03 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘మనమెందుకు దొంగల్లా రాత్రిళ్లు బయలుదేరాలి? ఎంచక్కా పొద్దున్నే వెళదాం’’ అంది ఇరవయ్యేళ్ల అమ్మాయి. 
ఒక్కసారిగా ఆ గుంపులో కలకలం. తర్జభర్జనలు.
‘‘ష్‌.. సైలెన్స్‌!’’ అంటూ గద్దించింది ఓ పెద్దావిడ. ‘‘ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే. మనమెందుకు దొంగల్లా రాత్రిళ్లు వీధుల్లోకి వెళ్లాలి? సూర్యోదయానికి ముందే బయలుదేరుదాం..!’’ కొనసాగించింది ఆ పెద్దావిడ. 
‘‘వీధి కుక్కలతో ప్రమాదమేమో.. ఒక్కసారి ఆలోచించండి..’’ అన్నాడు ఆ గుంపులోని ఓ నడివయసు వ్యక్తి. 
చిన్నాపెద్దా అంతా ఘొల్లున నవ్వారు. 
‘‘హుష్షూ... ’’ అని మళ్లీ ఆ గుంపును నియంత్రిస్తూ ‘‘ప్రమాదం లేదు.. ప్రమోదం లేదు. నగర సంకీర్తనకు పొద్దున్నే అందరూ సిద్ధంకండి’’ అని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పెద్దావిడ.
ఆమె అటు వెళ్లిందో లేదో.. ఆ గుంపులో మళ్లీ సందడి మొదలైంది. ఓ పాతికేళ్లమ్మాయి తన ముందు కూర్చున్న ఆరేళ్ల పిల్ల జుట్టులోంచి పేలు తీస్తూ పొరపాటున జుట్టునూ లాగింది.
‘‘అబ్బా.. ’’ అంటూ ఆ పిల్ల ఆ పాతికేళ్లమ్మాయిని గిల్లింది ప్రతీకారంగా. 
‘‘ఒసేవ్‌.. పేలే...’’అంటూ ఆ పిల్ల నెత్తి మీద మొట్టికాయ వేసింది ఆ పాతికేళ్లమ్మాయి. 
ఇంకోవైపు.. ‘‘ఒరేయ్‌.. నా చొక్కా వదల్రా..?’’ అంటూ పదేళ్లబ్బాయి వెంటపడ్డాడు పద్దెనిమిదేళ్ల కుర్రాడు. 
‘‘ఇది నాది.. మొన్న రాత్రి నాలుగోనంబర్‌ వీధిలోని డాబా మీద ఆరేసుంటే ఎత్తుకొచ్చా’’ అంటూ వాడు ఆ కుర్రాడికి అందకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు. 
ఆ చిన్న చిన్న గొడవలు, అల్లర్లు, అలకలతో ఆ పొద్దు గడిచింది.
సూరీడు..  ఆ ఊరి తూరుపు కొండను ఇంకా ఎక్కలేదు. ఆ చూరు కింది వాళ్లంతా లేచి రెడీ అయిపోయారు. నుదుటన విబూది రాసుకున్నారు. నలుగురు నలుగురు కలిసి వరుస కట్టి.. ఆ సమూహంతో బయలుదేరింది. 

సణుగుడుగా మొదలైన సంకీర్తన.. ఊళ్లోకి వచ్చేసరికి పెద్ద రాగంగా మారింది. 
ఒక్కసారిగా ఆ ఊళ్లోని జనమంతా ఉలిక్కిపడి లేచారు. ఒక్క క్షణం అయోమయం. సమయం చూసుకున్నారు. అయిదు గంటలు! ఈ సంకీర్తన ఎప్పటిలా రాత్రి వస్తుందని ..నిద్రను ఎగరగొడ్తుందని.. అసలు నిద్రపోకుండా కాచుక్కూచున్నారు. ఇంకొంతమందేమో ..ఆ సంకీర్తన గుంపులో కనిపించే తమ వాళ్లను చూడ్డం కోసం కిటికీ కన్నాల్లోంచి.. చూరు సందుల్లోంచి కళ్లను వేల్లాడేశారు. అలా వేచి వేచి కళ్లు కాయలు కాచినా ఆ సంకీర్తన సమూహం రాకపోయేసరికి ఆ అలసటతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలియనేలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా.. ఆ గళంతో ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఆత్రం.. బెరుకు.. భయం.. కలవరం.. అన్నీ ఒక్కసారి చుట్టుముట్టాయి అందరినీ!
రానురానూ ఆ సంకీర్తన దగ్గరవుతోంది. జనాల్లో గుబులు, అలజడి మొదలైంది. ఆ సంకీర్తన సమూహం తమ ఊరికొచ్చి వారం అవుతోంది.. ముందు రెండు రోజులు ఊరంతా బాగా ఎంజాయ్‌ చేసింది. తర్వాత రెండు రోజులు ఆ కర్ణకఠోర గళాలు  ఊరి చెవులను చిల్లులు పడేలా చేసింది. ఆ తర్వాత నుంచి ఆ సమూహంలోని మనుషులు.. వాళ్లు చేసే పని వెన్నులోంచి వణుకు పుట్టించడం మొదలుపెట్టింది. 
ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. ఎక్కడుంటున్నారో తెలియదు. భిక్షాటన చేస్తారు. భిక్షగా వాళ్లు కోరేది ఆహారాన్ని కాదు.. మనుషులను.

ఈ నిజం అనుభవంలోకి వచ్చిన రెండు రోజులకే ఊళ్లో సగం మందికి వెరుపు జ్వరాలు పట్టుకున్నాయ్‌. ఈ మసక వెలుతురు కూడా అలాంటి భయాన్నే కలిగిస్తోంది. ఓ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆ సంకీర్తన గుంపులో ఉన్న ఎనిమిదేళ్ల పిల్లాడు  ఆ ఇంటి వాకిట్లో  ఆగిపోయాడు. ఆ పిల్లోడి కంటే నాలుగు అడుగులు ముందుకు కదిలిన ఆ గుంపు ఆగిపోయింది. అలాగే అక్కడే నిలబడి చేతుల్లో ఉన్న తంబూర తంత్రులను ఒక్కసారిగా మీటారు శ్రుతి, లయ ఏమీ లేకుండా!  ఒక్కసారిగా ఆపారు.... మళ్లీ మీటారు.. మళ్లీ ఆపారు. చివరిసారిగా మీటారు. 
ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయ్‌.  ఇంట్లోని వాళ్లంతా వచ్చి గేట్‌ దగ్గర నిలబడ్డారు. ఆ పిల్లాడిని చూసి హతాశులయ్యారంతా! అతను ఆ ఇంటివాడే. ఆ సభ్యులకు కొడుకు, మనవడు, మేనల్లుడు, తమ్ముడు అవుతాడు. ఆ అబ్బాయి ఆ ఇంటి వైపు మొహం తిప్పకుండానే చేతిని చాచి చూపుడువేలితో ఆ సభ్యుల్లోని ఒక వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తి ఈ అబ్బాయికి మేనమామ అవుతాడు. ఆ అబ్బాయి అలా చూపించే సరికి ఆ ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఆ గుంపు అదే పనిగా శ్రుతి, లయ లేకుండా తంబూరలు వాయించడం మొదలుపెట్టింది. ఎనిమిదేళ్ల కుర్రాడు ముందుకు కదిలాడు. వెనకాలే ఆ పిల్లాడి మేనమామ అడుగులు కదిపాడు.. వణుకుతూ!

సమూహం కూడా ముందుకు సాగింది. 
మేనమామకు గతం గుర్తుకొస్తోంది. ఆ పిల్లాడి పట్ల తను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. ఆ దారిపొడువునా ఆ పాశవిక తలపోతలే! ఆ గుంపులోని ఇంకో మనిషి మరో ఇంటి ముందు ఆగేదాకా సాగిన ఆ ప్రయాణంలో అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. విరక్తి కలిగింది. ఆ జీవితాన్ని అంతం చేసుకోవాలన్న కోరిక బలంగా పుట్టింది. 
ఆ సమూహం తంబూరాలు మీటుతూనే ఉంది.. శ్రుతిలయ తప్పి! ఆ వ్యక్తి తన చేతులతో తానే గొంతు నులుముకొని ప్రాణాలు తీసుకున్నాడు. 
ఒక్కసారిగా తంబూరాల మోత ఆగింది. 
‘‘ఎవరికి మూడిందో’’ అనుకున్నారు ఊళ్లోని మిగిలిన జనాలు!
ఇంకో ఇంటి వాకిట్లో పాతికేళ్ల అమ్మాయి ఆగింది. నాలుగు అడుగులు ముందు ఆగిన సమూహం... మూడుసార్లు తంబూరాలు మీటింది.. ఆపింది.. 
ఈసారి ఆ ఇంట్లోంచి ఒక్కడే వ్యక్తి వచ్చాడు. అతను.. ఆ పాతికేళ్లమ్మాయి భర్త. మిగిలిన సభ్యులున్నా.. అతనే వచ్చాడు.. విషయమై అర్థమై!

మళ్లీ తంబూరాలను వెర్రి ఆవేశంతో మీటుతూ ఆ సమూహం ముందుకు నడిచింది. అందరి తలలూ కిందకి వేసి ఉన్నాయి. అందరి మొహాలను కప్పేస్తూ  కిందికి జాలువారిన ఆ జుట్టు నేలను ఊడుస్తోంది. వాళ్లను అనుసరిస్తూ  క్షణంలో ఆ గుంపులో కలిసిపోయింది ఆ పాతికేళ్ల అమ్మాయి. 
ఆ భర్తకు పశ్చాత్తాపం మొదలైంది. మగపిల్లాడే కావాలని ఆ అమ్మాయికి నరకం చూపించాడు. హింసించాడు. తను చేసిన తప్పు తెలిసొచ్చి...  గట్టిగా ఏడుస్తూ నేల మీద కూలబడిపోయాడు.
వెంటనే సమూహం తంబూర నాదాల్ని తీవ్రం చేసింది.. శ్రుతిలయ లేకుండా. ఆ భర్త..  నేలమీదున్న రాయిని తీసుకొని తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. తంబూరా తంత్రులు మోగుతూనే ఉన్నాయ్‌.. ఆ చప్పుడికి మెదడు చిట్లేలా. 
తల  పగిలి రక్తం చిమ్ముతున్నా ఆ నొప్పి.. బాధ తెలియట్లేదు అతనికి. అలా కొట్టుకొని కొట్టుకొని చలనం లేకుండా పడిపోయాడు ఆ భర్త!
తంబూరాలూ ఆగిపోయాయి! ముందుకు నడుస్తూ నడుస్తూ ఆ సమూహమూ చీకట్లో అదృశ్యమైపోయింది... గాల్లో కలిసిపోయింది.
- సరస్వతీ రమ

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అటుకుల వడ.. తింటే ఆహా అనాల్సిందే!

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

పరివర్తన

శంకరగీత

అద్దెకొంప

ప్రమాదంలో పుడమి కవచం

మంత్రి యుక్తి

ఆ సమయంలో ఇవి చేయకూడదా?

తిక్క కుదిరింది

సరైన ప్రాయశ్చిత్తం

బండలు

తేనెపట్టులా నీ పలుకే..

గోపికనై నేను జలకములాడేను

రొమాంటిక్‌ సింబల్స్‌

ప్రయాణం

జగమే మాయ

కేఫ్‌.. కాఫీ

వేగోద్దీపన ఔషధం

ఓ క్యూట్‌ బేబీ..!

తిరుపతికొండ మెట్టు

ఆ టైమ్‌లో చేయవచ్చా?

నైపుణ్యం కట్టుకోండి..

వారఫలాలు (8 సెప్టెంబర్‌ నుంచి 14 సెప్టెంబర్‌ వరకు)

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా!

వినాయకుని విశిష్ట ఆలయాలు.. చుట్టేసొద్దాం

కమ్మని కీమా సమోస, ఈజీ ఎగ్‌ పరోటా

నిజం బయటపడింది, కటకటాల్లోకి వెళ్లింది..

ఇన్‌ఫెక్షన్‌ తరచూ వస్తోంది...

అజ్ఞాత వీరుడు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

మాకు పది లక్షల విరాళం