-

ఇది హీటర్ లాంటిదే

3 Jul, 2016 01:01 IST|Sakshi
ఇది హీటర్ లాంటిదే

ఇప్పుడంటే గీజర్లు కానీ.. దానికి ముందు మొత్తం ఇమ్మర్షన్ హీటర్లే కదా.. ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబాల్లో వేడినీళ్లు కావాలంటే హీటర్లనే వాడతారు. ఈ ఇమ్మర్షన్ సూత్రంతో వచ్చిందే ఈ ‘ఇమ్మర్షన్ సర్కులేటర్’. లైట్ వెయిట్‌తో కాంపాక్ట్ సైజులో ఉన్న ఈ పరికరం గ్యాస్ అవసరం లేకుండా మీ వంటను త్వరగా, సులువుగా పూర్తి చేస్తుంది. ఎలా అంటే... గుడ్లు, కూరగాయలు లేదా మాంసాన్ని ఉడికించాలంటే, వాటిని నీళ్లు పోసిన గిన్నెలో వేయాలి.

తర్వాత దానికి ఈ ఇమ్మర్షన్ సర్కులేటర్‌ను తగిలించాలి (వీటికి ఉన్న క్లిప్స్‌తో). ఇప్పుడు ఎలక్ట్రిక్ సప్లై ఇస్తే సరిపోతుంది. టెంపరేచర్‌ను కూడా మనం ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. అలాగే సాంబార్, పాలు లాంటివి వేడి చేసుకోవాలన్నా... ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు