సిత్రం... భళారే సింగరేణి సిత్రం!

16 Sep, 2018 00:03 IST|Sakshi

ఆ  ప్రయాణం ఏ స్టేషన్‌ నుంచి మొదలై ఏ స్టేషన్‌తో ముగుస్తుందో ఇప్పటికీ  తెలియదుగానీ ‘సింగరేణి ప్యాసింజర్‌’ అంటే మాకు దక్షిణ మధ్య రైల్వే వారి ఒక రైలు బండి కాదు... అక్షరాలా చుట్టం! మా ఊరితో పాటు చుట్టుపక్కల చిన్న ఊళ్లు, తండాలలోని చిరు ఉద్యోగులు, చిరువ్యాపారులు ఈ సింగరేణి బండిలో అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవాళ్లు. ఈ రైల్లో చిలకజోస్యం చెప్పే  ఒక కోయదొరకు బాగా డిమాండ్‌ ఉండేది. ఆయన కుడి చేతిలో చిలకపంజరం, ఎడమ భూజానికి వేలాడుతున్న సంచిలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో ఆల్బమ్‌ ఉండేవి. ఈ ఆల్బమ్‌లో  సెలబ్రిటీల ఫోటోలు ఉండేవి. ‘లేడిస్‌ టైలర్‌’ సినిమాలో రాళ్లపల్లి మాదిరిగా ఆ ఫోటోలను చూపిస్తూ... ‘టూపర్‌టార్‌ కిట్న.... పక్కన నేను’ ‘ఈరోయిని వానసీ.... పక్కన నేను’ అంటూ గొప్పగా  చెప్పేవాడు.  రైలు కిక్కిరిసి పోయినప్పటికీ, సీటు దొరకక చాలామంది నిలబడక తప్పనప్పటికీ  కోయదొరకు సీటు ప్రాబ్లం ఉండదు. ‘కూకో దొరా’ అంటూ ఎవరో ఒకరు తమ సీటు ఇచ్చి ఆయనను కూర్చోబెట్టి తాము నిలబడేవాళ్లు.

దొరగారేమో... చిలక ముట్టిన దేవుళ్ల బొమ్మ కార్డును  చేతిలోకి తీసుకొని జాతకాలు చెబుతుండేవాడు. ‘గ్యానం, అన్నం, అభిమానం, ప్రేమ గొప్పవి. ఎక్కడ బోయిన రాజు, మంత్రిలాగా బతుకుతవు’ అని గొప్పధైర్యాన్ని ఇచ్చేవాడు. ‘అనుమానం తప్ప ఏమీ లేదు. గండాలు అయితే ఏమీ లేవు’ అని డౌటును క్లియర్‌ చేసేవాడు ‘చేయి ఒకరికి చూపించకు. నల్లదారం, నల్లబట్ట కట్టకు’ అని సలహా ఇచ్చేవాడు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకరికి సహాయం చేసే చెయ్యి నీది. నీకు సాయం చేసేవాళ్లు లేరు’  అని సానుభూతి చూపేవాడు. ఒకరోజు... పోశెట్టి అనే ఆయన దొర దగ్గర జాతకానికి కూర్చున్నాడు... ‘‘తమ్ముడు పోశెట్టి... పోయింది.... అంతా పోయింది! నయపైసా లేకుండా పోయింది’’ అరిచినట్లుగా అన్నాడు దొర. ‘‘ఏంబోయింది?’’ ఆశ్చర్యంగా అడిగాడు పోశెట్టి ప్యాంటు జేబులో చేయిపెట్టుకుంటూ. ‘‘నీ దరిద్రం. నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి నీ అదృష్టం మొదలైంది.

ఇక నిన్ను ఎవడు ఆపలేడు. పట్టిందల్లా బంగారం.... కొట్టిందల్లా పిట్ట... వద్దన్నా మారాజయోగం పడుతుంది’’ గాలి కొడుతూనే ఉన్నాడు దొర. సంతోషం పట్టలేక పక్క సీటు వాడిని పట్టుకొని ఏడ్చాడు పోశెట్టి. ‘‘ఇక చూపిస్తా నా తడాఖా’’ అని కాలరెగరేశాడు. దొర పక్క బోగిలోకి మారిన పదినిమిషాలకనుకుంటా.... ముగ్గురు బలసంపన్నులు ‘ఎప్పుడిస్తవ్‌ బే’ అని తిడుతూ పోశెట్టిని చావబాదారు. (పోశెట్టికి డబ్బు అప్పు ఇచ్చిన బ్యాచ్‌ ఇది) ‘‘రేపు ఇవ్వక పోతే... చమ్డాలు తీయండన్నా..... ప్లీజ్‌ అన్నా’’ అని వేడుకుంటే ‘‘రేపు మాట నిలబెట్టుకోకపోతే... నువ్వు ట్రైన్‌లో ఉండవు... ట్రైన్‌ కింద ఉంటావు’’ అని వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తూ వాళ్లు వెనక్కి తిరిగారు.  పోశెట్టి కొత్తషర్ట్‌ పాత షర్ట్‌లా పప్పుపప్పు అయింది. ‘‘ఓర్నీ... మారాజా యోగం అంటే ఇదేనా’’ అని మూతి అటూ ఇటు తిప్పాడు పక్క సీటువాడు. భళ్లుమని నవ్వారు అక్కడున్న జనాలు!

ఒక రోజు...  ఒకడు కోయదొర దగ్గరకు  వచ్చి... ‘‘అయిదు రూపాయలు ఇస్తాను, అర్జెంట్‌గా జాతకం చెప్పాలి. నాది కాదు నీది’’ అన్నాడు. కోయదొర ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి.
‘‘ఎప్పుడు పుట్టానో తెలుసు. ఎప్పుడు చస్తానో తెలుసు. నేను సచ్చే వరకు ఏ నిమిషానికి ఏంజరుగుతుందో కరెక్టుగా తెలుసు’’ అని మీసం మేలేశాడు కోయదొర. ఆ టైమ్‌లోనే టీసీ వచ్చాడు. అంతే మనోడు జంప్‌ (ట్రైన్‌ టికెట్‌ తీసుకోలేదు కాబట్టి) పక్క స్టేషన్‌లో ఆగబోతూ  ట్రైన్‌ స్లో అవుతున్న టైమ్‌లో టీసీ వచ్చాడు. దీంతో ట్రైన్‌ నుంచి ప్లాట్‌ఫామ్‌పైకి జంప్‌ చేయడం కోయదొరకు ఈజీ అయింది. ‘‘ఏ నిమిషానికి ఏంజరుగుతుందో కరెక్టుగా తెలుసు అన్నాడు. మరి టీసీ వచ్చే సంగతి తెలియదా!’’ అన్నాడు ఒకాయన అక్కడున్నవాళ్ల నవ్వుల మధ్య.

మరోరోజు... ట్రైన్‌లో ఎక్కడికక్కడ  టాయిలెట్‌లు  బిగుసుకుపోయి ఉన్నాయి. ‘అర్జెంట్‌’ ఉన్నవాళ్లంతా ఆందోళన పడిపోయారు.  ఎంతగా తలుపులు బాదినా అవతలి నుంచి  రెస్పాన్స్‌ లేదు. టాయిలెట్‌లో సంఘ విద్రోహశక్తులు, ఉగ్రవాదుల్లాంటి వాళ్లు ఎవరైనా దాక్కున్నారేమో అనే అనుమానంతో  ఎవరో రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. అంతే... ట్రైన్‌ను ఒక చోట ఆపేశారు. ‘‘మర్యాదగా బయటికి వచ్చేయ్‌. లేకుంటే డోర్‌ బద్దలు కొట్టాల్సి వస్తుంది’’ అంటూ ప్రతి డోర్‌ దగ్గర పోలీసులు వార్నింగ్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ ఎఫెక్ట్‌తో ఎట్టకేలకు టాయిలెట్‌ల డోర్లు తెరుచుకున్నాయి. లోపలి నుంచి బయటికి వచ్చిన వాళ్లు, రావడం రావడంతోనే పోలీసుల కాళ్ల మీద పడుతున్నారు.

‘‘టాయిలెట్‌లో ఎందుకు దూరారు. ఇంతసేపు ఏం చేస్తున్నారు?’’ అనే ఏకైక ప్రశ్నకు వాళ్లు చెప్పిన కామన్‌ సమాధానం: ‘‘టికెట్‌ లేని వాళ్లను పట్టుకుపోయి జైల్లో వేయడానికి స్పెషల్‌ స్క్వాడ్‌ వాళ్లు  బండ్లో ఎక్కారని విన్నాం సారూ... బండి దిగలేము... అలాగని  కూర్చోలేం... లెట్రిన్‌ అయితే సేఫ్‌ అని దాక్కున్నాం సారూ’’ ఏ ఉగ్రవాదులో తలుదాచుకొని ఉంటారనుకున్న పోలీసులు ఇది విని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఎవరైనా టాయిలెట్‌లో ఎక్కువసేపు ఉంటే... డోర్‌ చప్పుడు చేస్తూ.... ‘నీ టికెట్‌ డబ్బులు నేను ఇస్తాను.... బయటికి రావయ్యా బాబూ’ అనడం మామూలైపోయింది!

– యాకుబ్‌ పాషా

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’