అపురూపం 6: మొదలు.. సావిత్రి - కమల్ హాసన్

24 Nov, 2013 03:22 IST|Sakshi
అపురూపం 6: మొదలు.. సావిత్రి - కమల్ హాసన్

మహానటి సావిత్రి... ఆమె పక్కన చిన్నారి కమల్‌హాసన్...
 అవును... మన కమల్‌హాసనే!
 కమల్ బాలనటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారన్న సంగతి చాలామందికి తెలీదు!
 ఆ చిత్రం పేరు ‘కళత్తూర్ కణ్ణమ్మ’ (1960)
 తమిళంలో వచ్చిన ఈ చిత్రంలో సావిత్రి, జెమినీ గణేష్‌ల కొడుకుగా కమల్ నటించాడు.
 అప్పుడు సావిత్రి టైమ్ నడుస్తుంది!
 తెలుగు, తమిళంలో ఆమే నంబర్ వన్. దక్షిణాది మహానటిగా ఓ వెలుగు వెలుగుతోంది!
 సావిత్రి పక్కన వేషమంటే ఆషామాషీ కాదు.
 అయినా ఆమె చూపిన చొరవతో సునాయాసంగా నటించి, మంచి మార్కులు కొట్టేశాడు మూడేళ్ల కమల్.
 
 తుది
 కమల్ పెద్ద హీరో అయ్యాడు.
 సావిత్రి టైమ్ అయిపోయింది.
 జీవితంలోని ఆటుపోట్ల వల్ల ఆమె అన్నివిధాలా సన్నపడింది.
 క్యారెక్టర్ రోల్స్‌కి మారింది.
 అవసరార్థం చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. కారణాలు అనేకం!
 అలా ఓ చిన్న పాత్రలో అదే కమల్‌హాసన్ నటించిన ‘అల్లావుద్దీన్ అద్భుద విలక్కుమ్’ తమిళ చిత్రంలో నటించింది!
 తొలి స్టిల్‌లో నిండుగా, అందంగా ఉన్న సావిత్రిని చూసి...
 మలి స్టిల్‌లో నీరసించి కళ తప్పిన సావిత్రిని చూస్తే, ‘ఈమె మన సావిత్రేనా?’ అనిపిస్తుంది.
 1979లో ఈ సినిమా విడుదలైంది. 1981లో సావిత్రి పరమపదించింది.
 ఇన్నేళ్లయినా సావిత్రిని, ఆమె నటనను మనమెవరూ మరచిపోలేదు!
 కమల్‌హాసన్ కూడా!
 ఇప్పటికీ మీ అభిమాన నటీమణి ఎవరు అని అడిగితే ఆయన చెప్పే పేరు ‘మహానటి సావిత్రి’!
 - నిర్వహణ: సంజయ్ కిషోర్
 sanjjaykkishor@gmail.com

మరిన్ని వార్తలు