లూప్డ్ ట్విస్ట్ పోనీ

21 Aug, 2016 00:27 IST|Sakshi
లూప్డ్ ట్విస్ట్ పోనీ

సిగ సింగారం
దీన్ని లూప్డ్ ట్విస్ట్ పోనీ అంటారు. ఈ హెయిర్ స్టయిల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది అన్ని రకాల డ్రెస్సుల మీదకు నప్పుతుంది. ముఖ్యంగా జీన్స్, స్కర్ట్స్, పంజాబీ డ్రెస్సులకు బాగా సూట్ అవుతుంది. ఈ రకం పోనీని వేసుకోవడానికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన అవసరం లేదు. మరో విశేషం ఏమిటంటే.. ఈ హెయిర్ స్టయిల్‌ను నూనె పెట్టిన జుత్తుతో కూడా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ లూప్డ్ ట్విస్ట్ పోనీని మీరూ ట్రై చేయండి. ఎలా అంటే...
 
1. ముందుగా జుత్తునంతటినీ ఎడమ చెవి వైపుకు తీసుకొచ్చి, చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.
 
2. ఇప్పుడు ఆ జుత్తుకు రబ్బర్ బ్యాండ్ పెట్టి పోనీ వేసుకోవాలి.
 
3. తర్వాత బ్యాండ్‌పైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా చేతి వేళ్లతో దూరం చేయాలి.
 
4. పోనీని ఇప్పుడు అందులోంచి పై నుంచి కిందకు తీయాలి.
 
5. కింద భాగంలో మిగిలిన జుత్తును చిక్కులు లేకుండా మళ్లీ దువ్వుకోవాలి. కావాలంటే హెయిర్ స్ప్రే చేసుకోవచ్చు.
 
6. ఫొటోలో కనిపిస్తున్న విధంగా బ్యాండ్ పైన జుత్తును మెల్లిగా కదిలిస్తూ, వదులు చేసుకోవాలి.
 
7. తర్వాత ఫస్ట్ లూప్‌కు కాస్త కింది భాగంలో మరో బ్యాండ్ పెట్టి, స్టెప్ 3ను రిపీట్ చేయాలి.
 
8. ఇప్పుడు మిగిలిన పోనీని స్టెప్ 4 లాగే బ్యాండ్ పైన జుత్తులోంచి పై నుంచి కిందకు తీయాలి. తర్వాత ఆ లూప్‌ను కూడా వదులు చేసుకోవాలి.
 
9. అలా మీ జుత్తు పొడవును బట్టి లూప్స్‌ను వేసుకుంటూ పోవాలి. చివరగా కాస్త జుత్తును వదిలేసి బ్యాండు పెట్టుకోవాలి. కావాలంటే ఈ హెయిర్ స్టయిల్ కుడివైపు కూడా వేసుకోవచ్చు.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు