హృదయం: ప్రేమ మధురం... ప్రేమికులు అమరం!

11 May, 2014 02:42 IST|Sakshi
హృదయం: ప్రేమ మధురం... ప్రేమికులు అమరం!

అతిలోక సుందరి థిస్‌బే, గ్రీకువీరుడు పైరామస్. ఇద్దరి ఇళ్లూ పక్కపక్కనే. మధ్యలో గోడ మాత్రమే అడ్డు. ఆ అడ్డు మనుషులకే కానీ వారి ప్రేమకు కాదు. ఇద్దరూ పెరిగి పెద్దయ్యారు, వాళ్లతోపాటే వారి ప్రేమ కూడ. తెలుగు సినిమా కథలా అనిపిస్తోందా? నిజమే అనేక సినిమాలకు, నవలలకు ఆధారం ఈ ప్రేమికులు. క్రీస్తుపూర్వం బాబిలోనియాలో ప్రేమకు ప్రతీకలు వీళ్లిద్దరూ. ఆ తర్వాత జనసామాన్యంలో ఈ అమరప్రేమికులు అజరామరంగా నిలిచిపోయారు. రోమనుల పౌరాణిక కథనాల్లో భాగమయ్యారు. సాహిత్యకారులకు కథావస్తువు ఈ ప్రేమికులే. బొమ్మలు వేయడం అప్పుడప్పుడే అలవర్ణం: మళ్లీ కావాలి అమ్మ ఒడి!  తల్లిని ప్రేమగా హత్తుకున్న ఈ పిల్ల గొరిల్లాను చూస్తుంటే, జీవుల ఉద్వేగాలన్నీ మనుషులకు మల్లేనే ఉంటాయని అనిపించట్లేదూ!
 
 తల్లి ఒడిలో లభించే భద్రత, తల్లి సామీప్యంలో లభించే నిశ్చింత ఏ పిల్లలకైనా అనుభవమే. అలాంటి అమ్మ ఒడి సౌఖ్యపు క్షణాల్ని పెద్దయ్యేకొద్దీ వదులుకోకా తప్పదు; జీవిత పోరాటంలో తల్లిగానో తండ్రిగానో రూపాంతరం చెందాల్సిన ప్రకృతి ధర్మాన్ని పాటించకా తప్పదు. అయినా అవకాశం వస్తే అందరూ శిశువులుగా మారిపోయే వరం కోరుకుంటారేమో! ఈరోజు మాతృ దినోత్సవం! అమ్మ పంచిన ప్రేమను నెమరువేసుకునే రోజు. బదులుగా అమ్మపట్ల సంతానానికి గల బాధ్యతను గుర్తుచేసుకునే రోజు.
 
 ఈ సందర్భంగా ఏర్చికూర్చిన కొన్ని ఫొటోలివి. గొరిల్లా తల్లీపిల్లలు జర్మనీలోని లైప్‌జిగ్ జంతుప్రదర్శనశాలలోవి. తల్లి పేరు కమిలి. పాపకు ఇంకా నామకరణం జరగాలి. పుట్టి మూడ్రోజులే అయింది. ఇక, మూడు నెలల ఫ్రాంకోయిస్ లంగూర్, వాళ్లమ్మ ఈనా నివాసం ఇంగ్లండ్‌లోని హౌలట్స్ వైల్డ్ యానిమల్ పార్కు. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ పార్కులో జన్మించిన తొట్టతొలి ఫ్రాంకోయిస్ లంగూర్ పిల్ల ఇదే. ఇంకో విశేషం, ఈ జాతి చాలా అరుదైనది. ఇంకా ఆడుకుంటున్న ఎలుగుబంట్లేమో డిస్నీ వాళ్లు తీస్తున్న ‘బేర్స్’ సినిమాలోవి. అమ్మ పేరు స్కై. పిల్ల పేరు స్కౌట్. కంగారూ తల్లీపిల్లలు చెక్ రిపబ్లిక్‌లోని జ్లీన్ ప్రాంతంలోని జూలోవి. బేబీ వయసు మూడు నెలలు. జిరాఫీలు కూడా జర్మనీలోవే! కాకపోతే టియర్‌పార్క్  హగెన్‌బెక్ జూలోవి. నాల్రోజుల క్రితమే బుజ్జి జిరాఫీని తల్లి ప్రసవించింది.

వాటు చేసుకుంటున్న పిల్లల రంగు పెన్సిళ్ల నుంచి రూపుదిద్దుకునే రూపం ఈ ప్రేమికులదే. అనేక ఇంటి గోడలను అలంకరించే బ్రాస్ వాల్‌హ్యాంగింగ్స్‌లో వీరి ప్రాణత్యాగ ఘట్టమే. వివరాల్లోకి వెళితే...
 
 తమ ప్రేమ చావకూడదు, ప్రేమను బతికించుకోవాలి, తామిద్దరూ ప్రేమగా జీవించాలి, ప్రేమతో జీవించాలి. అలా జీవించాలంటే రెండు కుటుంబాలకు దూరంగా వెళ్లడమే అప్పుడు యుక్తవయసులో వాళ్లకు కనిపించిన మార్గం.
 
 బాబిలోనియాలో ఒక సాధారణ కుటుంబం పైరమస్‌ది. థిస్‌బే అతడి పక్కింట్లోనే ఉండేది. బాల్యంలో కలిసి ఆడుకోవడంతో మొదలైన స్నేహం వారు యుక్తవయసులోకి వచ్చేటప్పటికి ప్రేమగా మారింది. కారణాలు తెలియదు కానీ ఇద్దరిలో ఏ వైపు తల్లిదండ్రుల నుంచి కూడా వీరి ప్రేమకు అంగీకారం రాలేదు. ఒకరినొకరు కలవకూడదనే ఆంక్షలు జారీ అయ్యాయి. కానీ... విచ్చుకున్న పువ్వు వెదజల్లే పరిమళాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అలాంటిదే ప్రేమ కూడ. తల్లిదండ్రులు వీరిని ఇల్లు దాటనివ్వకుండా కట్టడి చేసినప్పటికీ గోడకు ఉన్న చిన్న రంధ్రం నుంచి ఒకరినొకరు చూసుకునే వాళ్లు, కబుర్లు చెప్పుకునే వాళ్లు. ఇదీ ఎన్నాళ్లో దాగలేదు. పైరమస్, థిస్‌బేలకు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితులను కల్పించారు వారి తల్లిదండ్రులు.
    
 ప్రేమకు దూరంగా జీవించలేమనే నిర్ణయానికి వచ్చారు ఈ ప్రేమికులిద్దరూ. పైరమస్ నుంచి ‘రేపు రాత్రి మన స్నేహితుడు నైనస్ సమాధి పక్కన ఉన్న మల్బరీ చెట్టు దగ్గర కలుద్దాం’ అనే సమాచారం అందుకున్న థిస్‌బే... మరునాటి సాయంత్రం ఇంట్లో వాళ్ల కళ్లుగప్పి మల్బరీ తోటకు చేరింది.  పైరమస్ ప్రేమగా ఇచ్చిన శాలువాను మురిపెంగా చూసుకుంటూ అతడి కోసం ఎదురు చూస్తోంది. ఎటునుంచి వచ్చిందో... ఒక సింహం... దాని దవడ నుంచి రక్తం కారుతోంది. అప్పుడే ఏదో జంతువును చంపి ఆకలి తీర్చుకున్నట్లుంది. సింహాన్ని చూడగానే ప్రాణభయంతో దూరంగా కనిపిస్తున్న రాళ్ల గుట్టల మీదకు పరుగుతీసింది థిస్‌బే. భయంలో ఆమె ఒంటి మీది శాలువా జారి పోవడాన్ని గమనించుకునే స్థితిలో లేదు. కిందపడిన శాలువాని నోటకరిచి చీల్చి అక్కడే వదిలేసి దాహం తీర్చుకోవడానికి ఏటి దారి పట్టింది సింహం.  
 
 పైరమస్ వచ్చాడు... అతడికి థిస్‌బే కనిపించలేదు. ఆమెకు తానిచ్చిన ప్రేమకానుక. రక్తపుచారికలతో పీలికలై ఉంది. నేల మీద సింహం అడుగుల ఆనవాళ్లున్నాయి. తాను ఆలస్యంగా రావడం ఇంతటి అనర్థానికి దారితీస్తుందని ఊహించలేదు. చేతులారా థిస్‌బేను సింహానికి బలి ఇచ్చానని గుండెపగిలేలా ఏడ్చాడు. హఠాత్తుగా లేచి పిడిబాకుతో ఒళ్లంతా పొడుచుకున్నాడు.
 
 సింహం వెళ్లిపోయి ఉంటుందని ధైర్యం కూడదీసుకుని వచ్చింది థిస్‌బే. ఆమె ఊహించని సంఘటన... పైరమస్ రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్నాడు. థిస్‌బే బతికే ఉందన్న ఆనందం... మూతలు పడుతున్న కళ్లను తెరవాలన్న అతడి ప్రయత్నం ఫలించలేదు. థిస్‌బేకి ఒక్కక్షణం ఏం చేయాలో తెలియలేదు. తాను ప్రేమించిన, తనను ప్రేమించిన పైరమస్ ప్రాణాలతో లేడు, పైరమస్ లేకుండా జీవించడం ఎలాగో తనకు తెలియదు. పైరమస్‌కు దగ్గరగానే ఉండాలి ఎప్పటికీ. ప్రాణాలతో సాధ్యం కాకపోతే  ప్రాణం లేకుండా. పైరమస్ చేతిలో ఉన్న కత్తి తీసుకుని తనను తాను పొడుచుకుని అతడి మీద వాలిపోయింది థిస్‌బే.
    
 ప్రేమను బతికించడానికి ప్రాణాలర్పించిన ప్రేమికులు వీరిద్దరూ. అమరమైన వీరి ప్రేమకు ఇప్పటికీ జోహార్లు అర్పిస్తూనే ఉంది ప్రపంచం. రోమియో- జూలియట్‌లకు వీరినే ప్రతీకలుగా తీసుకున్నాడు షేక్‌స్ఫియర్.

>
మరిన్ని వార్తలు