ఆట..

19 Jul, 2015 01:01 IST|Sakshi
ఆట..

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 7
‘‘డాక్టర్! ఇతను కొద్దిగంటల క్రితం ఓ పోలీస్ ఆఫీసర్ని చంపాడు. ఇతన్ని ఎప్పుడు డిశ్చార్జి చేస్తారు?’’ ఓ కంఠం వినిపించింది.
 ‘‘అతన్నిప్పుడు కదిలిస్తే ఇక శవపేటికలోనే ఉంచాలి. ఇంటర్నల్ హెమరేజ్‌తో మరణిస్తాడు’’ డాక్టర్ కంఠం గెరాల్డ్ వాల్ష్‌కి వినిపించింది.
 అతను కళ్లు తెరవకుండా వినసాగాడు.
 ‘‘టెంపరేచర్ నూట రెండుంది. అతని శరీరం ప్రస్తుతం జ్వరం తగ్గించే మందులని స్వీకరించలేదు. అది మరో పదిరోజుల దాకా తగ్గకపోవచ్చు. బుల్లెట్ అతని తుంటి ఎముకలోంచి పక్కటెముకల్లోకి వెళ్లింది. జ్వరం తగ్గాక దాన్ని తొలగించాలి.’’


 ‘‘సరే. అతను పారిపోకుండా కిటికీకి స్టీల్ గ్రిల్స్‌ని అమర్చుదాం. ఇద్దరు పోలీసులని బయట కాపలా కూడా ఉంచుదాం.’’
 ‘‘నర్స్ మిన్  అల్మాకి కూడా ఈ విషయం చెప్పండి.’’
 వాళ్ల మాటలు విన్న గెరాల్డ్ మళ్లీ నిద్రలోకి జారిపోయాడు.
   
నేరస్థులకి మనుషుల మనస్థత్వాలు చక్కగా బోధపడతాయి. లేదా వారు నేరస్థులు కాలేరు. లావుగా ఉన్న ముప్ఫై ఐదేళ్ల అల్మా చేతికి ఉంగరం లేదు. కాబట్టి పెళ్లి కాలేదని గెరాల్డ్ గ్రహించాడు. ఆమె కొంతకాలం పెళ్లికి తహతహలాడి ఉంటుందని భావించాడు.
 ఆమె గెరాల్డ్ నోట్లోంచి థర్మామీటర్ తీని  టెంపరేచర్ చూని  చెప్పింది.
 ‘‘నూట ఒకటి పాయింట్ నాలుగు. సగం డిగ్రీ తగ్గింది. ఎలా ఉంది?’’
 ‘‘గాయం దగ్గర నొప్పి. ఓ నిమిషం పాటు నా చేయిని పట్టుకుంటావా?’’ అర్థించాడు.
 ‘‘దేనికి?’’ ఆశ్చర్యంగా అడిగింది.
 ‘‘దయచేని  పట్టుకోండి.’’
 
ఆమె పట్టుకోగానే అతను కళ్లు మూసుకున్నాడు. అతని మొహంలో ప్రశాంతత, ఆనందం ఆమె గమనించింది. కళ్లు తెరవకుండానే చెప్పాడు.
 ‘‘మిమ్మల్ని చూస్తే నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి గుర్తొస్తోంది.’’
 ‘‘నాలాంటి అమ్మాయిచేత ఆకర్షింపబడ్డారంటే నేను నమ్మను. నేనెలా ఉంటానో నాకు తెలుసు’’ నవ్వింది.
 ‘‘లిప్‌స్టిక్, జుట్టుకి రంగు వేసుకుని చూపరులని ఆకట్టుకునేవాళ్లే అందగత్తెలు అని సినిమాలు, టీవీల్లోని ప్రకటనలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. అందరూ మిన్ అమెరికాలనే కోరుకోరు. మీది సహజమైన అందం.’’
 ‘‘సహజమైన అందం? ఆ మాట వినడానికే నాకు ఆనందంగా ఉంది’’ అల్మా చెప్పింది.
 
ఆ తర్వాత గెరాల్డ్ తన సహజ చాతుర్యంతో ఆమెని తను ప్రేమిస్తున్నాడని నాలుగైదు రోజుల్లో నమ్మించగలిగాడు.
 ఓ రోజు అల్మా చెప్పింది.
 ‘‘మీ జ్వరం వందకి వచ్చింది. పూర్తిగా తగ్గితే ఆపరేషన్ చేని  మిమ్మల్ని బయటకి పంపుతారు. కాబట్టి ఈరోజు నించి మందు ఇవ్వను.’’
 ‘‘నేనా పోలీస్ ఆఫీసర్ని చంపలేదు. పారిపోయిన నా ఫ్రెండ్ పని అది. కానీ ఇదంతా జరగడం కూడా నా మంచికే అయింది. మీతో పరిచయం అయింది. కానీ నేను బతికేది బహుశా ఏడాదే. ఆ తర్వాత నన్ను ఎలక్ట్రిక్ చెయిర్‌లో కూర్చోబెడతారు.’’
 ‘‘మరియా కేపో చిరునామా మీరు పోలీసులకి ఎందుకివ్వటం లేదు?’’ ఆమె అడిగింది.
 
‘‘బేంక్ దొంగతనంలో మేం సంపాదించింది ఆమె దగ్గర ఉంది. అందులో నావంతు ఐదు లక్షల డాలర్లు. తప్పించుకోగలిగితే దాంతో జీవితాంతం హాయిగా బతకచ్చని.’’
 ఆ సాయంత్రం అల్మా, గెరాల్డ్‌తో చెప్పింది.
 ‘‘నేను మిమ్మల్ని ఇక్కడి నించి తప్పిస్తాను. బెడ్ షీట్స్ తీసుకెళ్లే బండిలో మీరు దాక్కుంటే, బేస్‌మెంట్‌లో కారెక్కచ్చు. మనం ఆ డబ్బుతో జీవితాంతం హాయిగా జీవించచ్చు.’’
 గెరాల్డ్ తను పారిపోవడానికి ఆ నర్స్ సహాయం కోరే ఆమెతో ప్రేమ నటించాడు. రోగి కోరింది, డాక్టర్ ఇచ్చింది ఒకటే అయినట్లయింది. ఆమె చేతిని తన చేత్తో అందుకుని నొక్కి చెప్పాడు.
 
‘‘థాంక్స్.’’
 ‘‘నేను నర్స్‌ని కాబట్టి మీకు బాగయ్యేదాకా జాగ్రత్తగా చూసుకోగలను. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ప్రతీ అర్ధరాత్రి ఆ బండి వస్తుంది.’’
 తన ఆటలో ఆమె చక్కటి పావు అవుతుంది అని అతను సంతోషించాడు.
 తమ ముందు నించి వెళ్లే ఆ బండిని వెదకాలనే ఆలోచన గార్డుల్లో ఎవరికీ కలగలేదు. మిస్ అల్మా కారు బేస్‌మెంట్‌లోంచి బయటికి వచ్చాక, గెరాల్డ్ ఆమెకి ఓ అడ్రన్  చెప్పాడు. కారులో అరగంటలో ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. అతను ఓ అపార్ట్‌మెంట్ తలుపు కొట్టాడు.
 ‘‘ఎవరది?’’ ఓ ఆడగొంతు వినిపించింది.

 ‘‘గెరాల్డ్‌ని.’’
 ఓ అందమైన యువతి తలుపు తెరచి ఆశ్చర్యంగా చూసింది. వాళ్లిద్దరూ భావోద్వేగాలతో కౌగలించుకున్నారు. అల్మా ఏం చేయాలో తెలియనట్లుగా నిలబడిపోయింది.
 
 ‘‘నేను నర్స్‌ని కాబట్టి మీకు బాగయ్యేదాకా జాగ్రత్తగా చూసుకోగలను. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ప్రతీ అర్ధరాత్రి ఆ బండి వస్తుంది.’’
 తన ఆటలో ఆమె చక్కటి పావు అవుతుంది అని అతను సంతోషించాడు.
 
 ‘‘అల్మా! నువ్విక వెళ్ళచ్చు’’ గెరాల్డ్ కఠినంగా చెప్పాడు.
 ‘‘ఒక్క క్షణం! ఆమె పోలీసుల దగ్గరికి వెళ్లచ్చు’’ ఆమె చెప్పింది.
 ‘‘విన్నావుగా అల్మా. ఆ పని చేస్తే నువ్వూ జైలుకి వెళ్తావు. హంతకుడికి సహాయం చేయడం కూడా పెద్ద నేరం. ముఖ్యంగా పోలీస్‌ని చంపిన హంతకుడికి.’’
 ‘‘కానీ హత్య చేసింది మీరు కాదు. ఈమె కదా?’’ అల్మా నివ్వెరపోతూ అడిగింది.

 ‘‘అది సగం అబద్ధం. ఇద్దరం కాల్చిన గుళ్లు అతన్ని తాకాయి. ఎవరి గుండు వల్ల చచ్చాడో ఎవరికి తెలుసు? నేనే నువ్వయితే మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లిపోయి ఏం జరగనట్టే ప్రవర్తిస్తాను.’’
 ‘‘కానీ నువ్వు నన్ను ప్రేమించానని చెప్పావు?’’ అల్మా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
 ‘‘అద్దంలో చూసుకో. నువ్వు అసలు ఏ మగాడి ప్రేమకైనా అర్హురాలివైతే ఏనాడో నీకు పెళ్లైపోయేది. వెళ్లు’’ కోపంగా అరిచాడు.
 ‘‘మగాళ్లంతా ఇంతే.’’
 ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి మెట్లు దిగి కిందకి వెళ్లింది.
   
 ‘‘ఏ అపార్ట్‌మెంట్?’’ బయట పోలీస్ యూనిఫాంలో ఉన్న కెప్టెన్ అడిగాడు.
 ‘‘రెండు వందల పదకొండు. ఆమె కూడా ఉంది. ఇక నేను వెళ్లచ్చా?’’ అడిగింది.
 ‘‘వెళ్లచ్చు మిస్ అల్మా. మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞులం.’’
 అల్మాకి గెరాల్డ్ తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ‘నువ్వు అసలు ఏ మగాడి ప్రేమకైనా అర్హురాలివైతే ఏనాడో నీకు పెళ్లైపోయేది.’
 ‘‘నేను చేసిన సహాయం నాకు ఆనందం  కలిగించిన పని’’ చెప్పి ఆమె తన కారువైపు నడిచింది.
 (క్లార్క్ హోవార్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

మరిన్ని వార్తలు