సుజన చచ్చిపోతుందా?!

13 Mar, 2016 00:27 IST|Sakshi
సుజన చచ్చిపోతుందా?!

సీరియల్‌కి ప్రాణం పోసే ఒక పాత్ర ఉన్నట్టుండి మాయమైపోతే చాలా వెలితి ఫీలవుతారు ప్రేక్షకులు. తమ ఇంట్లోని ఒక మనిషే దూరమైపోయినట్టుగా బాధపడిపోతారు. అందుకేనేమో, దర్శకులు అప్పుడప్పుడూ ఒక్కో ముఖ్యమైన పాత్రని చంపేస్తుంటారు. ‘మనసు పలికే మౌనగీతం’లో అలానే జరగబోతోంది. హీరోయిన్ ఇషిత తరువాత అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయిన సుజన చచ్చిపోనుంది. అహంకారంతో భర్తను వదిలేసుకుని, అతడు మరో స్త్రీకి భర్తయిన తర్వాత సాధించాలని చూస్తుంది సుగుణ.

దానికోసం రకరకాల పన్నాగాలు పన్నుతుంది. ఈ మధ్యనే తన దుష్టబుద్ధి కారణంగా పిల్లలకు కూడా దూరమైపోయింది. అయితే ఆమె పాత్ర అక్కడితో అయిపోలేదు. ముందు ముందు ఆమె పాత్ర మరింత కీలకంగా మారబోతోంది. ఆ తర్వాత ప్రాణమూ కోల్పోనుంది. ఇది సీరియల్‌కి దెబ్బ కాకపోయినా, ఆ పాత్రను ప్రేమించే అభిమానులకు మాత్రం పెద్ద లోటే. సుజన పాత్రను అద్భుతంగా పోషింది అనిత. అహంకారానికి నిలువెత్తు రూపంలో కనిపించే ఆమె పాత్ర అర్ధంతరంగా ముగిసిపోవడానికి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి!

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు