ఆ కనుగుడ్డు అదృష్టం కాదు!

17 Jan, 2016 15:51 IST|Sakshi
ఆ కనుగుడ్డు అదృష్టం కాదు!

 అవాస్తవం
 చిన్నపిల్లల్లో మెల్ల కన్ను ఉంటే అది అదృష్టవుని పల్లెల్లో కొందరు అంటూ ఉంటారు. నిజానికి అది భాగ్యం కాదు సరి కదా... దాని వల్ల చిన్నారి దృష్టికోల్పోయే పరిస్థితీ రావచ్చు.  మామూలుగానైతే... ఎటు తిప్పినా రెండు కళ్లూ సవూంతరంగా ఉండాలి. ఈ అలైన్‌మెంట్ లోపించడాన్ని మెల్ల అంటారు. అంటే... రెండు కనుపాపలూ ఒకేవైపు చూడవన్నవూట. ఒక కనుపాప ఎటో ఒక వైపునకు కాస్తంత పక్కకు తిరిగి ఉండటం వల్ల ఆ కంటిలో ఏర్పడే ప్రతిబింబం స్పష్టంగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మెల్లకు తగిన చికిత్స అందించి చూపును చక్కదిద్దాలి.

ఆ ప్రయత్నం చేయకుండా అలాగే వదిలేస్తే, పైకి చూడ్డానికి బాగానే ఉన్నా కనుగుడ్డు సక్రమంగా లేని కన్ను నుంచి మెదడు సిగ్నల్స్‌ను స్వీకరించడం క్రమంగా తగ్గిస్తుండటం, నిరాక రిస్తుండటంతో క్రమంగా ఆ కన్ను చూపు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే పిల్లల్లో మెల్లకన్ను ఉంటే కంటి డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కొందరు తల్లిదండ్రులు ఈ విష యాన్ని మొదటే గమనించినా...  పిల్లలు ఎదిగిన తర్వాత పరీక్షలు చేయించ వచ్చని భావిస్తుంటారు.

అది సరి కాదు. మెల్లకన్నుకు వెంటనే సరైన చికిత్స చేరయించకపోతే అది ఆంబ్లోపియూ (లేజీ ఐ) అనే దుస్థితికి దారితీయువచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుందన్న మాట. సాధారణంగా ఆరేళ్ల లోపు మెల్ల కంటిని చక్కదిద్దకపోతే ఆ కంటిలోని దృష్టిలోపం శాశ్వతం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే మెల్ల కన్నును గుర్తించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.       

మరిన్ని వార్తలు