మనుషుల కన్నా.. సూక్ష్మజీవులే ఎక్కువ

7 Sep, 2014 00:53 IST|Sakshi
మనుషుల కన్నా.. సూక్ష్మజీవులే ఎక్కువ

తెలుసా?
 -    భూగోళం మీద ఉండే మానవుల సంఖ్య కన్నా, మన చర్మం మీద ఉండే సూక్ష్మ జీవుల సంఖ్యే ఎక్కువ!
 -    బూడిద రంగు ఊలు చర్మంతో ఉండే ‘ఆటర్’ అనే సముద్ర జీవులు ఒకదాని చెయ్యి ఒకటి పట్టుకుని మాత్రమే నిద్రపోతాయి. నిద్రపోని సమయంలో చక్కగా ఈత కొడుతూ, చిన్నచిన్న చేపల్ని కడుపారా లాగిస్తుంటాయి.
 -    ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇటలీ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఏకకాలంలో ఒక చేత్తో రాస్తూ, ఇంకో చేత్తో బొమ్మలు గీసేవారు.
 -    మిమిక్ ఆక్టోపస్ తన ఒంటి రంగులను మాత్రమే కాదు... రకరకాల చేపల్లా, సముద్రపు పాముల్లా తన ఆకారాన్ని మార్చుకోగలదు.
 -    1994 నాటి హాలీవుడ్ సినిమా ‘పల్ప్ ఫిక్షన్’లో గడియారాలన్నీ 4.20 దగ్గరే ఆగిపోయి ఉంటాయి.
 -    2011 వరకు రష్యాలో బీరు శీతల పానీయం మాత్రమే. ఆ తర్వాతే ఆ దేశం బీరుని మద్యం కేటగిరీలో చేర్చింది.
 -    భూమి మీద మూడింట రెండొంతుల మందికి మంచు ఎలాగుంటుందో తెలీదు. అంటే వారు తమ జీవితంలో ఒక్కసారైనా  మంచును చూసి ఉండలేదని!
 -    అమెరికాలో ఇళ్లు లేనివారి కన్నా, ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్యే ఎక్కువ.
 -    1904లో సెయింట్ లూయిస్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో గ్రీసు రాసిన జారుడు స్తంభాన్ని ఎక్కడం, రాళ్లు విసరడం, బురదలో కొట్లాడ్డం అనేవి కూడా క్రీడాంశాలుగా ఉన్నాయి!
 -    తుమ్ముని బలవంతంగా ఆపుకుంటే కనుక తల లేదా మెడ భాగంలో నరాలు చిట్లి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని వార్తలు