మినీ బేకరీ

23 Jul, 2016 23:36 IST|Sakshi
మినీ బేకరీ

ఒకప్పుడు చిరుతిళ్లు అంటే మురుకులు, గారెలు మాత్రమే. మహా అంటే షాపుల్లో దొరికే చాక్లెట్లు, బిస్కెట్లు. కానీ ఇప్పుడో... అన్నీ బేక్డ్ ఫుడ్సే. కుకీస్ అనీ చిప్స్ అనీ... రకరకాల వెరైటీలతో వచ్చేస్తున్నాయి. దాంతో చాలామంది అవన్ కొనేసి, ఇంట్లోనే బేక్డ్ ఫుడ్స్‌ను తయారు చేసి పిల్లలకు పెడుతున్నారు. అంతవరకు ఓకే. కానీ మనం బేక్ చేస్తున్నప్పుడు, పదార్థాలను సరైన మోతాదుల్లోనే వేస్తున్నామా? అన్న విషయాన్ని గమనించాలి. అలా ఎలా తెలుస్తుందండీ అంటారా? అయితే ఈ ‘పర్ఫెక్ట్ బేక్ సెట్’ ఇక మీ కోసమే.

ఈ సెట్‌లో స్కేల్, ఫోన్/టాబ్లెట్ స్టాండ్, 3 మిక్సింగ్ బౌల్స్, అవన్ థర్మామీటర్, 3.5 ఎంఎం కేబుల్ ఉంటాయి. ఫోన్/ టాబ్లెట్ (అందులో ఈ పర్ఫెక్ట్ బేక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి) ద్వారా మీ బేకింగ్ ఐటమ్ (రెసిపీ)ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్‌పై బౌల్ పెట్టి, అందులో బేకింగ్‌కు వాడే పదార్థాలను వేస్తూ ఉండాలి. ఎంత మోతాదైతే సరిపోతుందో, ఆ ఇండికేషన్ మనకు ఫోన్లో కనిపిస్తుంది. అలా అన్నీ పర్ఫెక్ట్‌గా వేస్తేనే... మీ బేకింగ్ ఫుడ్స్ (కుకీస్, కేక్స్,...) కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. బేకింగ్ కిట్‌లాగే ‘పర్ఫెక్ట్ డ్రింక్ సెట్’ కూడా దొరుకుతుంది.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

శార్వరి నామ సంవత్సర (మేష రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర ( వృషభ రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర (కర్కాటక రాశి ) రాశిఫలాలు

సినిమా

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..