తల్లి మనసు

12 May, 2019 00:31 IST|Sakshi

మాతృత్వం ఒక అద్భుతమైన వరం.సృష్టి కొనసాగాలంటే, తల్లుల వల్లనే సాధ్యమవుతుంది. తల్లిమనసు గురించిన ప్రస్తావన మన సాహిత్యంలో చాలానే ఉంది. తల్లుల మనసులో మమకారం మాటలకందనిది. అయితే, తల్లుల మనసుల్లోనూ ఆటుపోట్లు ఉంటాయి. అలజడులు ఉంటాయి. ఆందోళనలు ఉంటాయి. మహిళలు తల్లులయ్యేటప్పుడు వారిలో తలెత్తే మానసిక సమస్యలు, వాటి నివారణ, చికిత్స పద్ధతుల గురించి సమగ్రంగా తెలుసుకుందాం.

గర్భం దాల్చాలంటే మహిళలు శారీరకంగా, మానసికంగా పరిపక్వతను కలిగి ఉండాలి. పద్దెనిమిదేళ్ల లోపు, ముప్పయి ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, శారీరక, మానసిక వైకల్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముప్పయి ఐదేళ్ల వయసు దాటిన మహిళలు గర్భం దాల్చినట్లయితే, గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. ప్రసవం కూడా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణులకు పోషకాహారం ముఖ్యం. ప్రొటీన్స్, విటమిన్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభించే రాగులు, బెల్లం, జీడిపప్పు, బాదం వంటి నట్స్, ఖర్జూరాల వంటి డ్రైఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నట్లయితే, గర్భం దాల్చడానికి ముందే వాటిని మానుకోవాలి. గర్భిణుల్లోని దురలవాట్లు పుట్టే పిల్లల్లోని శారీరక, మానసిక, జన్యు లోపాలకు కారణమవుతాయి. మహిళలు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం, నరాలకు సంబంధించిన ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మహిళల్లో థైరాయిడ్‌ లోపాలు, శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి, చికిత్స తీసుకోవాలి. శారీరక, మానసిక లోపాలతో బాధపడే మహిళలకు కుటుంబం మొత్తం ఆసరాగా నిలవాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యవంతులైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇవ్వగలుగుతారు. ఎంతో శక్తితో, ఉత్సాహంతో తమ పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు.

గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు
గర్భం దాల్చిన మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పైకి కనిపించే మార్పులతో పాటు శరీరంలోని హార్మోన్ల స్థాయి, రక్త పరిమాణం, గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గర్భధారణకు అవసరం. అలాగే, ప్రసవం తర్వాత కూడా అనేక రసాయనిక, హార్మోన్‌ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రసవానంతరం చోటు చేసుకునే మార్పులు శిశువు పోషణకు, లాలనకు అవసరం.
గర్భిణి దశలోను, ప్రసవం తర్వాత చోటు చేసుకునే రసాయనిక మార్పుల ఫలితంగా తల్లుల మానసిక స్థితిలోనూ మార్పులు ఏర్పడతాయి. గర్భం దాల్చిన సమయంలోనూ, ప్రసవం తర్వాత కూడా తల్లులకు పోషకాహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల ఆత్మీయత, సహకారం ఎంతో అవసరం. అలాగే, ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా అవసరం.

గర్భం దాల్చిన తొలి మూడు నాలుగు నెలలూ ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో గర్భంలోని శిశువు శరీర నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది. ఎదుగుతున్న ఈ శిశువుపై రసాయనాలు, మందులు, మద్యం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ప్రమాదకరమైన పదార్థాల ప్రభావాన్ని ప్లాసెంటా ఆపగలిగినా, అది సంపూర్ణమైన రక్షణ కవచం కాదు. అందువల్ల ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదు.

శారీరక, మానసిక సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు వారు వాడుతున్న మందుల గురించి వైద్యులకు తెలియజేసి, వారు సూచించిన మేరకు తగిన మార్పులు చేసుకోవాలి. అప్పటి వరకు వాడుతున్న మందులకు బదులుగా గర్భస్థ శిశువులపై ప్రభావం చూపని లేదా తక్కువ ప్రభావం చూపే మందులను ఇస్తారు. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వాస్తవానికి శారీరక, మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న మహిళలు గర్భధారణకు సిద్ధపడే ముందే వైద్యులను సంప్రదించి, అప్పటి వరకు వాడుతున్న మందుల్లో మార్పులు చేయించుకోవడం మంచిది.

మానసిక సమస్యలు ఉన్నవారు అసలు గర్భం దాల్చకూడదనేది అపోహ మాత్రమే. అయితే, వైద్యుల పర్యవేక్షణలో ముందుగా ప్లాన్‌ చేసుకుని, గర్భం దాల్చినప్పుడు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మందులు వాడుతూ గర్భం దాల్చినప్పుడు శిశువులో శారీరక లోపాలు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగానే వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది. 

అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా మందులు వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని మందులు తల్లి పాల ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశించి, దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అందువల్ల వైద్యుల సలహాతో మందుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

సాధారణ మహిళల్లోనూ సమస్యలు తలెత్తవచ్చు
అంతకు ముందు మానసిక సమస్యలేవీ లేని సాధారణ మహిళలు కొందరిలో కూడా గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కొందరు సాధారణ మహిళల్లో సైతం గర్భధారణ సమయంలో డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్, యాంగై్జటీ డిజార్డర్, పానిక్‌ డిజార్డర్, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో తగిన చికిత్స పొందాలి. కొన్ని సమస్యలకు కాగ్నిటివ్‌ థెరపీ, బిహేవియరల్‌ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు. పరిస్థితిని బట్టి కొందరికి మందులను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా వీలైనన్ని తక్కువ మందులు, తక్కువ మోతాదులు సూచించడం జరుగుతుంది. 

ప్రసవం తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పులు, రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రసవానంతరం తలెత్తే మానసిక సమస్యలను ‘పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌’గా వ్యవహరిస్తారు. దాదాపు 80 శాతం మంది మహిళల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసవం తర్వాత చిరాకు, కోపం, దిగులు, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు తాత్కాలికంగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఈ పరిస్థితి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. కొద్దిమందిలో ఈ మార్పులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. అలాంటప్పుడు వీటిని పోస్ట్‌పార్టమ్‌ మానసిక వ్యాధులుగా గుర్తించాలి. ప్రసవం తర్వాత కొద్ది మందిలో ఆందోళన, పానిక్‌ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్, సైకోసిస్‌ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ లేదా సైకోసిస్‌ తీవ్రస్థాయిలో కలిగినప్పుడు కొందరు తల్లుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, పుట్టిన బిడ్డకు హాని కలుగుతుందనే నిష్కారణమైన భయం కలగడం సంభవించవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులు తల్లికి, బిడ్డకు హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి కాన్పులో పోస్ట్‌పార్టమ్‌ మానసిక సమస్యలు తలెత్తిన వారికి, తర్వాతి కాన్పులోనూ అలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి మానసిక సమస్యలకు ఒక్కోసారి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. వైద్యుల సలహా ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే, వ్యాధి రాకుండా ఆపడానికి, ఒకవేళ వచ్చినా లక్షణాల తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి, ఆత్మహత్య, ఇతరత్రా ప్రమాదకర పరిణామాలు సంభవించకుండా నివారించడానికి సాధ్యమవుతుంది.

మన దేశంలో ప్రసవానంతరం మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు 22 శాతం వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా అధ్యయనం వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దక్షిణాదిలో 26 శాతం మంది తల్లులు ప్రసవానంతర మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. జనాల్లో అవగాహన లేమి, పల్లెల్లో వైద్య సౌకర్యాల కొరత వంటి పలు కారణాలు మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళల పరిస్థితిని మరింత జటిలంగా మారుస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో ప్రసవానంతరం మహిళల్లో తలెత్తే మానసిక సమస్యలను మరింత జటిలంగా మారుస్తున్న కొన్ని ముఖ్యమైన కారణాలు...

కుటుంబంలో కలతలు, కుటుంబ సభ్యుల అనాదరణ
- గర్భం దాల్చక ముందే ఉన్న మానసిక సమస్యలకు తగిన చికిత్స పొందకపోవడం
-  ఆడ శిశువును ప్రసవించడం
- పుట్టిన శిశువులో లోపాలు లేదా మృతశిశువు జననం
- మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన భర్త
- భార్యా భర్తల మధ్య అనుబంధంలో అపశ్రుతులు
- తగిన ప్రణాళిక లేకుండా గర్భం దాల్చడం

గర్భం దాల్చాలంటే మహిళలు శారీరకంగా, మానసికంగా పరిపక్వతను కలిగి ఉండాలి. పద్దెనిమిదేళ్ల లోపు, ముప్పయి ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, శారీరక, మానసిక వైకల్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముప్పయి ఐదేళ్ల వయసు దాటిన మహిళలు గర్భం దాల్చినట్లయితే, గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. ప్రసవం కూడా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణులకు పోషకాహారం ముఖ్యం. ప్రొటీన్స్, విటమిన్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభించే రాగులు, బెల్లం, జీడిపప్పు, బాదం వంటి నట్స్, ఖర్జూరాల వంటి డ్రైఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నట్లయితే, గర్భం దాల్చడానికి ముందే వాటిని మానుకోవాలి. గర్భిణుల్లోని దురలవాట్లు పుట్టే పిల్లల్లోని శారీరక, మానసిక, జన్యు లోపాలకు కారణమవుతాయి. మహిళలు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం, నరాలకు సంబంధించిన ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మహిళల్లో థైరాయిడ్‌ లోపాలు, శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి, చికిత్స తీసుకోవాలి. శారీరక, మానసిక లోపాలతో బాధపడే మహిళలకు కుటుంబం మొత్తం ఆసరాగా నిలవాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యవంతులైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇవ్వగలుగుతారు. ఎంతో శక్తితో, ఉత్సాహంతో తమ పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు.

గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు
గర్భం దాల్చిన మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పైకి కనిపించే మార్పులతో పాటు శరీరంలోని హార్మోన్ల స్థాయి, రక్త పరిమాణం, గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గర్భధారణకు అవసరం. అలాగే, ప్రసవం తర్వాత కూడా అనేక రసాయనిక, హార్మోన్‌ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రసవానంతరం చోటు చేసుకునే మార్పులు శిశువు పోషణకు, లాలనకు అవసరం.

గర్భిణి దశలోను, ప్రసవం తర్వాత చోటు చేసుకునే రసాయనిక మార్పుల ఫలితంగా తల్లుల మానసిక స్థితిలోనూ మార్పులు ఏర్పడతాయి. గర్భం దాల్చిన సమయంలోనూ, ప్రసవం తర్వాత కూడా తల్లులకు పోషకాహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల ఆత్మీయత, సహకారం ఎంతో అవసరం. అలాగే, ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా అవసరం.

గర్భం దాల్చిన తొలి మూడు నాలుగు నెలలూ ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో గర్భంలోని శిశువు శరీర నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది. ఎదుగుతున్న ఈ శిశువుపై రసాయనాలు, మందులు, మద్యం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ప్రమాదకరమైన పదార్థాల ప్రభావాన్ని ప్లాసెంటా ఆపగలిగినా, అది సంపూర్ణమైన రక్షణ కవచం కాదు. అందువల్ల ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదు.

శారీరక, మానసిక సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు వారు వాడుతున్న మందుల గురించి వైద్యులకు తెలియజేసి, వారు సూచించిన మేరకు తగిన మార్పులు చేసుకోవాలి. అప్పటి వరకు వాడుతున్న మందులకు బదులుగా గర్భస్థ శిశువులపై ప్రభావం చూపని లేదా తక్కువ ప్రభావం చూపే మందులను ఇస్తారు. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వాస్తవానికి శారీరక, మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న మహిళలు గర్భధారణకు సిద్ధపడే ముందే వైద్యులను సంప్రదించి, అప్పటి వరకు వాడుతున్న మందుల్లో మార్పులు చేయించుకోవడం మంచిది.

మానసిక సమస్యలు ఉన్నవారు అసలు గర్భం దాల్చకూడదనేది అపోహ మాత్రమే. అయితే, వైద్యుల పర్యవేక్షణలో ముందుగా ప్లాన్‌ చేసుకుని, గర్భం దాల్చినప్పుడు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మందులు వాడుతూ గర్భం దాల్చినప్పుడు శిశువులో శారీరక లోపాలు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగానే వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది. 

అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా మందులు వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని మందులు తల్లి పాల ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశించి, దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అందువల్ల వైద్యుల సలహాతో మందుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

సాధారణ మహిళల్లోనూ సమస్యలు తలెత్తవచ్చు
అంతకు ముందు మానసిక సమస్యలేవీ లేని సాధారణ మహిళలు కొందరిలో కూడా గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కొందరు సాధారణ మహిళల్లో సైతం గర్భధారణ సమయంలో డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్, యాంగై్జటీ డిజార్డర్, పానిక్‌ డిజార్డర్, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో తగిన చికిత్స పొందాలి. కొన్ని సమస్యలకు కాగ్నిటివ్‌ థెరపీ, బిహేవియరల్‌ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు. పరిస్థితిని బట్టి కొందరికి మందులను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా వీలైనన్ని తక్కువ మందులు, తక్కువ మోతాదులు సూచించడం జరుగుతుంది. 

ప్రసవం తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పులు, రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రసవానంతరం తలెత్తే మానసిక సమస్యలను ‘పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌’గా వ్యవహరిస్తారు. దాదాపు 80 శాతం మంది మహిళల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసవం తర్వాత చిరాకు, కోపం, దిగులు, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు తాత్కాలికంగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఈ పరిస్థితి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. కొద్దిమందిలో ఈ మార్పులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. అలాంటప్పుడు వీటిని పోస్ట్‌పార్టమ్‌ మానసిక వ్యాధులుగా గుర్తించాలి. ప్రసవం తర్వాత కొద్ది మందిలో ఆందోళన, పానిక్‌ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బైపోలార్‌ డిజార్డర్, సైకోసిస్‌ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ లేదా సైకోసిస్‌ తీవ్రస్థాయిలో కలిగినప్పుడు కొందరు తల్లుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, పుట్టిన బిడ్డకు హాని కలుగుతుందనే నిష్కారణమైన భయం కలగడం సంభవించవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులు తల్లికి, బిడ్డకు హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి కాన్పులో పోస్ట్‌పార్టమ్‌ మానసిక సమస్యలు తలెత్తిన వారికి, తర్వాతి కాన్పులోనూ అలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి మానసిక సమస్యలకు ఒక్కోసారి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. వైద్యుల సలహా ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే, వ్యాధి రాకుండా ఆపడానికి, ఒకవేళ వచ్చినా లక్షణాల తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి, ఆత్మహత్య, ఇతరత్రా ప్రమాదకర పరిణామాలు సంభవించకుండా నివారించడానికి సాధ్యమవుతుంది.

>
మరిన్ని వార్తలు