రొమాంటిక్‌ సింబల్స్‌

8 Sep, 2019 11:47 IST|Sakshi

ఎన్ని ట్రెండ్స్‌ మారిపోతున్నా లవ్‌ సింబల్‌కి ఉన్న క్రేజే వేరు. అది ఎప్పటికీ హృదయాలను దోచే ఎవర్‌గ్రీన్‌ ట్రెండ్‌ అనే చెప్పుకోవాలి. చూడగానే వావ్‌ అనిపించే లవ్‌ సింబల్స్‌ ఏ కలర్‌లో ఉన్నా కళ్లను కట్టిపడేస్తాయి. ఇక ఆ సింబల్స్‌ రెడ్‌ కలర్‌లో ఉంటే వాటికి రొమాంటిక్‌ ఫ్లేవర్‌ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చెయ్యండి. 
మీ నాజూకైన గోళ్లకు మరింత అందాన్ని ఇవ్వండి.

  • ముందుగా నెయిల్స్‌ క్లీన్‌ చేసుకుని.. షేప్‌ చేసుకోవాలి. తర్వాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్‌పరెంట్‌ కలర్‌ వేసుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు రెడ్‌ గ్లిట్టర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని.. కుడి చేతి చూపుడు వేలు, ఉంగరపు వేలుతో పాటూ ఎడమ చేతి మధ్యవేలు, ఉంగరపు వేలు గోళ్లకు అప్లై చేసుకోవాలి.
  • ఇప్పుడు నార్మల్‌ రెడ్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని.. కుడి చేతి మధ్య వేలుకి, బొటన వేలుకి, ఎడమ చేతి చూపుడు వేలుకి అప్లై చేసుకుని ఆరనివ్వాలి. ఇప్పుడు వైట్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని సన్నని బ్రష్‌తో.. కుడి చేతి మధ్యవేలు, ఎడమ చేతి చూపుడు వేలు గోళ్లపైన చిత్రంలో ఉన్న విధంగా లవ్‌ సింబల్స్‌ అప్లై చేసుకోవాలి. వాటి పక్కనే రెడ్‌ స్టోన్‌ అతికించుకోవాలి.
  • తర్వాత కుడి చేతి చిటికెన వేలు గోరుతో పాటూ ఎడమ చేతి చిటికెన వేలు గోరుకి, బొటన వేలుకీ పింక్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ అప్లై చేసుకోవాలి. మరింత క్రేజీ లుక్‌ కోసం.. కుడి చేతి మధ్యవేలు గోరు కింద ఉండే చర్మానికి.. ఎడమ చేతి చూపుడు వేలు గోరు కింద ఉండే చర్మానికి లవ్‌ సింబల్‌ స్టోన్స్‌ అతికించుకుంటే అదిరే లుక్‌ మీ సొంతమవుతుంది.

న్యూ ఫేస్‌
ముఖం కాంతివంతంగా మారాలన్నా... మచ్చలు, మొటిమలు లేకుండా మృదువుగా మారాలన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బయటికి వెళ్లి రాగానే చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, మేకప్‌ తొలగించి నిద్రపోవడం వంటివి చేయడంతో పాటు.. కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. మరింకెందుకు ఆలస్యం ఇలా ట్రై చెయ్యండి.

న్యాచురల్‌ బ్యూటీ కావల్సినవి: క్లీనప్‌ : పచ్చిపాలు – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్‌
స్క్రబ్‌ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, తేనె – 1 టీ స్పూన్, బియ్యప్పిండి – 1 టీ స్పూన్‌
మాస్క్‌: ఆరెంజ్‌ జ్యూస్‌ – 2 టీ స్పూన్లు, శనగపిండి – 1 టీ స్పూన్, ఖర్జూరం గుజ్జు – 1 టీ స్పూన్, అరటి పండు గుజ్జు – 1 టీ స్పూన్‌
తయారీ: ముందుగా పచ్చిపాలు, తేనె కలిపి.. ఆ మిశ్రమంతో ముఖంపై క్లీనప్‌ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, తేనె, బియ్యప్పిండి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్‌ జ్యూస్‌లో శనగపిండి వేసుకుని బాగా కలుపుకుని.. అందులో ఖర్జూరం గుజ్జు, అరటిపండు గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని ముఖానికి అపై్ల చేసుకోవాలి. ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. సహజసిద్ధమైన ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకున్న తర్వాత ముఖానికి సబ్బు పెట్టకపోవడమే మంచిది.

మరిన్ని వార్తలు