ఇలా చేసి చూడండి..

18 Aug, 2019 11:13 IST|Sakshi

న్యూ ఫేస్‌

ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను అన్నివిధాలా మంచిదంటున్నారు నిపుణులు. అయితే అందుకోసం కాస్త సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి: క్లీనప్‌ : తులసి రసం – 1 టీ స్పూన్, పచ్చిపాలు – 2 టీ స్పూన్లు, స్క్రబ్‌ : ఓట్స్‌ – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 3 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్‌
మాస్క్‌:  క్యారెట్‌ గుజ్జు  – 1 టీ స్పూన్, బాదం పేస్ట్‌ – 1 టీ స్పూన్, పచ్చిపాలు – ఒకటిన్నర స్పూన్లు

తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్‌ తీసుకుని తులసి రసం,  పచ్చిపాలు వేసుకుని బాగా కలుపుకుని, మెత్తని క్లాత్‌తో ముఖం, మెడ క్లీనప్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, అరటిపండు గుజ్జు, బియ్యప్పిండి ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్‌ గుజ్జు, బాదం పేస్ట్, పచ్చిపాలు బాగా కలుపుకుని ముఖానికి పట్టించాలి. ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. 

మరిన్ని వార్తలు