కీరదోస పాన్‌ కేక్‌

30 Oct, 2019 12:07 IST|Sakshi

కావలసినవి:
కీరదోసకాయలు – 3; కరాచీ రవ్వ – రెండున్నర కప్పులు; పచ్చిమిర్చి పేస్ట్‌ – 2 టీ స్పూన్లు; గడ్డ పెరుగు – పావు కప్పు; ఉప్పు – సరిపడా; నూనె – కొద్దిగా; కరివేపాకు పేస్ట్‌ – 1 టీ స్పూన్‌; కొత్తిమీర తురుము – 3 టేబుల్‌ స్పూన్లు

తయారీ:
ముందుగా కీరదోసకాయలను శుభ్రం చేసుకుని, గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జులో కరాచీ రవ్వ, గడ్డ పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తురుము, కరివేపాకు పేస్ట్, ఉప్పు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత పెద్ద ఆకారంలో పల్చగా గారెల్లా చేసుకుని పాన్‌ మీద కొద్దిగా ఆయిల్‌ వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటిని వేడి వేడిగా తింటే భలే టేస్టీగా ఉంటాయి.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు