దక్షిణం: కామన్‌సెన్స్‌కు మించిన సలహా లేదు!

22 Sep, 2013 01:15 IST|Sakshi

ఆలస్యం అమృతం విషం - నిదానమే ప్రధానం... ఈ రెండు సామెతలు ఒకేసారి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో ఏదో ఒకటి తప్పనిపిస్తుంది. కానీ...రెండూ కరెక్టే. ముందు మనిషికి ఓ కామన్ సెన్స్ అంటూ ఉంటుంది కదా... దాన్ని వాడితే ఈ రెండు సామెతల్లో ఏది ఎపుడు కరెక్టో తెలుస్తుంది. స్త్రీ విషయంలో కూడా ఇంతకుమించి ఎన్నోరెట్లు కామన్‌సెన్స్ పనిచేయాలి. ప్రపంచంలో అబ్బాయిలు మహా అయితే పది పదిహేను రకాలు ఉంటారు. అమ్మాయిలు... ఎంత మంది ఉంటే అన్నిరకాలుగా ఆలోచిస్తారు. ఒకరి ఆలోచనా తీరు ఉన్నట్లు ఇంకొకరి ప్రవర్తన ఉండదు. అందుకే ఏ అమ్మాయి ప్రేమలో పడినా, ఏ అమ్మాయిని ప్రేమలో పడేయాలన్నా ఆ అమ్మాయి ఆలోచనా తీరుబట్టే ఉండాలి. అమ్మాయిలు అర్థం కారురా బాబూ... అనే బెంగ అక్కర్లేదు. వారు అర్థమవుతారు. కాకపోతే ఎవరికి వారు యునిక్ కాబట్టి మీక్కావల్సిన వారిని మాత్రమే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అందరూ కొన్ని కామన్ టిప్స్ చెబుతుంటారు. అవి అన్నిసార్లూ చెల్లవు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.


     క్రేజీగా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు... ఇది అబ్బాయిలు నమ్మే ఒక కామన్ సూత్రం. ఇది కొంతవరకే నిజం! ఏ బొమ్మరిల్లు సినిమానో చూసి ప్రతి అమ్మాయి మిడ్‌నైట్ ఐస్‌క్రీం తినడం ఇష్టపడుతుందనుకుంటే పొరపాటు. అలానే మిగతా విషయాలూ.
 
     నిజాయితీగా ఉంటే ఇష్టం... ఎందులో నిజాయితీ అన్నది పెద్ద సమస్య. నిజాయితీగా పాత గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న చనువునంతా చెప్పేస్తే ఏ అమ్మాయి భరించగలదు?
     సెన్సాఫ్ హ్యూమర్ అమ్మాయిలకు ఇష్టం... అవును, కానీ అందరికీ సెటైర్లు అర్థం చేసుకునేటంత చిలిపి మనసు ఉండదు. అవి బూమ్‌రాంగ్‌లు అవ్వొచ్చు. మీ జోకులు సులువుగా క్యాచ్ చేసేటంత షార్ప్‌నెస్ ఉంటుందనే గ్యారంటీ ఏమిటి? అది కొందరమ్మాయిలకు కిక్ ఇస్తే, ఇంకొందరు దానివల్లే మనల్ని కిక్  చేయొచ్చు! ఆ వ్యక్తిని బట్టి మోతాదుండాలి.
     స్టేటస్‌కు పడిపోతారు... కాస్ట్లీ బైకు, కారు అందరు అమ్మాయిలను పడగొట్టలేవు. అదేనిజమైతే ఈ ప్రపంచం ఓ నెల కూడా నడవదు.
     కాలం మారినా... కాలం మారింది అమ్మాయిలు ఫాస్ట్ అయిపోయారు. రొమాంటిక్‌గా మాట్లాడాల్సిందే అనుకుంటున్నారా? సినిమాలు చూసి చెడిపోకండి. అందరూ అలా మారాలంటే కనీసం ఒక రెండు మూడు తరాలు మారాలి. ఇంకా మనం మొదటి తరంలోనే ఉన్నాం.
 కొసమెరుపు: ఇలాంటి సూత్రాలు చాలానే ఉన్నాయి. ఎన్నున్నా ఒకటి మాత్రం కామన్‌గా పనిచేస్తుంది. ఎంత శుభ్రంగా, క్రమశిక్షణగా డ్రెస్ చేస్తారు. శరీర సౌష్టవాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటారన్నది మాత్రం మగాడిలో ప్రతి అమ్మాయికీ కామన్‌గా నచ్చే అంశం.
 
 ‘ఆ ముద్దు’... చాలా పాతది
 ఇది 2013. కానీ... ఇప్పటికీ సినిమాలో లిప్‌కిస్ పెట్టడం ఒక వార్త. రొమాంటిజమ్‌లో అధిక మార్కులు కొట్టేసే ఈ చర్య పాశ్చాత్యులకే కాదు, భారతీయులకీ పాతదే అంటే నమ్ముతారా. ఎనైభె  సంవత్సరాల క్రితమే ఇది భారతీయ సినిమాల్లో ఉంది. అంటే భారతీయ సినిమా పుట్టిన 20 ఏళ్లకే మన వాళ్లు లిప్‌కిస్ పరిచయం చేసేశారు. 1933లో తీసిన కర్మ సినిమాలో హిమాంశు రాయి, దేవికా రాణిల ఈ మద్య ఈ ముద్దు సీను నడిచింది. బాలీవుడ్‌లో ఇదే తొలి రొమాంటిక్ సీన్. సామాజిక స్వాతంత్య్రం కంటే ముందుగానే భారతీయులు రొమాంటిక్ స్వాతంత్య్రం సంపాదించేశారా?
 - ప్రకాష్ చిమ్మల

మరిన్ని వార్తలు