గోళ్లెక్కిన లేసులు

8 Oct, 2016 22:08 IST|Sakshi
గోళ్లెక్కిన లేసులు

నెయిల్ ఆర్ట్
ఇది ‘ఓరియంటల్ లేస్’ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి లైట్ రెడ్, వైట్, ట్రాన్స్‌పరెంట్ కలర్ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవడం చాలా సింపుల్‌గా ఉండటమే కాదు.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని పిల్లల చేతులకు వేస్తే, వారు భలేగా ముచ్చట పడతారు. ఇప్పటివరకు చీరలు, డ్రెస్సులకే లేసులు వేయడం చూసుంటారు.. కానీ గోళ్లకూ వేయాలనుకుంటే.. ఈ నెయిల్ ఆర్ట్‌ను వేసుకుంటే సరి.
 
1.    ముందుగా గోళ్లన్నిటికీ లైట్ రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌ను పూర్తిగా అప్లై చేయాలి. తర్వాత వైట్ పాలిష్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి.
2.    ఇప్పుడు ఆ చుక్కలను మూడు పూరేకులుగా చేసుకోవాలి.
3.    ఆ పైన పూరేకులను ఫొటోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయాలి.
4.    తర్వాత వైట్ కలర్ పాలిష్‌తో మునుపటి డిజైన్‌కి పై భాగంలో సన్నగా అయిదు చుక్కలు పెట్టుకోవాలి.
5.    ఇప్పుడు ఆ చుక్కలకు ఇరువైపుల మరో రెండు రెండు చుక్కలు పెట్టాలి.
6.    ఫొటోలో కనిపిస్తున్న విధంగా వైట్ పాలిష్ వేసిన చోట లైట్ రెడ్ కలర్‌తో మూడు చుక్కలు పెట్టుకోవాలి.
7.    ఆ ఎరుపు రంగు చుక్కలను కూడా పూరేకుల్లా చేసుకోవాలి.
8.    తర్వాత ఆ ఎరుపు పూరేకులపై వైట్ కలర్‌తో మూడు గీతలు గీయాలి. చివరగా గోళ్లన్నిటి పై ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌తో సింగిల్ కోట్ వేస్తే.. డిజైన్ లుక్కే మారిపోతుంది.

>
మరిన్ని వార్తలు