భాషణం: ఇంగ్లిష్‌లోకి కొత్త మాటొచ్చింది!

7 Dec, 2013 23:35 IST|Sakshi
భాషణం: ఇంగ్లిష్‌లోకి కొత్త మాటొచ్చింది!

Selfie అనే మాట డిక్షనరీలలో ఉండదు. అయితే ఈ ఏడాది కొత్తగా ప్రింట్ అయ్యే ఆంగ్ల నిఘంటువులలో ఈ మాట మనకు కనిపించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రచురణకర్తలు word of the year గా selfie ని ఎంపిక చేశారు. Selfie అంటే డిజిటల్ కెమెరాతో గానీ, కెమెరా ఫోన్‌తో గానీ మనకు మనం తీసుకున్న సెల్ఫ్ పోట్రెయిట్ ఫొటోగ్రాఫ్. selfie ని సెల్ఫీ అని పలకాలి. సెల్ఫై అని కూడా అంటున్నారు. వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా సెల్ఫీ ఎంపికైన సందర్భంగా ఈవారం self తో వచ్చే కొన్ని పదబంధాల గురించి తెలుసుకుందాం.


 self అంటే ‘స్వయంగా’ అని సాధారణ అర్థం. ‘ఆత్మ’ అని కూడా. అయితే ఇక్కడ ఆత్మ అంటే spirit కాదు. ఆత్మగౌరవాన్ని self-respect అనీ, ఆత్మవిశ్వాసాన్ని self-confidence అనీ అంటాం కదా అలా అన్నమాట. self పక్కన - (డాష్) పెట్టి ఏ మాటను ఉంచినా ‘స్వీయ’ అనే అర్థం వస్తుంది. ఉదా: self-addressed, self-appointed, self-awareness, self-conscious, self-styled, self-discipline, self-distruction, self-help, self-image... ఇలా వందల్లోనే ఉంటాయి కనుక మనం ఇలాంటి వాటిని వదిలేసి, self తో వచ్చే ఫ్రేజ్ (పదబంధం)లకే పరిమితం అవడం సులభంగా ఉంటుంది.
 give yourself airs  A…sôæ to behave as if you are more important than you really are. అంత సీన్ లేకపోయినా ఉన్నట్లు బిహేవ్ చెయ్యడమని. ఈ వాక్యాలు చూడండి చక్కగా అర్థమౌతుంది.
 1. Put no attention to her. She is just putting on airs. 2. Stop giving yourself airs and act like the rest of us.
 ఇక, ఏదైనా పని చెయ్యడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని fall over yourself అంటారు. అమెరికన్ ఇంగ్లిషులో ఇది fall all over yourself. (They falling over themselves to be helpful. పడీ పడీ సహాయం చేయబోయారని).  
 gird yourself అనే ఫ్రేజ్ ఒకటి ఉంది. దీనినే gird (up) your loins అని కూడా అంటారు. ఇది హ్యూమరస్ ఎక్స్‌ప్రెషన్. gird అంటే ఒంటికి బిగించుకోవడం. దీనిని గార్డ్ అని పలకాలి. గిర్డ్ అని కాదు. యుద్ధానికి వెళ్లేటప్పుడు కత్తులు, కవచాలతో సిద్ధమవడం గార్డింగ్. అందుకే ఎవరైనా ఏ పనికైనా పగడ్బందీగా తయారవుతూ యుద్ధానికి వెళ్లినంత పనిచేస్తుంటే girded themselves for the fray (prepared for action or trouble) అని జోక్ చేస్తారు.
 మరి gird (up) your loins  లోని loins  అనే మాటకు అర్థం ఏమిటి? కాళ్లకు పైన, నడుముకు కింద ఉండే భాగాన్ని loins (లోయిన్స్) అంటారు. gird the loins  అంటే నడుము బిగించడం. బృహత్తర పథకానికి నడుము బిగించారు అంటుంటారు కదా.. అలా దీనిని అర్థం చేసుకోవచ్చు.
 
 Unto thine own self be true అని ఇంగ్లిష్‌లో ఓ సామెత. ‘నీ మనసుకు నచ్చిన దానిని మాత్రమే నువ్వు చెయ్యి’ అని చెప్పడం. అంటే ఆత్మవంచన చేసుకోవద్దని. నిన్ను నువ్వు ఒప్పించుకుని, నొప్పించుకుని కాకుండా మనస్ఫూర్తిగా నీకు చేయాలనిపిస్తేనే చెయ్యమని సూచించడం. నిజానికిది సామెత కాదు. Monologue. స్వగతం. విలియమ్ షేక్స్‌పియర్ రాసిన ‘హ్యామ్లెట్’ నాటకంలోని పోలోనియస్ అనే పాత్ర స్వగతం. ఆ పాత్ర తనలో తాను to thine own self be true అనుకుంటుంది. క్రమేణా అది Unto thine own self be trueగా, ఒక సామెతగా వాడుకలోకి వచ్చింది. ప్రధానంగా ‘నువ్వు నీలా ఉండు’ అనే అర్థంలో దీనిని వాడతారు.
 
 be a shadow of your former self మునుపటంత ఆరోగ్యంగా లేవని చెప్పడానికి ఇలా అంటారు. అలాగే మునుపున్నంత ప్రభావం లేకపోవడాన్ని కూడా. అంటే పూర్వ వైభవం లేదని. మనిషి మనిషిలా కాకుండా, మనిషి నీడలా మిగిలాడని. ఈ వాక్యం చూడండి. He came home from hospital cured of the disease but a shadow of his former self.  అలాగే ఇంకో వాక్యం. With most of its best players traded away, the team was reduced to a shadow of its former self.

మరిన్ని వార్తలు