ఉడతను పోలిన బుడత!

22 Feb, 2015 01:57 IST|Sakshi
ఉడతను పోలిన బుడత!

ప్లే టైమ్
గుండ్రని కళ్లతో, దట్టంగా ఉండే బొచ్చుతో, దళసరి చర్మంతో, పిడికెడంత రూపంతో ఉండే దీని పేరు ఫ్లయింగ్ లెమర్. ప్రధానంగా ఆగ్నేసియాలోని వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. లెమర్లలో ఉండే కొన్ని వందల జాతుల్లో ఈ ఫ్లయింగ్ లెమర్ కూడా ఒకటి. విచిత్రమేమిటంటే దీని పేరును బట్టి గాల్లో విహరిస్తుందనుకొంటాం. కానీ దీనికి రెక్కలేం ఉండవు, ఎగరనూ లేదు. చెట్ల కొమ్మలపై ఉరుకులుపరుగులతో కదులుతుంటుంది. చెట్లకు వేలాడుతుంది.

అందుకే దీన్ని ఫ్లయింగ్ లెమర్ అంటారు. కచ్చితంగా చెప్పాలంటే దీని జీవనశైలి మన దగ్గర విస్తృతంగా కనిపించే ఉడుతలతో పోలి ఉంటుంది. చెట్ల కొమ్మలపై అటూ ఇటూ ఎగురుతూ ఉత్సాహంగా కనిపిస్తుంటుంది. ఫ్లయింగ్ లెమర్ శాకాహారి. చెట్ల ఆకులనూ, తనకు ఇష్టమైన కొమ్మలనూ కొరుక్కుతింటుంది. ఇది కిలో నుంచి ఒకటిన్నర కిలో వరకూ పెరుగుతుంది. ఫ్లయింగ్ లెమర్ క్షీరజాతికే చెందినది. ఆడ లెమర్లు ఒకటీ రెండు పిల్లలకు జన్మనిచ్చి పిల్లలకు పాలిచ్చిపెంచుతాయి.

మరిన్ని వార్తలు