డైరీ రాయడం రావట్లేదు!

14 Feb, 2016 14:58 IST|Sakshi
డైరీ రాయడం రావట్లేదు!

పాఠకులనైనా, ప్రేక్షకులనైనా అత్యంత ఆకర్షించే అంశాల్లో క్రైమ్ ముందుంటుంది. అందుకనే నేర సంబంధిత షోలు ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాయి. అవుతాయా? కచ్చితంగా అవుతాయి. కానీ తీయాల్సినట్టే తీస్తేనే. ఏ హిందీ చానెలైనా చూడండి... తప్పకుండా క్రైమ్ షో ఉంటుంది. సావధాన్ ఇండియా, క్రైమ్ పెట్రోల్, గుమ్‌రాహ్... ఇలా ఎన్నో. ఈ తరహాలోనే తెలుగులో మొదలైంది... పోలీస్ డైరీ. అయితే హిట్ మాత్రం కాలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

హిందీ క్రైమ్ షోస్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం... స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు మంచి నటీనటులు. కానీ పోలీస్ డైరీలో నటీనటులను చూస్తే అసలు వీళ్లకు నటన వచ్చా అనిపి స్తుంది. వాళ్ల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఎంత ఆర్టిఫీషియల్‌గా ఉంటాయంటే, చానెల్ మార్చే వరకూ మనశ్శాంతి ఉండదు ప్రేక్ష కుడికి. హిందీ షోలలో ఒక్కోసారి యాంకర్లుగా ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తుంటారు.

ఇక్కడ మొదట్లో నాగబాబుతో మొదలెట్టినా, తర్వాత గ్లామర్ లేకుండా చేసేశారు. జనాన్ని చైతన్యవంతుల్ని చేస్తామని చెప్తూ... ఎంతసేపూ వివా హేతర సంబంధాలు, అమ్మాయిల ట్రాప్ వంటివే ఎక్కువగా చూపిస్తు న్నారు. కొన్ని సన్నివేశాల్ని కాస్త అతిగా చూపించడం కూడా జరుగుతోంది. ఈ మైనస్‌లన్నీ చూస్తే, డైరీ రాయడం రానట్టే అన్పిస్తోంది మరి!

మరిన్ని వార్తలు