సైకో.. స్టాన్‌లీ

13 Sep, 2014 22:58 IST|Sakshi
సైకో.. స్టాన్‌లీ

ప్రతి మనిషిలోనూ మంచీ చెడూ ఉంటాయి. మంచి ఎక్కువ ఉంటే అతడు మహానుభావుడు అవుతాడు. చెడు హద్దులు దాటితే రాక్షసుడు అవుతాడు. మహానుభావుడు కాకపోయినా ఫర్వాలేదు. రాక్షసుడు కాకుండా ఉంటే చాలు. ఇతరుల జీవితాలతో, ప్రాణాలతో ఆడుకోకుండా ఉంటే చాలు. అతణ్ని చూశాక అందరికీ ఇలానే అనిపించింది. ఇలాంటివాడు ఇక పుట్టకుండా ఉంటే బాగుణ్ననిపించింది. ఇంతకీ ఎవరతడు? ఏం చేశాడు?
 
 ఫిబ్రవరి 8, 1983... ఇంగ్లండ్. ఆఫీసులో కూర్చుని తన ఇద్దరు అసిస్టెంట్‌లకు ఓ కేసు గురించి వివరిస్తున్నాడు డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ పీటర్ జే. అంతలో ఫోన్ రింగయ్యింది. తీసి ‘హలో’ అన్నాడు. ‘‘హలో... మిస్టర్ జే. దిసీజ్ ఇన్‌స్పెక్టర్ స్టాన్‌లీ. మీతో కాస్త పనుంది, ఒకసారి రాగలరా’’... ఆ మాటలోని తీవ్రతను బట్టి తను వెళ్లడం ఎంత అవసరమో అంచనా వేసుకున్నాడు జే. ఫోన్ పెట్టేసి, తన అసిస్టెంట్లను తీసుకుని బయలుదేరాడు. అరగంటలో వాళ్లు ‘23, క్రాన్లీ గార్డెన్స్’ దగ్గర ఉన్నారు.
 
 ‘‘ఏమయ్యింది’’ అన్నాడు జే. ‘‘వాళ్లను అడగండి’’ అంటూ ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వైపు చూపించాడు స్టాన్‌లీ. వాళ్లవైపు చూశాడు జే. యూనిఫామ్, దాని మీద ఉన్న ముద్రలను బట్టి ఆ ఇద్దరూ డ్రైనేజీ పని చేయడానికి వచ్చిన వారని అర్థమయ్యింది. ‘‘ఏం జరిగింది’’ అన్నాడు వాళ్ల ముఖాల్లోకి చూస్తూ. ‘‘నా పేరు మైఖేల్ సర్. ఈయన మా సూపర్‌వైజర్ గ్యారీ వీలర్. డ్రైనేజీ బ్లాక్ అవుతోందని ఈ ఇంట్లో అద్దెకుండేవాళ్లు నిన్న సాయంత్రం కంప్లయింట్ ఇచ్చారు. నేను పొద్దున్నే వచ్చి చూస్తే డ్రైనేజీకి అడ్డంగా ఏవేవో ఉన్నాయి.
 
 అవి చూసి అనుమానం వచ్చి మా సార్‌కి ఫోన్ చేశాను’’... గడగడా చెప్పాడో వ్యక్తి. ‘‘అడ్డంగా ఉన్నాయా... ఏంటవి?’’ అనుమానంగా అన్నాడు జే.‘‘మాంసపు ముద్దల్లాగా అనిపించాయి సర్. ఎముకలు కూడా ఉన్నాయి.’’ ‘‘వ్వా...ట్? నిజమేనా’’ అన్నాడు జే ఆశ్చర్యంగా. నిజమేనన్నట్టు తలాడించాడు స్టాన్‌లీ. ‘‘అందుకే మిమ్మల్ని రమ్మన్నాను జే. చూస్తుంటే మాంసంలానే ఉంది. కాకపోతే మనిషిదో, జంతువుదో తెలియక ల్యాబ్‌కి పంపించాను. కాసేపట్లో రిపోర్ట్ వస్తుంది’’ అంటుండగానే ఓ వ్యక్తి వచ్చి కవర్ ఇచ్చాడు. దాన్ని జేకి అందించాడు స్టాన్‌లీ. ‘‘మై గాడ్’’.. మనిషి మాంసమే. ‘‘పైగా ఒకరిది కాదు, చాలామందిది  కలిసుంది’’అందరూ అవాక్కయ్యారు. ‘‘మనుషుల మాంసమా?’’... భయంగా అన్నాడు మైఖేల్. ‘‘మీరిక వెళ్లండి. అవసరమైతే కబురు పెడతాం’’ అన్నాడు స్టాన్‌లీ. వాళ్లిద్దరూ తలూపి అక్కడ్నుంచి కదిలారు. కానీ మైఖేల్ ఆగి వెనక్కి వచ్చాడు. ‘‘సర్... మీకో విషయం చెప్పాలి. పొద్దున్న నేను... డ్రైనేజీ చెక్ చేయాలని చెప్పినా కింది పోర్షన్లోకి వ్యక్తి లోపలికి రానివ్వలేదు. తర్వాత చూద్దాం అంటూ తలుపు మూసేసుకున్నాడు.’’జే, స్టాన్‌లీలు ముఖాలు చూసుకున్నారు. జే తలాడించాడు... నేను చూసుకుంటాను అన్నట్టుగా.
    
 రాత్రి పది కావస్తోంది. తన అసిస్టెంట్లతో కలిసి ఎవరికీ కనిపించకుండా చీకట్లో నిలబడి ఉన్నాడు జే. ముగ్గురి కళ్లూ ఆ ఇంటి మీదే ఉన్నాయి. ఓ అరగంట తర్వాత ఓ కారు మెల్లగా వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగి వెళ్లి గేటు తీసుకున్నాడు. తర్వాత కారెక్కి లోనికి వెళ్లిపోయాడు. కారు పార్క్ చేసి మళ్లీ వచ్చి గేటు వేశాడు. ఓసారి అటూ ఇటూ చూసి లోపలికి వెళ్లి తలుపేసుకున్నాడు. వెంటనే ముగ్గురూ ఇంటివైపు నడి చారు. నాలుగైదుసార్లు కాలింగ్‌బెల్ కొడితేనే గానీ తలుపు తీయలేదా వ్యక్తి. జే బృందాన్ని చూసి తేరిపార చూసి, ‘‘ఏం కావాలి’’ అన్నాడు సీరియస్‌గా. ‘‘నేను డిటెక్టివ్ జే... వీళ్లు నా అసిస్టెంట్లు. మీ ఇంటి డ్రైనేజీ బ్లాక్ అయ్యిందంట కదా... ఓసారి చూడాలి.’’
 
 ‘‘డ్రైనేజీతో పోలీసులకి, డిటెక్టివ్‌లకీ ఏంటి సంబంధం?’’
 చురుక్కున చూశాడు జే. ‘‘అది తర్వాత చెప్తాను. ముందు మా పని మమ్మల్ని చేసుకోనివ్వు’’ అంటూ లోనికి జొరబడ్డాడు. లోపల అడుగు పెడుతూనే మాంసం కుళ్లిన వాసన గుప్పుమంది. ముగ్గురూ ఖర్చీఫులు తీసి ముక్కుకు అడ్డు పెట్టుకున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో గదిలోకి దూసుకెళ్లారు. కాసేపటి తర్వాత అసిస్టెంట్ వంటింట్లోంచి అరిచాడు... ‘‘సర్... ఇటు రండి’’. జే అటు పరుగెత్తాడు. అప్పటికే రెండో అసిస్టెంట్ కూడా అక్కడున్నాడు. ఆ ఇద్దరి ముఖాలూ పాలిపోయాయి. ‘‘ఏమైంది’’ అంటూ వంటింట్లోకి వెళ్లాడు జే. అంతే... కడుపులో తిప్పినట్టయ్యింది. వంట గది నిండా మాంసపు ముద్దలు చెల్లా చెదరుగా పడివున్నాయి. అవి మా నుంచే తీశారు అన్నట్టుగా రెండు మృతదేహాలు... మొండెం నుంచి వేరు చేయబడ్డ కాళ్లు, చేతులు... ఒలిచిన చర్మం... మాంసం తీసేయగా మిగిలిన ఎముకలు...
 ‘‘ఏంటి సర్ ఇది? ఇంత దారుణంగా...’’... మాట పూర్తి చేయలేకపోయాడు అసిస్టెంట్.
 
 ‘‘మనిషా, రాక్షసుడా’’ అంటూ ఆవేశంగా హాల్లోకి వచ్చాడు జే. ఆ వ్యక్తి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. కనీసం అతడు పారిపోవడానికి కూడా ప్రయత్నించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది ముగ్గురికీ. మెల్లగా వెళ్లి అతడికెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు.
 ‘‘నా పేరు డెన్నిస్ నిల్సన్. ఇదంతా చేసింది నేనే. మీరు నన్ను అడగబోయే రెండు ప్రశ్నలకూ ఇవే సమాధానాలు.’’ ఎలా రియాక్టవ్వాలో అర్థం కాలేదు జేకి. తన సర్వీస్‌లో ఎంతోమంది నేరస్తులను చూశాడు. కానీ ఇలాంటి వ్యక్తినీ చూడలేదు. ఇలాంటి కేసునూ డీల్ చేయలేదు.
 
 ‘‘ఎందుకు చేశావిదంతా? వాళ్లు ఎవరు? ఎందుకు చంపావ్?’’... ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘‘మీకు మరీ తొందరెక్కువ మిస్టర్ జే. అన్నీ ఇక్కడే అడిగేస్తున్నారు. పదండి... స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుకుందాం’’ అంటూ లేచాడు. అతణ్ని పోలీసులకు అప్పగించడానికి బయలుదేరింది జే బృందం.
    
 ‘‘సరిగ్గా గుర్తులేదు సర్. పదిహేనో, పదహారో అనుకుంటాను’’
 ఉలిక్కిపడ్డాడు స్టాన్‌లీ. ‘‘అన్ని హత్యలు ఎందుకు చేశావ్?’’
 ‘‘ప్రేమ కోసం’’...
 ‘‘చంపితే ప్రేమ దొరుకుతుందా?’’
 ‘‘చంపితే దొరుకుతుందని కాదు. దొరకలేదు కాబట్టి చంపాను. వాళ్లందరినీ నేను ప్రేమించాను. కానీ ఎవ్వరూ నా ప్రేమను అర్థం చేసుకోలేదు.’’
 ‘‘అంటే వాళ్లంతా ఆడవాళ్లా?’’
 ‘‘కాదు... అందరూ మగాళ్లే.’’
 ‘‘అదేంటి?’’
 ‘‘నేను ‘గే’ని.’’
 
 విస్తుపోయాడు స్టాన్‌లీ. నిల్సన్ ప్రవర్తన అంతు పట్టడం లేదతనికి. కాస్త కూడా బెదురు లేదు. తప్పు చేశానన్న బాధ లేదు. దొరికిపోయానన్న కంగారూ లేదు. స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. సినిమా కథ చెబుతున్నంత కూల్‌గా తన నేరాల గురించి మాట్లాడుతున్నాడు. స్టాన్‌లీ పెద్ద కష్టపడకుండానే తన గుట్టు మొత్తం విప్పేశాడు.
 నిల్సన్ స్కాంట్లాండులో పుట్టాడు. తండ్రి ఆర్మీ అధికారి. ఉద్యోగం తప్ప మరేమీ పట్టదు. చివరికి ప్రేమించి పెళ్లాడిన భార్య ముఖం కూడా సంవత్సరంలో ఒకట్రెండుసార్లే చూసేవాడు. ముగ్గురు బిడ్డలకూ అతడి ముఖం కూడా సరిగ్గా గుర్తుండేది కాదు. దాంతో విసిగిపోయిన నిల్సన్ తల్లి భర్తతో గొడవేసుకుంది.
 
 మాటా మాటా పెరిగింది. బంధం చెడింది. భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరిందామె. అక్కడ తన తాతయ్యతో అనుబంధం ఏర్పడింది నిల్సన్‌కి. ఎప్పుడూ ఆయనతోనే ఉండేవాడు. అందుకే ఆయన గుండెనొప్పితో చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా ఏడ్చాడు. తాతయ్య పోయిన బాధ, తనను పెద్దగా పట్టించుకోని అమ్మ, అన్నయ్య... తన బాధ వినేంత వయసు లేని చెల్లెలు... వెరసి ఒంటరిగా కుమిలిపోయేవాడు నిల్సన్. అనురాగాన్ని బయట వెతుక్కునేవాడు. స్నేహితులతో సమయం గడిపేవాడు. ఆ క్రమంలోనే తాను మగవారి పట్ల ఆకర్షితుడవుతున్నానని గుర్తించాడు. ఆ విషయం ఎవరికీ తెలియకూడదని వెళ్లి సైన్యంలో చేరిపోయాడు.
 
 చాలా యేళ్లపాటు సైన్యంలో పని చేసిన తరువాత విసుగు చెంది బయటకు వచ్చేశాడు నిల్సన్. పోలీస్ డిపార్ట్‌మెంట్లో చేరాడు. అదీ నచ్చలేదు. వదిలేసి ఒక కంపెనీలో చేరాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఇల్లు తీసుకున్నాడు. తన ఒంటరితనాన్ని మర్చిపోవడానికి విపరీతంగా తాగేవాడు. పబ్బుల చుట్టూ తిరిగేవాడు. అప్పుడే తనలాంటి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ ఆ బంధం కొన్నాళ్లకే సడలిపోయింది. ఆ వ్యక్తిని చాలా ప్రేమించాడు.
 
 జీవితాంతం తనతో ఉంటాడని అనుకున్నాడు. కానీ అతడు వెళ్లిపోయేసరికి బాధ, కోపం, కసి. ఆ తర్వాత కూడా చాలామందితో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవాలని చూశాడు. ఎవ్వరూ అతడికి దగ్గరవ్వలేదు. ప్రేమ చూపించలేదు. దాంతో విసిగిపోయాడు. పబ్బుల దగ్గర మాటేసి మత్తులో ఉన్న యువకులని పార్టీ చేసుకుందామంటూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. బాగా తాగించి, స్పృహ కోల్పోయాక గొంతు నులిమేవాడు. తర్వాత నీటితో నిండిన బక్కెట్లో వారి తలను ముంచి చంపేసేవాడు. ఆపైన ఆ మృతదేహాలతో కోరికలు తీర్చుకునేవాడు. తర్వాత ప్లాస్లిక్ సంచిలో చుట్టి అండర్‌గ్రౌండ్‌లో దాచేవాడు. కానీ అవి కుళ్లిపోయి కంపు కొట్టసాగాయి. పురుగులు పట్టసాగాయి. దాంతో దేహాలను నరికి, మాంసాన్ని తీసి ప్లాస్టిక్ సంచుల్లో మూటగట్టేవాడు. చర్మం, మాంసం తేలికగా ఊడి రావడానికని తలల్ని ఉడికించేవాడు. వాటన్నిటినీ లేవట్రీలో కూరేసేవాడు. అవి డ్రైనేజీలోకి పోయి పేరుకుపోయాయి. అది బ్లాక్ అవడంతో అసలు కథ బయటకు వచ్చింది.
 
 ఇదంతా నిల్సనే స్వయంగా చెప్పాడు. అతడి పాపాల చిట్టాని పోలీసులు కోర్టుకు సమర్పించారు. న్యాయస్థానం అతడిని జీవితాంతం జైల్లోనే ఉండమని ఆదేశించింది. ప్రస్తుతం యార్క్‌షైర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. తను చేసిన నేరాలకు తన తలరాతని, తనను ‘గే’గా పుట్టించిన భగవంతుడిని నిందిస్తాడు నిల్సన్. అది కరెక్టేనా? అతడికున్నది హార్మోన్ల సమస్య. ఆ సమస్య ఉన్నవాళ్లందరూ అతడిలానే తప్పుదారి పడుతున్నారా? ప్రాణాలు తీస్తున్నారా? లేదు. ఎవరు చేసినా, ఎందుకు చేసినా, ఎలా చేసినా... నేరం నేరమే. నేరానికి శిక్ష అనుభవించక తప్పదు. అందుకే ఇప్పుడు నిల్సన్... జైలు గోడల మధ్య మగ్గిపోతున్నాడు!
 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌