గర్భనిరోధక మాత్రతో డిప్రెషన్ రిస్క్!

8 Oct, 2016 22:41 IST|Sakshi
గర్భనిరోధక మాత్రతో డిప్రెషన్ రిస్క్!

గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో డిప్రెషన్ ముప్పు పెరుగుతుందంటున్నారు డెన్మార్క్ చెందిన నిపుణులు. దాదాపు పది లక్షల మంది మహిళల్లో నిర్వహించిన అధ్యయన ఫలితాలను వివరించారు. హార్మోన్లను ప్రభావితం చేసే గర్భనిరోధక మాత్రల వల్ల మానసిక వ్యాకులత, నిరాశ నిస్పృహ కలుగుతాయని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్‌కు చెందిన డాక్టర్ ఓజ్‌విండ్ లిడెగార్డ్. చాలా రకాల పిల్స్ మూడ్స్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. కుటుంబ చరిత్రలో డిప్రెషన్ వంటివి ఉంటే మాత్రం హార్మోన్లను ప్రభావితం చేయని ఇంట్రాయుటిరైన్ డివైజ్‌లు (ఐయూడీ) వాడటం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు