అమెరికాలో వేళ్లూనుకున్న తెలుగు సంఘాలు

9 Nov, 2014 00:06 IST|Sakshi
అమెరికాలో వేళ్లూనుకున్న తెలుగు సంఘాలు

‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అని రాయప్రోలు ఏనాడో చెప్పారు. విదేశాలలో, ముఖ్యంగా అమెరికాలో ఉన్న మన తెలుగువారందరూ అదే పని చేస్తున్నారు. అందుకు నిదర్శనమే అమెరికాలో వేళ్లూనుకొని అక్కడున్న మన వాళ్లకి తెలుగు భాషలోని తియ్యందనాన్ని పంచుతున్న తెలుగు సంఘాలు!
 
జాతీయ సంఘాలైన తానా, ఆటా, నాట్స్, నాటా, సిలికానాంధ్రలతోపాటు అక్కడ ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ, తెలుగు వారున్న ప్రతి ప్రాంతంలోనూ ఒక్కో సంఘం ఉంది. వాటిలో అల్బనీ తెలుగు అసోసియేషన్, మెట్రో అట్లాంటా తెలుగు అసోసియేషన్ (తామా), గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్, ఆస్టిన్ తెలుగు సంఘం, బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), బ్లూమింగ్టన్ తెలుగు సంఘం, మిన్నెసొటా తెలుగు అసోసియేషన్, మెంఫిస్ తెలుగు సమితి, తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం, ఒక్లహోమా తెలుగు సంఘం, పిట్స్‌బర్గ్ తెలుగు అసోసియేషన్, ఫ్లోరిడా తెలుగు సంఘం, ట్రాయ్ తెలుగు అసోసియేషన్, వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్... ఒకటా రెండా... 59 తెలుగు సంఘాలనూ అకారాది క్రమంలో మన ముందుంచడమేగాక, వాటి అధ్యక్ష కార్యదర్శుల వివరాలు, అమెరికాలో తెలుగు భాషావ్యాప్తికి ఆయా సంఘాలు చేస్తున్న సేవలనూ చక్కగా గుదిగుచ్చారు పాత్రికేయులు చెన్నూరి వెంకట సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్‌లోని కళాకారులను అమెరికాలోని తెలుగు వారికి పరిచయం చేయడంలో ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు.
 
- డి.వి.ఆర్.
 
 అమెరికాలో తెలుగు సంఘాలు రచన: చెన్నూరి వెంకట సుబ్బారావు
 పేజీలు: 300+; వెల: రూ. 400
 ప్రచురణ: సుప్ర పబ్లికేషన్స్, ప్లాట్ నెం. 8, జానకిరామమ్, మోతినగర్, హైదరాబాద్- 500 018; ఫోన్: 9849599625
 
 కొత్త పుస్తకాలు
 
 1.పొనుక (పరిశోధక వ్యాసాలు)
 రచన: డా. టి.శ్రీరంగస్వామి
 పేజీలు: 120; వెల: 100
 2.సంపత్కుమార సాహిత్య దర్శనం
 సంపాదకుడు: డా.టి.శ్రీరంగస్వామి
 పేజీలు: 102; వెల: 100
 ప్రతులకు: శ్రీలేఖ సాహితి, 14-5/2, ఎంఆర్‌ఓ ఆఫీస్ ఎదురుగా, శ్రీలేఖ కాలనీ, హసన్‌పర్తి, వరంగల్-506371;
 ఫోన్: 0870-2564722
 
 పూదోట(ఆధునిక పద్ధతుల్లో పూలసాగు)
 రచన: ప్రొ. రావి చంద్రశేఖర్, డా.పి.ప్రశాంత్, షహనాజ్
 పేజీలు: 60; వెల: 100
 ప్రతులకు: రైతునేస్తం మాసపత్రిక, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచారసభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్-4.
 ఫోన్: 040-23395979
 
 1.సోషలిజమే ఎందుకు
 మూలం: ఇస్త్వాన్ మెస్‌జారస్
 తెలుగు: సత్యరంజన్ కె.
 పేజీలు: 88; వెల: 40
 
 2.నాణాలు చెప్పిన కథ

 మూలం: గె.అ.ఫ్యోదొరవ్, దవీదొవ్
 తెలుగు: డా.నిడమర్తి మల్లికార్జునరావు
 పేజీలు: 128; వెల: 50
 
 3. అంతు చిక్కని నీరు
 మూలం: ఐ.వి.పెత్య్రానొవ్
 తెలుగు: డా.నిడమర్తి మల్లికార్జునరావు
 పేజీలు: 96; వెల: 40
 
 4.సాపేక్షం... ఒక అద్భుత భావన
 మూలం: ఎల్.లాండౌ, వై.రూమెర్
 పేజీలు: 72; వెల: 30
 ప్రతులకు:ప్రజాశక్తి బుక్‌హౌస్, ఎమ్‌హెచ్ భవన్, ప్లాట్ నం.21/1, అజామాబాద్, ఆర్‌టిసి కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20. ఫోన్: 27660013
 
 ముఖచిత్రాలు (కవిత్వం)
 రచన: షేక్ బషీరున్నీసా బేగం
 పేజీలు: 112; వెల: 100
 ప్రతులకు: కవయిత్రి, 5-66-81, ఫస్ట్ లేన్, కోబాల్ట్‌పేట్, గుంటూరు-2. ఫోన్: 9985193970

 

మరిన్ని వార్తలు