నాలో ఏదో భయం...

13 Nov, 2016 08:43 IST|Sakshi
నాలో ఏదో భయం...

సందేహం

నాకు పెళ్లై నాలుగేళ్లు అవుతుంది. రెండేళ్ల పాప కూడా ఉంది. ఇటీవల సమస్యగా ఉండి డాక్టర్ దగ్గరకు వెళ్లాను. నాకు హెర్పిస్ సింప్లెక్స్-2 వచ్చిందని డాక్టర్ అన్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నాలో ఏదో తెలియని భయం మొదలైంది. భవిష్యత్‌లో ఇది నా పాపకు కూడా వస్తుందేమోనని కంగారుగా ఉంది. అలా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?               
- ఓ సోదరి


హెర్పిస్ సింప్లెక్స్-2 అనేది హెర్పిస్ అనే వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్. ఇది సాధారణంగా కలయిక ద్వారా ఆడవారి నుంచి మగవారికి, మగవారి నుంచి ఆడవారికి సంక్రమిస్తుంది. దీనివల్ల జననేంద్రియాల వద్ద చిన్నచిన్న నీటిపొక్కులు రావటం, నొప్పి, మంట, దురద ఏర్పడతాయి. మీ నుంచి ఇది పాపకు ఏ మాత్రం సంక్రమించడం జరగదు. కాబట్టి మీరు అసలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు, మీ వారు ఇద్దరూ కలిసి హెర్పిస్ వైరస్‌కు చికిత్స తీసుకోవడం మంచిది. ఒక్కరే చికిత్స తీసుకున్నా, మళ్లీ కలయిక ద్వారా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. చికిత్స సమయంలో ఇద్దరూ దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా, రక్తహీనత ఉన్నా, ఈ ఇన్‌ఫెక్షన్ మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మా అక్కకు నెల రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పాప పుట్టింది. నార్మల్ డెలివరీ కావాలని మా అమ్మ తనను ఐదో నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వాళ్లు నార్మలే అయ్యేలా చూస్తామని చెప్పారు. కానీ ప్రైవేట్ ఆస్పత్రి వాళ్లేమో సిజేరియనే అవుతుందని చెప్పారు. అయితే తొమ్మిదో నెల పడిన రెండు రోజులకే అక్కకు నొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప తిరగలేదు, అందుకే సిజేరియన్ అయిందని చెప్పారు డాక్టర్లు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళితే నార్మల్ అయ్యేదా? అసలు పిల్లలు తిరగకపోవడానికి కారణం ఏంటి? తిరగడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తారా? లేదా? 
- సుష్మ, వరంగల్

కాన్పు నార్మల్‌గా అవుతుందా, ఆపరేషన్ ద్వారా అవుతుందా అని ఐదో నెలలోనే చెప్పడం కష్టం. కాన్పు సమయానికి బిడ్డ పొజిషన్ కరెక్ట్‌గా ఉండాలి. అంటే తల కిందకు దిగడం, బిడ్డ బరువుకు తగ్గట్లు.. బిడ్డ బయటకు వచ్చే దారి సరిపడా ఉండటం, తల్లి ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం వంటి అంశాలను బట్టి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పే వారు.. బిడ్డ బయటకు వచ్చే వరకు కచ్చితంగా నూటికి నూరుశాతం నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పలేరు. నొప్పులు తీసే క్రమంలో గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు రావటం, బిడ్డ గర్భంలోనే మోషన్ పోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో నార్మల్ డెలివరీ కోసం ఎక్కువగా వేచి చూడటం వల్ల, బిడ్డ పుట్టగానే ఏడవకపోవడం, తర్వాత కాలంలో ఫిట్స్ రావడం, బిడ్డ చనిపోయి పుట్టడం, ఒకవేళ అప్పుడు బాగానే ఉన్నా తర్వాత ఎదుగుదలలో లోపాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. కాన్పు సమయానికినొప్పులు వచ్చినా, బిడ్డ తిరగకపోతే... ప్రభుత్వ హాస్పిటళ్లలో మాత్రం ఏమి చేయగలరు.

నా వయసు 26. ఏడాది క్రితం డెలివరీ టైమ్‌లో పాప బయటికి రాగానే చనిపోయింది. దానికి కారణం నాకు డెలివరీ టైమ్‌లో హైబీపీ ఉండటం అన్నారు డాక్టర్లు. తర్వాత రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నాలుగో నెలలో అబార్షన్ అయింది. మళ్లీ కొన్ని నెలలకు మూడోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు రెండో నెలలో అబార్షన్ అయింది. అప్పటి నుంచి నేను, మావారు బాధపడని రోజు లేదు. దయచేసి మరోసారి అలా జరగకుండా, గర్భం నిలవాలంటే మేమేం చేయాలి?         
- హేమలత, నల్లగొండ

వివిధ కారణాల వల్ల పిల్లలు పుట్టి చనిపోవడం, అబార్షన్ అవ్వడం వంటి వాటిని ఆ్చఛీ ౌఛట్ట్ఛ్టటజీఛి జిజీటౌ్టటడ (ఆైఏ) అంటారు. ఇవి ఒక్కొక్కరిలో వేరువేరు కారణాల వల్ల అవవచ్చు. కాన్పు సమయంలో హైబీపీ వల్ల, నొప్పుల ఒత్తిడి వల్ల బిడ్డకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం, ఊపిరి ఆడకపోవడం వంటి అనేక కారణాల వల్ల పుట్టిన వెంటనే చనిపోయి ఉండవచ్చు. తర్వాత ఒక సంవత్సరం వ్యవధిలోనే రెండుసార్లు అబార్షన్లు అయ్యాయి కాబట్టి సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. అప్పుడు రిపోర్ట్‌లో వచ్చిన కారణాన్ని బట్టి చికిత్స తీసుకొని కొన్ని నెలలు ఆగి, మళ్లీ గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. థైరాయిడ్ సమస్య, తల్లి రక్తంలో బిడ్డకు వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవ్వడం వల్ల అబార్షన్లు, బిడ్డకు రక్త సరఫరా లేకపోవడం, రక్తం సరిగా గూడుకట్టే గుణం లేకపోవడం, యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ (అ్క), షుగర్ వ్యాధి, పిండంలో జన్యుపరమైన సమస్యలు వంటి అనేక రకాల సమస్యల వల్ల పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ మాత్రలు వాడటం, హార్మోన్ల సమస్యకు హార్మోన్ల ట్యాబ్లెట్స్ వాడటం, అ్క ఉంటే ఉఛిౌటఞజీటజీ, ఏ్ఛఞ్చటజీ వంటి వాటితో చికిత్స తీసుకుంటూ పండంటి బిడ్డని కనవచ్చు. కాబట్టి మీరు అధైర్య పడకుండా డాక్టర్‌ను సంప్రదించి ముందు నుంచే రోజుకొకటి చొప్పున ఫోలిక్ యాసిడ్ మాత్ర వేసుకోవడం మంచిది. అలాగే మనసును బాధగా కాకుండా ఆహ్లాదంగా ఉంచుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.  

డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్

>
మరిన్ని వార్తలు