సూపర్ సిస్టర్స్!

21 Feb, 2016 00:15 IST|Sakshi
సూపర్ సిస్టర్స్!

కుటుంబ కథాంశంతో తెరకెక్కే సీరియళ్లకు ఉన్న గిరాకీ మరి దేనికీ లేదు. అందుకే ఆ కథల వెంట పరిగెడుతుంటాయి డైలీసోపులు. తెలుగే కాదు... హిందీలోనూ ఇదే పరిస్థితి. దైనందిన జీవితంలో జరిగే అంశాలనే కాస్త డిఫరెంట్‌గా తెరకెక్కించి సక్సెస్ కొట్టడంలో వాళ్లకి వాళ్లే సాటి. అందుకే మన వాళ్లు ఈ మధ్య హిందీ సీరియళ్లను డబ్ చేయడంలో ఎక్కువ చొరవ చూపిస్తున్నారు. ఆ కోవలోనే ‘శాస్త్రి సిస్టర్స్’ మన దగ్గరకు చేరారు. ‘మనం’ అంటూ దగ్గరయ్యారు.
 
శాస్త్రిగారికి నలుగురు కూతుళ్లు. నలుగురూ నాలుగు రకాలు. వాళ్ల వాళ్ల మనస్తత్వాల చిత్రణే ఈ సీరియల్‌కి మొదటి ప్లస్. ఇక వాళ్ల జీవితాల్లో వచ్చే ఒడి దుడుకులు, తెలివిగా వాళ్లు వెదికే పరిష్కారాలతో ఆసక్తికరంగా సాగి పోయే ఈ సీరియల్ హిందీలో హిట్ కొట్టింది. ఈ మధ్యనే తెలుగులోనూ ‘మనం’గా మొదలయ్యింది. మంచి కాన్సెప్ట్ కాబట్టి మన వాళ్లకూ నచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు