తృటిలో!

7 Nov, 2015 22:16 IST|Sakshi

‘తృటిలో తప్పిన ప్రమాదం’ అనే మాటను తరచుగా వింటుంటాం, వాడుతుంటాం. ‘అతి తక్కువ సమయం’ అనేదానికి సూచనప్రాయంగా ‘తృటి’ని వాడుతుంటారు. ఏమిటీ తృటి?
 
 తామర తూడును తెంచడానికి పట్టే కాలాన్ని ‘తృటి’ అంటారు. తామర తూడు తెంచడానికి ఎంతో సమయం పట్టదు. అంత తక్కువ సమయంలో జరిగింది కాబట్టి తృటిలో అన్నమాట వాడతాం! (రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు ఒక త్రుటి. దాన్నిబట్టి తృటికి అర్థం అత్యంత తక్కువ కాలం అని కూడా చెబుతుంటారు.)
 

మరిన్ని వార్తలు