కనిపెడుతూ... కోసేస్తుంది

22 May, 2016 02:22 IST|Sakshi
కనిపెడుతూ... కోసేస్తుంది

ఆఫీసుకు టైం అవుతుందనో.. పిల్లలకు స్కూల్ టైం అవుతుందనో.. చాలాసార్లు మనం కూరగాయలు తాజాగా ఉన్నాయా లేదా అన్న సంగతిని పెద్దగా పట్టించుకోం.. ఓ చాక్‌తోనో లేక కత్తిపీటతోనో ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలను తీసి చకచకా తరిగి పారేస్తుంటాం. మరి ఇప్పుడు అవి తాజాగా ఉన్నాయా లేదా అన్న విషయం ఎవరికి తెలుస్తుంది. తెలిస్తే తరిగే మనకు తెలియాలి.. లేదా ఆ చాకుకు తెలియాలి. మనకేమో అంత తీరిక లేదాయే.. మరెలా? ఈ ఆలోచనే వచ్చింది ఓ కంపెనీవారికి.. వెంటనే చాకుకు సెన్సర్లు అమర్చి రీచార్జబుల్ నైఫ్‌ను తయారు చేశారు.

ఫొటోలో కనిపిస్తున్నదే ఆ చాకు.. పేరు ‘స్మార్ట్ నైఫ్’. దీంతో ఏవైనా కూరగాయలను తరుగుతున్నప్పుడు.. ఆ కాయ ఎంత తాజాగా ఉందో, అందులో ఎన్ని ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయో చెప్పేస్తుంది. అంతేకాదు, అందులోకి బ్యాక్టీరియా ఏమైనా చేరిందా అన్న విషయాలను కూడా చాకుపైన ఉన్న డిస్‌ప్లేలో చూపిస్తుంది. దాంతో తాజాగా లేని కూరగాయలను కోయక ముందే పక్కకు పడేసే అవకాశం మనకుంటుంది. అలా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ స్మార్ట్ నైఫ్.
 

మరిన్ని వార్తలు