పంది లాంటి గుర్రం!

11 Jan, 2015 01:26 IST|Sakshi
పంది లాంటి గుర్రం!

ప్లే టైమ్
చూడటానికి పంది లాగా కనిపిస్తున్న ఈ జంతువు నిజానికి గుర్రం జాతికి చెందినది. దీన్ని ‘టాపిర్’ అంటారు. దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువగా కనిపించే టాపిర్ భూమిపై జంతుజాలం ఆవిర్భవించినప్పటి నుంచీ మనుగడలో ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనికి గుర్రం లాగా సకిలించే గుణం ఉంటుంది. దీని జీవన ప్రమాణం 25 నుంచి 30 సంవత్సరాలు. బరువు 360 కిలోల వరకూ పెరుగుతుంది.

ప్రస్తుతానికి అయితే వీటి ఉనికి దక్షిణ అమెరికా, మధ్య అమెరికాల్లోని గడ్డిభూముల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేగంగా ఈదగల జంతువుల్లో టాపిర్ ఒకటని పరిశోధకులు గుర్తించారు. బుర దలో పొర్లడం దీనికి బాగా ఇష్టం. ఇవి నివసించే ప్రాంతాల్లో కూడా దీన్ని మచ్చిక చేసుకొన్న దాఖలాలు లేవు.

ఇది సాధుజంతువు కాదు, అలాగని అకారణంగా దాడి చేసే క్రూర జంతువు కూడా కాదు. సాధారణంగా టాపిర్ ఎవరి మీదా దాడి చేయదు, కానీ మనుషులు ఎవరైనా దానిపై దాడికి పూనుకొంటే తన పటిష్టమైన ముందుకాలి పాదంతో ఎదురుదాడి చేస్తుంది.

మరిన్ని వార్తలు