‘సాహో’ శ్రద్ధా అంతరంగ తరంగాలు ఇవి!

9 Sep, 2018 01:54 IST|Sakshi

మొన్నటి వరకైతే శక్తికపూర్‌ కూతురు శ్రద్ధా కపూర్‌. ఇప్పుడైతే శ్రద్ధాకపూర్‌ వాళ్ల నాన్న శక్తికపూర్‌.ఈ అందాల నటి సుమధుర గాయని కూడా. గ్లామర్‌ పాత్రలు మాత్రమే కాదు ‘హసీనా పర్కర్‌’ సినిమాతో తన నటనలోని మరోకోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసుకొని భేష్‌ అనిపించుకున్నారు.  ప్రభాస్‌ ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్న శ్రద్ధాకపూర్‌ అంతరంగ తరంగాలు ఇవి....

►ఒక నటిగా డ్యాన్స్‌ చేయడం అంటే  ఎంత ఇష్టపడతానో పాడడాన్ని కూడా అంతే ఇష్టపడతాను. పెయింటింగ్‌ అంటే కూడా ఇష్టం. వీలైతే నా భావాలను రచనల రూపంలో ప్రపంచంతో పంచుకోవడం ఇష్టం. సంగీతం, నటనలలో ఏది ఇష్టం? అని అడిగితే చెప్పడం కష్టం. రెండూ నా మనసుకు చేరువైనవే.


►కొన్ని ప్రదేశాలు మనశ్శరీరాలకు సరికొత్త జీవాన్ని ఇస్తాయి. అణువణువులో ఉత్సాహాన్ని నింపుతాయి. షిల్లాంగ్‌ నాకు బాగా ఇష్టమైన ప్రదేశం. వీలైతే అక్కడే నివసించాలనిపించిన ప్రదేశం. ఇలాంటి చోట్లకు వెళ్లినప్పుడు కాంక్రీట్‌ జంగిల్‌లలో మనం ఏం కోల్పోతున్నామో,  ప్రకృతి విలువ ఏమిటో తెలుస్తుంది. శుభ్రంగా ఎలా జీవించాలి అనేది అక్కడి గ్రామాలను చూస్తే అర్థమవుతుంది.


►‘ఇది చేయాలని ఉంది’ ‘అది చేయాలని ఉంది’ అంటుంటాం గానీ ఏదీ చేయకుండానే ‘టైమ్‌ లేదు’ అంటూ సాకులు వెదుక్కుంటాం. మనకు ఒక పని మీద గట్టి ప్రేమ ఉండాలేగాని ‘టైమ్‌’ మన దగ్గరికే నడిచొస్తుంది. హాలీవుడ్‌ నటుడు జిమ్‌ కెరీ ప్రభావం నాపై ఉంది. ఆయన అద్భుతమైన నటుడే కాదు మంచి పెయింటర్‌ కూడా.

ఇష్టమైన పని చేస్తున్న ప్పుడు  ఏ మాత్రం కష్టం అనిపించదు. ఊపిరి సలపని పనిలో ఉన్నప్పటికీ ‘ఒత్తిడి’ అనిపించదు సరికదా...రోజుకు 48 గంటలు ఉంటే ఎంత బాగుణ్ణు అనిపిస్తుంది. అందుకే మనసుకు నచ్చిన పని చేయడానికే  ఇష్టపడతాను. ఆ ఇష్టంలో ఆనందమే కాదు శక్తి కూడా ఉంది.

►‘ఇలాంటి కథ ఉంటేనే’ ‘ఈ నటులైతేనే’ ‘ఇలా తీస్తేనే..’ అని మనకు కొన్ని లెక్కలు ఉంటాయి. నిజానికి ఇదొక భ్రమ. ఎందుకంటే ‘సేఫ్‌’ అనుకున్న ప్రాజెక్ట్‌లు బోల్తా కొట్టవచ్చు. ‘రిస్క్‌’ అనుకొని భయపడినవి బ్లాక్‌బస్టర్‌లు కావొచ్చు! ఇది ఇలాగే అవుతుంది అని చెప్పడానికి బౌండ్‌ రూల్స్‌  ఏమీ లేవు. ఏదైనా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.


►నా కెరీర్‌ ‘ఫెయిల్యూర్‌’తో మొదలైంది. పరాజయం ఎదురుకానిదే పాఠం నేరవలేమనేది కూడా అర్థమైంది. మనకు తెలియకుండానే కొన్ని చట్రాల్లో చిక్కుకుపోతాం. ఆ చట్రం నుంచి బయటికి వచ్చినప్పుడు మనకు మనమే కొత్తగా పరిచయమవుతాం. ‘హసీనా పర్కర్‌’ సినిమాలో హసీనా పాత్ర సవాలుగా అనిపించింది. నేను చేయగలనా? అని వెనకా ముందూ ఆడాను. ‘ఎందుకు చేయలేను’ అనుకున్నాను గట్టిగా. దాని ఫలితం వృథా పోలేదు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరం ఫలితం

ఈ సమయంలో హెర్బల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చా?

మూసిన తలుపులు

వారఫలాలు

యూఫోరియా 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?