ఆకాశవీధిలో అందాల జాబిలి

10 Dec, 2017 00:59 IST|Sakshi

పాటతత్వం

చిత్రం: మాంగల్యబలం రచన: శ్రీశ్రీ
సంగీతం: మాస్టర్‌ వేణు గానం: ఘంటసాల, సుశీల

మాంగల్యబలం చిత్రంలోని ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే ఎవరూ నమ్మకపోవచ్చు. విప్లవకవిగా ముద్ర పడిన శ్రీశ్రీ రొమాంటిక్‌ సాంగ్స్‌ రాస్తారా అనుకుంటారు. ఆయన భావకవి కూడా. ఈ పాటలో అలతి అలతి పదాలతో ఎంతో భావుకతతో రాశారు. పాటలో అర్థం ఎలా ఉన్నప్పటికీ, ఈ పాట అమ్మను దృష్టిలో పెట్టుకుని రాసినట్లుగా అనిపిస్తుంది నాకు.
అమ్మను అందరూ చందమామ అంటారు. ఇందులో ఒయ్యారి తార అమ్మ. అమ్మ నాట్యంలో ఒయ్యారం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆడవారికి ఉండవలసిన లక్షణాలు ఈ పాటలో చూపారు. ‘ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా, చందమామ అందమే వేరు. సినీరంగంలో ఎందరు తారలు ఉన్నా సావిత్రి చందమామ వంటివారు’ అని అందరూ అనేవారు. అమ్మ భౌతికంగా లేకపోయినా, ఎప్పుడు తలచుకుంటే అప్పుడు కనిపిస్తుంది. అమ్మ లిటరల్‌గా గాలిలో ఉంది. ఆకాశవీధిలో అందాల జాబిలిగా అమ్మ ఉందన్నట్లు శ్రీశ్రీ రాసినట్లుగా నేను భావిస్తాను.ప్రేమికుల మధ్య ఉండే అందమైన చిలిపితనం, సున్నితమైన శృంగారం ఈ పాటలో కనిపిస్తాయి. జలతారు మేలి మబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి;పలుమారు దాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి; అందాల చందమామ దొంగాటలాడెనే దోబూచులాడెనే... ఇంత అందమైన ఆలోచన మరో కవికి వస్తుందా అనిపిస్తుంది. మబ్బులతో పరదాలు నేయడం, ఆ తెరచాటున ఒకసారి దాగొని, మరొకసారి కనపడుతూ దొంగాటలు, దోబూచులు ఆడుతుంది చందమామ. ప్రియుడిని చూసిన ప్రేయసి సిగ్గులమొగ్గగా మారి, ఒకసారి కనపడుతూ, మరొకసారి కనపడకుండా దోబూచులాడుతుంది.

జడి వాన హోరు గాలి సుyì  రేగి రానీ జడిపించబోనీకలకాలము నీవే నేనని పలు బాసలాడి చెలి చెంత చేరిఅందాల చందమామ అనురాగం చాటెనే నయగారం చేసె¯óరెండవ చరణంలో... ఎన్నిసమస్యలు వచ్చినా నన్ను నీలోకి తీసుకో. జడి వాన కురిసినా, హోరు గాలి వీచినా, ప్రకృతి మనలను ఎంత భయపెట్టినా, కలకాలం నీలోనే ఉంటానని బాసలు చేసి, ఒకరిని ఒకరు చేరాలి ప్రేయసీప్రియులు అన్నారు శ్రీశ్రీ. సినీ సాహిత్యంలో ఇంతకుమించిన రొమాంటిక్‌ సాంగ్‌ లేదేమో అనిపిస్తుంది. అమ్మను చందమామలా ఎంత అందంగా చూపారో, అంతకు మించినఅందం ఈ పాటకు ఘంటసాల, సుశీలగార్లు  తీసుకువచ్చారు.
– సంభాషణ: డా. వైజయంతి

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు