రంగు పడుద్ది...

17 Jul, 2016 01:35 IST|Sakshi
రంగు పడుద్ది...

నెయిల్ ఆర్ట్
ఇది స్ల్పాటర్ నెయిల్ ఆర్ట్. దీన్ని వేసుకోవడానికి గ్రీన్, పింక్, ఆరెంజ్, రెడ్, వైట్, బ్లూ నెయిల్ పాలిష్‌లను సిద్ధం చేసుకోవాలి. అలాగే వీటితో పాటు ట్రాన్స్‌పరెంట్ పాలిష్, నెయిల్ రిమూవర్, కూల్‌డ్రింక్ స్ట్రాలు ఉంటే చాలు. ఎంతో అందంగా ఉండే స్ల్పాటర్ నెయిల్ ఆర్ట్‌ను మీ గోళ్లపైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్‌ను చూస్తే... హోలీ రోజు రంగులతో నిండిన మన దుస్తులే గుర్తొస్తాయి. మరి ఆ రంగుల అందం మీకూ కావాలంటే.. ఈ డిజైన్‌ను ట్రై చేయండి.
 
1.    ముందుగా స్ట్రాలను కత్తెరతో ముక్కలు చేసుకోవాలి.
2.    ఇప్పుడు అందంగా కత్తిరించుకున్న గోళ్లపై ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌తో బేస్‌కోట్ వేసుకోవాలి.
3.    తర్వాత గోళ్లన్నిటికీ తెలుపు రంగు నెయిల్ పాలిష్ పూయాలి.
4.    ఆపైన మొదటగా బ్లూ కలర్ పాలిష్‌లో ఓ స్ట్రా ముక్కను ముంచాలి.
5.    ఆ స్ట్రాలో ఉన్న పాలిష్‌ను ఇప్పుడు గోళ్లపై చల్లాలి.
6.    అలాగే పింక్, రెడ్ పాలిష్‌లలో స్ట్రాలను ముంచి చల్లుకోవాలి.
7.    ఇప్పుడు గ్రీన్, ఆరెంజ్ రంగుల పాలిష్‌లను చల్లాలి. ఇవే కాకుండా, మీకు నచ్చిన రంగులు ఎన్నింటినైనా వాడొచ్చు.
8.    తర్వాత గోళ్ల చుట్టూ అంటుకున్న పాలిష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌తో క్లీన్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ పూర్తిగా ఆరిన తర్వాత, ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి.

మరిన్ని వార్తలు