టారో : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు

23 Apr, 2016 22:32 IST|Sakshi
టారో : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఈ వారం చక్కగా విహారయాత్ర చేస్తారు. దాంతో చాలా ఉత్సాహం వస్తుంది. పలు రకాల సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొన డానికి కాస్తంత ధైర్యం, శక్తి అవసరమవుతాయి. అయితే మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎందులోనూ ఓడిపోనివ్వదు. వ్యక్తిగత జీవితంలో అభిప్రాయ భేదాల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు.
కలసివచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఈ వారం అన్నీ మీ ఊహలకు విరుద్ధంగానే జరుగుతాయి. అయితే అంతా మంచే జరుగుతుంది. మీ వ్యక్తిత్వం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తుంది. ఊహించని విధంగా ఓ స్నేహితుడికి మీ సహాయం అవసరమవుతుంది. వృత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతో కాక ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కలసివచ్చే రంగు: నీలం
 
మిథునం (మే 21 - జూన్ 20)
ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే కాలం. విజయాలు మీ ఒడిలో వాలతాయి. అయితే అదంతా మీ శ్రమకు ఫలితమే అయ్యుంటుంది. మీలో అద్భుతమైన ఆకర్షణ ఉంది. అయితే దానికంటే కూడా నిబద్ధత, క్రమశిక్షణ మిమ్మల్ని గెలుపుబాట పట్టిస్తాయి. మీ దృష్టి ఎంతసేపూ పని మీదే ఉంటుంది. అది మిమ్మల్ని ఎందులోనూ వెనుకబడనివ్వదు.
కలసివచ్చే రంగు: కాషాయం
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
పని చేసేచోట ఓ అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది మిమ్మల్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మనసు పెట్టి చేస్తే మీరు దేనినైనా సాధించగలరు అన్న విషయం నిరూపణ అవుతుంది. ఇంతవరకూ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలతారు. మీరు ప్రేమించేవ్యక్తితో ప్రపంచం మరిచి గడుపుతారు.
కలసివచ్చే రంగు: సీ గ్రీన్
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)

మీకు కనుక ఏదైనా లక్ష్యం ఉంటే... దాన్ని సాధించేందుకు ఇది అనువైన కాలం. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి. విజయం తప్పక లభిస్తుంది. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. అయితే ఏ విషయంలోనూ బద్ధకించకండి. ఆధ్యాత్మిక ఆలోచనలు సైతం చుట్టుముడ తాయి. ప్రేమ సఫలమవుతుంది. తద్వారా మీ జీవితంలోకి కొత్త ఆనందం వస్తుంది.
కలసివచ్చే రంగు: పసుపు
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఎంతో కాలంగా మీ జీవితంలో నెలకొన్న ఉన్న కొన్ని కన్‌ఫ్యూజన్లు తొలగుతాయి. సమస్య లన్నిటికీ పరిష్కారాలు కనిపిస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు సాధ్యమయ్యే మార్గాలు తెరచుకుంటాయి. కాస్త కష్టపెట్టినప్పటికీ విలువలు, నియమాలు, షరతులు అనేవి ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయన్న నిజం తెలుసుకుంటారు. ఓ వ్యక్తితో మీకు ఏర్పడిన బంధం మరింత బలపడుతుంది.
కలసివచ్చే రంగు: నిమ్మ పసుపు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? మీకు తగిన వ్యక్తిని ఎంచుకోవడానికి, ఓ ఇంటివారు కావడానికి ఇది సరైన సమయం. ఉద్యోగులు విజయాలు సాధిస్తారు. మీలో ఎదుటివారిని ఆకర్షించే శక్తి, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చివేసే శక్తి ఉన్నాయి. అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఆహార నియమాలు పాటించండి.
కలసివచ్చే రంగు: తెలుపు
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఆరోగ్య సమస్యలు తీరి ఊరట పొందుతారు. మీ పరిశీలన్నా శక్తి ఓ వ్యక్తిని సమస్యల నుంచి బయటపడేసేలా చేస్తుంది. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు, కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు మీ జీవితంలో పెద్ద పాత్రను పోషిస్తారు. ఉద్యోగం, బాంధవ్యం ఏదైనా మీకు సంతోషాన్నే కలిగిస్తుంది. మీలో ఉన్న భయాలను, శంకలను పక్కన పెట్టేయండి. ఏం చేసినా ధైర్యంగా చేయండి.
కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
మీ మనసు ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకు మళ్లుతుంది. అది ఒకే సమయంలో ఎక్కువ పనులు చేపట్టినా తప్పులు లేకుండా చేయగలిగే మీ ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. విధి నిర్వహణలో ఒక్క సారిగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిత్వాల్లోని భేదాల కారణంగా మీరు ప్రేమించే వ్యక్తి మీకు తగినవారు కాదని తెలుస్తుంది.
కలసివచ్చే రంగు: క్రీమ్
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
రిలాక్సేషన్ కోరుకుంటారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో ఏకాంతంగా గడపాలని కోరుకుం టారు. పని విషయానికి వస్తే కొత్త కొత్త ప్రపోజల్స్ వెతుక్కుంటూ వస్తాయి. సహోద్యో గులతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయినా మీరు వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. ఎంతోమందిని కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు.
కలసివచ్చే రంగు: కాషాయం
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
మీ వరకూ జీవితం అనేది ఓ అందమైన ప్రయాణం. దానివల్ల ఒక్కోసారి లైఫ్‌లో డ్రామా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అలా ఉండకండి. ఎవరినీ నమ్మకండి. ప్రకృతి, పుస్తకాల వంటి పట్ల ఉన్నట్టుండి ఆసక్తి పెరుగు తుంది. కాస్త రొమాంటిక్‌గా కూడా గడుపుతారు.
 కలసివచ్చే రంగు: వయొలెట్
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఎంతోకాలంగా తీరకుండా ఉన్న ఓ కోరిక ఇప్పుడు తీరిపోతుంది. ప్రేమ విషయంలో మీ ఆలోచనలు కాస్త అస్తవ్యస్తంగా అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రేమించే వ్యక్తి పట్ల మీకున్న గాఢమైన నమ్మకాలు, ఫీలింగ్స్ కొన్ని ఇబ్బం దులు రేకెత్తించవచ్చు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు. మీకంటే చిన్నవాళ్లల్లో స్ఫూర్తిని రగిలించే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు.
కలసివచ్చే రంగు: లేత నీలం
ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు