టారో : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు

24 Jul, 2016 01:48 IST|Sakshi
టారో : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పొరపాట్లు చేయకుండా ఉండటానికి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రేమికులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఈ వారం అంతా సానుకూలంగానే గడుస్తుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు విసుగు కలిగించొచ్చు. అయితే, వాటిని మానుకోవద్దు.
లక్కీ కలర్: బ్రౌన్
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
అనూహ్యమైన మార్పులు ఉంటాయి. భ్రమలను విడిచిపెట్టి జీవితంలో ఆచరణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతారు. భావోద్వేగాలు తరచూ మారుతూ ఉండవచ్చు. ఈ విషయమై కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోగల భాగస్వామి తారసపడతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
లక్కీ కలర్: పసుపు
 
మిథునం (మే 21 - జూన్ 20)
గ్రహబలం అనుకూలంగా ఉంది. సంపద కలిసొస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఇతరుల విమర్శలపై వ్యతిరేకత పెంచుకోకండి. అపోహలకు లోను కాకుండా, ఎదుటివారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఇంట్లో జరిగే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పుష్కలంగా నీరు తాగండి. నీటి ద్వారానే ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.
లక్కీ కలర్: నీలం
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ఆలోచనల్లో గందరగోళం కారణంగా అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి సలహా కోరుకుంటారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. ఆఫీసులో మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మార్పుల వల్ల మీలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి.
లక్కీ కలర్: బ్రౌన్
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమిస్తారు. పనికి సంబంధించిన ఒక కీలక సమాచారం మీ ఆలోచనా సరళిలో పెను మార్పులకు కారణమవుతుంది. ప్రకృతిలో ఏకాంతంగా గడపడం ద్వారా కాస్త ఊరట పొందగలరు. మీ స్వస్థలంలో సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ప్రేమికులకు అనుకూలమైన కాలం. పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ఆలోచనలను తెలివిగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం అందకపోవచ్చు. అయినా క్రమశిక్షణ గల సైనికుడిలా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నిరాశా నిస్పృహల నుంచి బయటపడటానికి ఆత్మీయులతో గడుపుతారు.
లక్కీ కలర్: నాచురంగు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
కొత్త పథకాలను ఆచరణలోకి తెస్తారు. మేధాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి, నిర్వేదానికి గురిచేస్తాయి. సానుకూల దృక్పథంతో నిర్వేదం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందచందాలపైన, అలంకరణలపైన శ్రద్ధ చూపుతారు. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: పొద్దుతిరుగుడు
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఆకర్షణ శక్తితో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు సానుకూలమైన కాలం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపుతో పాటు ప్రోత్సాహకరమైన ఫలితా లను అందుకుంటారు. ఇదివరకు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరికే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా అదృష్టం కలిసొస్తుంది.
లక్కీ కలర్: నేరేడు
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఇంటా బయటా అనుకోని మార్పులు తప్పకపోవచ్చు. కొత్త ఇంట్లోకి మారే అవకా శాలు ఉన్నాయి. మీరు చేరే కొత్త ప్రదేశం చుట్టూ ఆహ్లాదకరమైన ఆకుపచ్చని వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. సాటిలేని పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. సాహసకృత్యాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: లేత గోధుమరంగు
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. స్వార్థాన్ని విడనాడితే మరింతగా సత్ఫలితాలను సాధించగలరు. ఆరోగ్యానికి, ఆర్థిక లాభాలకు నడుమ సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసభరితంగా సాగుతాయి.
లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
ఎటూ తేల్చుకోలేని అనిశ్చితిలో, గందరగోళంలో కొట్టుమిట్టాడుతారు. అంతులేని ఆలోచనల పరంపరను అదుపులో ఉంచుకోవడానికి విఫలయత్నాలు చేస్తారు. ధ్యానం వల్ల కొంతవరకు ప్రశాంతత సాధిస్తారు. ప్రేమికులతో విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు అంచనాలకు మించిన సత్ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది.
లక్కీ కలర్: నారింజ
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఖర్చులు అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బంధుమిత్రులతో విందువినోదాల కోసం, విలాసాల కోసమే ఖర్చు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. సృజనాత్మకతతోను, పాలనా సామర్థ్యంతోను ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వారం ప్రారంభంలో కొంత నిరాశాజనకంగా ఉన్నా, పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి.
లక్కీ కలర్: వెండిరంగు

మరిన్ని వార్తలు