టారో 16 ఏప్రిల్‌ నుంచి 22 ఏప్రిల్‌ 2017 వరకు

16 Apr, 2017 01:07 IST|Sakshi
టారో 16 ఏప్రిల్‌ నుంచి 22 ఏప్రిల్‌ 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. విజయం వరిస్తుంది. మీ కృషి, నిబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. సంభాషణా చాతుర్యంతో సభలు, సమావేశాలలో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యక్తిగత జీవితానికీ, బిజినెస్‌కీ సమన్వయం ఉండేలా చూసుకోండి. కుటుంబం వల్ల ఆనందం కలుగుతుంది.
లక్కీ కలర్‌: లేత గులాబీ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
చురుకుగా, అంకితభావంతో పని చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఉదారంగా, నిజాయితీగా ఉంటారు. మీ హాస్య చతురతే క్లిష్ట పరిస్థితులనుంచి మిమ్మల్ని ఒడ్డెక్కిస్తుంది. మీ కుమారుడు లేదా ఆప్తుడు వృద్ధిలోకి వచ్చి మీకు చేయూతగా నిలుస్తారు. ధ్యానం ద్వారా మీలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుకుంటారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ నీతి నిజాయితీలు, పరోపకార గుణాలే మిమ్మల్ని వ్యాపారంలో లాభాలబాటలో నడిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారానికి పురిగొల్పుతాయి. కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
లక్కీ కలర్‌: ఎరుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. వారికి స్వాంతన చేకూరుస్తారు. పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులు చేపడతారు.
లక్కీ కలర్‌: ముదురు నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఇనుమడించిన ఉత్సాహంతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయండి.
లక్కీ కలర్‌: ముదురు గులాబీ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్‌ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు.     
లక్కీ కలర్‌: లేత బూడిద రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీ చుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తెలివిగా తిప్పికొడతారు.  
లక్కీ కలర్‌: ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు  పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం.  
లక్కీ కలర్‌: బంగారు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
పనిలో కొద్దిపాటి ఒత్తిడి తప్పదు. కొత్త ఆదాయ వనరులను అన్వేషించడంలో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి.
లక్కీ కలర్‌: ముదురు నారింజ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు.
లక్కీ కలర్‌: ముదురు ఎరుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్‌కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి.
లక్కీ కలర్‌: స్ట్రాబెర్రీ వంటి ఎరుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కలిసొచ్చే వారమిది. ఏదైనా విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకుంటే తటపటాయించవద్దు. లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. విదేశీయానం ఉండవచ్చు. శరీరాకృతిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి.
లక్కీ కలర్‌: మావి చిగురు

మరిన్ని వార్తలు