టారో : 4 మార్చి నుంచి 10 మార్చి, 2018 వరకు

4 Mar, 2018 09:05 IST|Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. చేపట్టిన పనులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయినట్టు కనిపిస్తాయి. గతంలో మొదలుపెట్టిన కొన్ని పనులు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇవ్వడం మొదలుపెడతాయి. అవి కూడా మీకు ఇవ్వాల్సిన సంతృప్తినైతే ఇవ్వవు. అయితే ఈ పరిస్థితి నుంచి త్వరలోనే బయటపడతారు. మీ ఓపికను పరీక్షించేందుకే ఈ పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముట్టాయని తెలుసుకోండి. ఈ ఒక్క పరీక్షను దాటేస్తే, ఇంక అన్నీ మంచి రోజులే వస్తాయని ఆత్మవిశ్వాసంతో పనిచేయండి.
కలిసివచ్చే రంగు : ఎరుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. వృత్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. గొప్ప అవకాశం ఒకటి మీ తలుపు తడుతుంది. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే ముందు మీ శక్తులన్నీ కూడగట్టుకొని సిద్ధంగా ఉండండి. ప్రేమ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం ఏదైనా దానికి కట్టుబడి ఉండండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. జీవితాశయం వైపుకు ఎలా అడుగులు వేయాలా అని బాగా ఆలోచిస్తారు.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఈ క్షణం మీరు బలంగా కోరుకుంటున్నది ఏంటో అర్థం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. చాలాకాలంగా మీకు అందకుండా పోతోన్న ఓ అవకాశం కూడా ఈవారం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని, విజయం వైపుకు అడుగులు వేయండి. వృత్తి జీవితంలో ఉన్నత పదవులు అలంకరించే సమయం దగ్గరలోనే ఉంది. కొత్త విషయాలు తెలుసుకునేందుకు బాగా ఉత్సాహం చూపిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
కలిసివచ్చే రంగు : పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారం మీరు ధైర్యంగా ఓ సాహసోపేత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం మీ జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పేదై ఉంటుందని తెలుసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆ వ్యక్తి మీ జీవితానికి ఒక కొత్త అర్థం తెస్తున్న అనుభూతి మీకు బాగుంటుంది. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. సవాళ్లే ఎదురవ్వకపోతే అది జీవితమే కాదన్నది గ్రహించాలి. ఆరోగ్యం జాగ్రత్త.
కలిసివచ్చే రంగు : గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కొన్నాళ్లుగా కొన్ని విషయాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు ఆ విషయాలేంటన్నది కూడా తెలియని ఒక అమాయకత్వంలో బతుకుతున్నారు మీరు. ముందు మీకేం కావాలో తెలుసుకోండి. అందుకు మీరేం చేయాలో నిర్ణయించుకోండి. ఎప్పట్నుంచో ఊరిస్తోన్న ఓ అవకాశం మీకు దగ్గర్లోనే ఉంది. మీరే ఆ అవకాశాన్ని అందుకునే దిశగా అడుగులు వేయడం లేదు. ఏదైనా చెయ్యలేం అన్న ఆలోచనను దూరం చేసుకుంటేనే మంచిది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రకు వెళతారు.
కలిసివచ్చే రంగు : వయలెట్‌

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కొద్దిరోజుల పాటు మీరు అనుకున్నవన్నీ ముందుకు సాగనట్టు కనిపిస్తాయి. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు ఇలాగే ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుందన్నది ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేస్తారు. కారణం మీ ఆలోచనా విధానంలోనే ఉందన్న విషయం తెలుసుకోండి. ఏది  జరిగినా అది మన మంచికే అన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. వృత్తి జీవితంలో మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న అవకాశం దగ్గర్లోనే ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : బూడిద

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వృత్తి జీవితంలో ఓ కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. ఇప్పటివరకూ మీరు చూసిన ప్రపంచానికి, ఇకపై చూడబోయే ప్రపంచానికి ఊహించని స్థాయిలో తేడా కనిపిస్తుంది. ఈ కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కాస్తంత సమయం తీసుకుంటారు. మిమ్మల్ని బాగా ప్రేమించే వ్యక్తి సలహాలు, సూచనలు మీ ఆలోచనలను ఉన్నతంగా నిలిపేందుకు ఉపయోగపడతాయి. ఒక కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. ఇందుకోసం మీ విలువైన సమయాన్ని, సంపదను వెచ్చిస్తారు. ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయని నమ్మండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకూడదంటే, మీరు ఆ తప్పులను విశ్లేషించుకోవాలే కానీ, ఆ తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. మీ సమయాన్నంతా ఇక్కడే వృథా చేస్తున్న విషయాన్ని మీరు నమ్మాలి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఒక గొప్ప విజయానికి చాలా దగ్గరలో ఉన్నారు.  ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాలనుకుంటూ ఎప్పుడూ ఆగిపోతున్న మీరు, ఇప్పటికే సమయం మించిపోయిందని తెలుసుకోవాలి. ఇప్పటికైనా మేల్కొని మొదటి అడుగు తీసుకోకపోతే ఇక ముందెప్పుడూ మీ గమ్యాన్ని చేరుకోలేరని అర్థం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారాంతంలో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
కలిసివచ్చే రంగు : నలుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి నుంచి ఓ విలువైన బహుమతి అందుకుంటారు. అది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. వృత్తి జీవితం ఎప్పట్లానే సజావుగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఎప్పట్నుంచో కంటోన్న ఓ కలను నిజం చేసుకునేందుకు, ఆ దిశగా మొదటి అడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.
కలిసివచ్చే రంగు : తెలుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. చాలాకాలంగా మిమ్మల్ని ఎంతగానో ఊరిస్తోన్న ఓ విజయం మీకు దగ్గర్లోనే ఉంది. మీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉంది. ఆ మార్పు వచ్చాకే, విజయానికి పూర్తిగా దగ్గరవుతారని తెలుసుకోండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తూ, దానిగురించి బాధపడుతూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలను పాటించండి.
కలిసివచ్చే రంగు : కాషాయ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం కొత్త శక్తిని కూడగట్టుకొని ఉత్సాహంగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం అన్న విషయాన్ని మర్చిపోకండి. కొద్దిరోజుల క్రితం మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసిన ఒక పనిని ఈ వారం మళ్లీ కొత్తగా మొదలుపెడతారు. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కూడా. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఆలోచనలను పూర్తిగా ప్రభావితం చేసే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి. ఆరోగ్యం జాగ్రత్త.
కలిసివచ్చే రంగు : నీలం 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌