టీవీక్షణం: సినిమా పిలిచింది!

9 Nov, 2013 23:40 IST|Sakshi
టీవీక్షణం: సినిమా పిలిచింది!

టీవీ ఆర్టిస్టులందరికీ సినిమాల్లో నటించాలనే ఉంటుంది. అందుకే సీరియల్స్‌లో కాస్త పేరు వచ్చాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అంకితా లోఖండే, అవికా గోర్, ద్రష్టి ధామిలను మాత్రం సినిమా అవకాశాలే వెతుక్కుంటూ వచ్చాయి.
 
 బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కి కాబోయే భార్య అయిన అంకిత... పవిత్రరిష్తా సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది. అదే ఆమెకు షారుఖ్ ఖాన్ సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించింది. ఫరాఖాన్ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న ‘హ్యాపీ న్యూ ఇయర్’లో ఓ ముఖ్య పాత్ర చేస్తోంది అంకిత. అలాగే ‘చిన్నారి పెళ్లికూతురు’గా అందరి మనసులనూ దోచుకున్న అవికా గోర్... ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ద్రష్టి ధామి. అదృష్టం అంటే ఆమెదే. సీరియల్స్‌లో తిరుగు లేదు. పైగా ఝలక్ దిఖ్‌లాజా డ్యాన్‌‌స షోలో గెలిచి మరింత పాపులర్ అయిపోయింది. దాంతో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్ర దర్శకుడు రోహిత్‌శెట్టి... ఆమెని ఏకంగా అజయ్ దేవగన్ సరసన హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. అది కనుక కన్‌ఫామ్ అయితే ఇక ద్రష్టికి తిరుగే ఉండదు. ఆమె బాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు.
 
 ఇలా ముగ్గురు ఫేమస్ టీవీ స్టార్‌‌సని ఒకేసారి సినిమా అవకాశాలు ముంచెత్తడం విశేషమే. చెప్పాలంటే... సీరియళ్లలో ప్రదర్శించినన్ని భావోద్వేగాలను సినిమాల్లో చూపించాల్సిన అవసరం ఉండదు. అందుకే సీరియల్స్‌లో నటించడమే కష్టమంటారు. అలా చూసుకుంటే... ఈ టాప్ టీవీ నటీమణులు కచ్చితంగా సినిమాల్లో సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. చూద్దాం... వీరి సినీ ప్రయాణం ఎలా సాగుతుందో!

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు