స్కానింగా మజాకా...

10 Jul, 2016 00:32 IST|Sakshi
స్కానింగా మజాకా...

మీరు తీసుకునే ఆహారంలో క్యాలరీలు, ప్రొటీన్లు, షుగర్ లాంటివి ఎంతెంత ఉన్నాయో తెలుసా? పోనీ తెలుసుకోవాలని ఉందా? అవి చూస్తే కనపడవు. మరి ఎలా? స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కానింగ్‌లో అవన్నీ ఎలా తెలుస్తాయనేగా మీ సందేహం. ఏమీ లేదండీ.. పక్కన కనిపిస్తున్న పరికరం పేరు ‘టెల్‌స్పెక్’. దీంతో మీరు తినే ఆహారాన్ని స్కాన్ చేయాలి. అప్పుడు అందులో ఎన్ని క్యాలరీలు, ప్రొటీన్లు ఉన్నాయో చెప్పడమే కాక ఎన్ని రసాయనాలున్నాయో కూడా చెప్పేస్తుంది. ఎలా అంటే, ఆ సమాచారమంతా దానికి అమర్చి ఉన్న బ్లూటూత్ ద్వారా మీ మొబైల్ లేదా ఐప్యాడ్‌లో కనిపిస్తుంది. దానివల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ... రసాయనాలతో కూడిన ఆహారానికి దూరంగా ఉండొచ్చు.

మరిన్ని వార్తలు