టైర్‌తో కొలను సోయగం

22 May, 2016 02:45 IST|Sakshi
టైర్‌తో కొలను సోయగం

చాలామందికి తమ ఇళ్లల్లోనూ ఓ చిన్న కొలనులాంటిది ఉంటే బాగుంటుందనే ఆశ ఉంటుంది. కానీ స్థలం లేకో, కొలను కోసం నేలను తవ్వించే తీరిక లేకో.. ఆ ఆశను నిరాశగా మార్చుకుంటారు. ఇకపై అలాంటి చింతలేమీ పెట్టుకోకండి. ఒక లారీ లేక ట్రాక్టర్ టైర్‌ను సంపాదిస్తే చాలు. మీ ఇంట్లో అందమైన బుల్లి కొలను ఉన్నట్టే. ఎలా అంటారా? ఇలాగే..
 
ముందుగా ఓ టైరును మీ ఇంటి పెరట్లో పెట్టండి. ఆపైన ఫొటోలో కనిపిస్తున్న విధంగా టైర్ పైన భాగాన్ని ఎలక్ట్రిక్ సా (విద్యుత్ రంపం) సాయంతో కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని పూర్తిగా ఓ దళసరి కవర్‌తో చుట్టాలి. ఆపైన టైర్ చుట్టూ ఫొటోలో కనిపిస్తున్న విధంగా మట్టితో కప్పేయాలి. ఆ మట్టిపై చిన్న చిన్న రాళ్లతో అలంకరించి, అందులో ఇప్పుడు నీళ్లు పోయాలి. అందులో ప్లాస్టిక్ పూలు వేసి, చుట్టూ పూల మొక్కలు, పక్షుల బొమ్మలు పెట్టి అలంకరించొచ్చు. అలాగే దాని పక్కన మరో రెండుమూడు చిన్న కొలనులూ తయారు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు