గర్వంగా చెబుతారు..!

16 Aug, 2014 23:16 IST|Sakshi
గర్వంగా చెబుతారు..!

 పంచామృతం

‘నా శరీరంలో మరో జీవిని సమాధి చేయను...’ అని ప్రకటించుకొన్నారు ప్రఖ్యాత పెయింటర్ లియోనార్డో డావించి. ‘శాకాహారులు ఈ ప్రకృతికి ప్రియమైన వాళ్లు..’ అని చెప్పారు విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. శాకాహారుల్లో ఒక గర్వం ఉంటుంది. నవీన మానవుడి ఆహారపు గొలుసులో కూడా వీళ్లు ప్రత్యేకమైన వాళ్లు. ఇలాంటి వారిలో మనకు బాగా తెలిసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు శాకాహారులం అని గర్వంగా ప్రకటించుకున్నారు. వారిలో కొందరు...
 
విద్యాబాలన్...http://img.sakshi.net/images/cms/2014-08/81408210983_Unknown.jpg

తమిళ-బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన విద్య తన కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఆమె మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. తను సహజసిద్ధంగానే వెజిటేరియన్‌ని అనే విద్య ఈ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా కోరుకోవడం లేదు.
 
 అమితాబ్ బచ్చన్...http://img.sakshi.net/images/cms/2014-08/61408210906_Unknown.jpg

 ఆహారం మనిషి శక్తిస్థాయిని ప్రభావితం చేస్తుందని అనుకుంటే... అమితాబ్ శక్తి స్థాయి పూర్తిగా శాకాహారం వల్ల సమకూరినదే. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్(పెటా) తరపున వరసగా మూడుసార్లు ‘హాటెస్ట్ వెజిటేరియన్’గా పురస్కారాన్ని అందుకున్నారీయన.
 
కేట్ విన్‌స్లెట్...

ఈ టైటానిక్ సుందరి ‘పెటా’ మద్దతుదారు. మాంసం కోసం బాతులను కోయడాన్ని చూడటం కేట్‌ను శాకాహారిగా మారేలా చేసిందట. తనవంతుగా జీవహింసను తగ్గించడానికి మాంసాహారాన్ని వదిలేసి, పెటా తరపు ప్రచార కర్తగా మారారు.
 
 మల్లికా షెరావత్...http://img.sakshi.net/images/cms/2014-08/81408211077_Unknown.jpg

 సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపించినా... మల్లిక స్వాభావికంగా జంతుహింసకు చాలా దూరమట. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా నాన్‌వెజ్‌ను ముట్టిందే లేదట. పెటావాళ్లు తనను ‘సెక్సియెస్ట్ వెజిటేరియన్’గా ఎంపిక చేయడం కూడా తనకు గర్వకారణమటున్నారు.
 
కంగనా రనౌత్...
http://img.sakshi.net/images/cms/2014-08/81408211168_Unknown.jpg

హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్‌పుత్‌ల కుటుంబం నుంచి వచ్చిన కంగనా తన జీవనశైలిలో భాగంగా మాంసాహారాన్ని త్యజించారు. చాలా సంవత్సరాల నుంచి శాకాహారిగా ఉంటున్నాననీ, అప్పట్నుంచి  గ్లామరస్‌గా తయారయ్యాయననీ కంగనా చెబుతున్నారు. అందంగా తయారవ్వాలనుకుంటున్న వాళ్లు తన దారికి వచ్చేయాలని కూడా కంగనా  సలహా ఇస్తున్నారు!

 
 
 

మరిన్ని వార్తలు