-

టార్చ్‌తో టీ వేడి చేసుకోవచ్చు...

18 Sep, 2016 00:52 IST|Sakshi
టార్చ్‌తో టీ వేడి చేసుకోవచ్చు...

కరెంటు పోతే చీకట్లో ఏది ఎక్కడుందో చూసుకోవడానికి టార్చ్ పనికొస్తుంది గాని, టార్చ్‌తో టీ వేడి చేసుకోవడం ఏంటనుకుంటున్నారా..? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న టార్చ్ చేతిలో ఉంటే... భేషుగ్గా టీ వేడి చేసుకోవచ్చు. ఒక్క టీ మాత్రమేనా? కాఫీ, సూప్, పులుసు, సాంబార్... వగైరా వగైరాలు ఏవైనా క్షణాల్లోనే వేడి చేసుకోవచ్చు. జేబులో ఇమిడిపోయే ఈ టార్చ్ మామూలు టార్చ్ కాదు. ఇది ఫ్లాష్‌పాయింట్ మినీ మైక్రోవేవ్ ఎక్సోస్టవ్. కప్పులో లేదా బౌల్‌లో ఏదైనా ద్రవాన్ని పోసి, ఈ టార్చ్‌ను ఆన్‌చేసి, దాని వెలుతురును ద్రవంపైకి ప్రసరింపజేస్తే క్షణాల్లోనే అవి సలసలమని మరుగుతాయి.

రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేసే ఈ టార్చ్ ఉంటే ప్రతిదానికీ స్టవ్ వెలిగించాల్సిన పనే ఉండదు. అయితే, ఇది వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే, దీని నుంచి వెలువడే వెలుతురు నుంచి పుట్టే వేడి తీవ్రతకు కాగితాల వంటివి క్షణాల్లోనే అంటుకుని కాలి బూడిదైపోతాయి. కాబట్టి, ఇది పిల్లలకు దూరం ఉంచి వాడుకోవడం క్షేమం.

మరిన్ని వార్తలు