దొండపండు లాంటి పెదవుల కోసం

1 Mar, 2020 11:42 IST|Sakshi

బ్యూటీజర్‌

మగువల అందంలో పెదవులు చాలా ప్రత్యేకం. చర్మం రంగు ఏదైనా కానీ.. పెదవుల అందం ఎరుపైతే ఆ ముఖంలో వచ్చే కళ అంతా ఇంతా కాదు. పెదవులు ఎర్రగా, దొండపండులా ఉంటే.. ఆ  అందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఎర్రదనం కోసం రంగు పూసుకోవచ్చు కానీ.. దొండపండు లాంటి పెదవుల కోసం ఏం చెయ్యగలం?
మేకప్‌లో భాగంగా చాలా మంది తన పెదవులను హైలెట్‌ చేసుకోవడానికి..లిప్‌ గ్లాస్‌, లిప్‌ బామ్, లిప్‌స్టిక్‌.. ఇలా చాలానే వాడుతుంటారు. నిజానికి కొందరి పెదవులు సన్నగా, చిన్నగా, ముడుచుకున్నట్లుగా ఉంటాయి. మరికొందరివి పేలవంగా, కళాహీనంగా కనిపిస్తాయి. లిప్‌స్టిక్‌ వేసినా అంత అందంగా అనిపించవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బొద్దుగా, ముద్దొచ్చేలా మారవు. అయితే చిత్రంలో కనిపిస్తున్న ‘లిప్‌ ప్లంపర్‌’ మేకప్‌ కిట్‌లో ఉంటే.. సన్నగా, పేలవంగా ఉండే పెదవులను కూడా దొండపండుల్లా మార్చుకోవచ్చు. అదెలా అంటే.. చూడటానికి ట్రిమర్‌లా ఉన్న ఈ గాడ్జెట్‌ ముందు భాగంలో (రెడ్‌ కలర్‌ కనిపిస్తున్న చోట) పెదవుల ఆకారంతో ఉన్న ఓ రంధ్రం ఉంటుంది.

దానిలో పెదవులని ఉంచి మోడ్స్‌ మార్చుకోవాలి. దీన్ని ముప్ఫై సెకన్స్‌ పాటు ఉపయోగిస్తే చాలు. ఇందులో హై, మీడియం, లో అనే మూడు మోడ్స్‌తో పాటు.. యాపిల్‌ లిప్‌ ఎఫెక్ట్, ఫుల్‌ లిప్‌ ఎఫెక్ట్‌ అనే రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. యాపిల్‌ లిప్‌ అంటే కింద పెదవి మధ్యలో నిలువుగా, అందంగా సన్నని గీత ఏర్పడుతుంది. ఫుల్‌ లిప్‌ అంటే కింద పెదవి మధ్యలో ఎలాంటి గీత ఏర్పడదు. దీన్ని చార్జింగ్‌ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. పెదవుల్లో వచ్చిన ఆ మార్పు 4 నుంచి 10 గంటల వరకూ ఉంటుంది. దీని ధర 27 డాలర్లు. అంటే 1,930 రూపాయలు. భలే ఉంది కదూ! మరి ఇంకెందుకు ఆలస్యం మోడ్స్‌ మార్చి, ఎఫెక్ట్స్‌ ప్రయత్నించండి.

మరిన్ని వార్తలు