వాడేసిన వంటనూనెతో బయోడీజిల్

28 Feb, 2016 00:02 IST|Sakshi
యువ మేధావులు అభిషేక్, హర్షిత్, మోహిత్

భలేబుర్ర
వేపుళ్లకు అలవాటు పడ్డ మనదేశంలో వంటనూనె వృథా అంతా ఇంతా కాదు. వాడేసిన వంటనూనెను ఇలా వృథా పోనివ్వకుండా తిరిగి ఉపయోగించు కునేలా తయారు చేయాలనుకున్నారు ముగ్గురు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు. ఆలోచన వచ్చిందే తడవుగా అభిషేక్ శర్మ, హర్షిత్ అగ్రవాల్, మోహిత్ సోనీ అనే ఈ విద్యార్థులు ప్రయోగాలు ప్రారంభించారు. ఇళ్లలోను, హాస్టళ్లలోను వాడేసిన వంట నూనెను సేకరించడం ప్రారంభించారు. దాన్ని బయోడీజిల్‌గా మార్చే ప్రక్రియపై నానా ప్రయోగాల తర్వాత ‘ఫేమ్ వన్’ పేరిట ఓ నమూనా యంత్రాన్ని రూపొం దించారు.

దీంతో వంటనూనెను జీవ ఇంధనంగా తయారు చేయగలిగారు. మామూలు డీజిల్‌లో దీనిని ఏ నిష్పత్తిలో నైనా కలుపుకోవచ్చట. వంటనూనె, నీరు, ఆల్కహాల్‌తో పాటు ఒక ఉత్ప్రేరక రసా యనాన్ని వేసి ఆన్ చేస్తే చాలు... గంట సేపట్లోనే బయోడీజిల్ సిద్ధమైపోతుంది. విడతకు ఇరవై కిలోల వాడేసిన వంటనూనెతో ఇరవై కిలోల బయోడీజిల్ తయారు చేయగలుగు తున్నారు. ఈ యంత్రం రూపకల్పనకు అయిన ఖర్చు రూ. 30 వేలు మాత్రమే. కానుగనూనె వంటి వాటితో కూడా బయో డీజిల్ తయారు చేయవచ్చని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు