వారఫలాలు: 10 జనవరి నుంచి 16 జనవరి, 2015 వరకు

10 Jan, 2016 03:59 IST|Sakshi
వారఫలాలు: 10 జనవరి నుంచి 16 జనవరి, 2015 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతన విద్యలపై ఆసక్తి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహణి, మృగశిర 1,2 పా.)
చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు. ఆరోగ్య విషయంలో చికాకులు తప్పకపోవచ్చు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. అరుదైన ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు. కళాకారులకు సన్మానాలు. గోధుమ, ఎరుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఉత్సాహవంతం. భూ వివాదాలు తీరతాయి. బాకీలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌చాలీసా పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విరోధులు మిత్రులుగా మార తారు. పోటీపరీక్షల్లో విజయం. శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇంటా బయటా ప్రోత్సాహకరం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనయోగం. ఇంటి నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. నేరేడు, లేత నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చికాకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఆర్థిక విషయాల్లో నిరాశ. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తుతి మంచిది.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

 ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. వాహనాలు, భూముల కొనుగోలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి.  పారిశ్రామికవే త్తలకు అంచనాలు నిజమవుతాయి. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు. నీలం, నేరేడురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులను దారికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన సమాచారం అందుతుంది. కార్యోన్ముఖులై ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ధనలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు సన్మానాలు. నలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు ఆశాజన కం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. వాహనాలు, భూముల కొనుగోలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, లేత పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణే శ్‌స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు