24 జనవరి నుంచి 30 జనవరి, 2016 వరకు

24 Jan, 2016 02:12 IST|Sakshi
24 జనవరి నుంచి 30 జనవరి, 2016 వరకు

  వారఫలాలు
 మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 కొత్త పనులకు శ్రీకారం. ఇంటా బయటా మీదే పైచేయి. సన్నిహితుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. భూ వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహీణి, మృగశిర 1,2 పా.)
  సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి.  లక్ష్యాల సాధనలో కుటుంబ సభ్యులు, మిత్రులు సహకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు తీరతాయి. ప్రముఖులతో చర్చలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి సన్మానాలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. నిరుద్యోగులు, విద్యార్థుల కృషి అంతగా ఫలించే అవకాశం లేదు. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రం. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సహాయంతో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసు కుంటారు. ఇంటా బయటా మీకు ఎదురుండదు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు  పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వాహనయోగం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పొరపాట్లు సరిదిద్దుకుని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. గులాబీ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

 తుల: (చిత్త 3,4,  స్వాతి, విశాఖ1,2,3 పా.)
 సంఘంలో విశేష గౌరవం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ  సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆదాయం కొంత పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. రుణబాధల నుంచి కొంతవరకూ బయటపడతారు. ప్రముఖ వ్యక్తి  చేయూతనంది స్తారు. ఇళ్లు, భూములు కొనుగోలు చేసే అవకాశముంది. నిరుద్యోగులు  ఉద్యోగాలు పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు కాస్త తొలగుతాయి. లేత ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అర్చన చేయించుకుంటే మంచిది.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 కీలక నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పనుల్లో అవరోధాలు నెలకొన్నా పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యాలపై చర్చలు. వాహనయోగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వర స్తుతి మంచిది.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 ఈవారం పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు లేదు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రాబడి ఆశాజనకమే. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. నలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆరోగ్యం కుదుటపడుతుంది.  శ్రమ ఫలించే సమయం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవులు. తెలుపు, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

మరిన్ని వార్తలు