ఇది వాలెంటైన్ హృదయం!

14 Feb, 2016 08:30 IST|Sakshi
ఇది వాలెంటైన్ హృదయం!

ప్రేమ చిహ్నం
ప్రేమకు గుర్తు... హార్ట్ సింబల్. అలా అని అందరూ అనేస్తారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా... అసలు హార్ట్ ఆ షేపులో ఉంటుందా అని? గుండె షేపు వేరు. మరి ఈ సింబల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది హృదయం ఎందుకయ్యింది?
 దాని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది.
 పూర్వం... క్లాడియస్ రాజు రోమ్‌ను పరిపాలిస్తున్న కాలంలో... సైనికులు పెళ్లిళ్లు చేసుకోకూడదనే నియమం ఉండేది.

కానీ పాపం సైనికులూ మనుషులే కదా! వారి బాధను అర్థం చేసుకున్న వాలెంటైన్ అనే సెయింట్... సైనికులకు రహస్యంగా పెళ్లిళ్లు చేస్తుండేవాడు. అది రాజుకు తెలిసిపో యింది. వాలెంటైన్‌ను జైల్లో బంధించాడు. మరణ దండన విధించాడు. ఆ దండనను ఆమలు చేసే రోజు వచ్చింది. చనిపోయే ముందు ఈ ప్రపంచానికి తన చివరి సందే శాన్ని వినిపించాలనుకున్నాడు వాలెంటైన్. ఎలా ఆ పని చేయాలా అని ఆలోచిస్తుంటే  రాలిపడిన రావిచెట్టు ఆకులు కనిపించాయి. వాటి మీద... ‘నేను సైనికుల జీవితాల్లో ప్రేమను నింపాలని వాళ్లకు పెళ్లిళ్లు చేశాను.

ప్రతి మనిషికీ ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే జీవితమే ఉండదు. ప్రేమను బ్రతికించండి. ఇదే నా చివరి సందేశం’ అని బొగ్గుముక్కతో రాసి, తన గది కిటికీలోంచి వాటిని బయటకు విసిరేశాడు. ఆ తర్వాత మరణ దండనకు తలవంచాడు. అయితే వాలెంటైన్‌కు తెలియదు... తాను ఇచ్చిన ఆ సందేశం ఈ ప్రపంచం మొత్తాన్నీ తనకు అభిమానులుగా మార్చేస్తుందని. తాను మరణించిన రోజు వాలెంటైన్స్‌డేగా ప్రేమికులకు అంకితం అవుతుందని.
 వాలెంటైన్ తన చివరి సందేశాన్ని రాసిన రావి ఆకును అతని హృదయంగా భావించి, దాని ఆకారాన్ని హృదయా కారంగా, ప్రేమకు గుర్తుగా స్థిరపరిచారని ఓ కథనం.

>
మరిన్ని వార్తలు