13 జనవరి నుంచి 19 జనవరి 2019 వరకు

12 Jan, 2019 22:22 IST|Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తిలాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. బంధువిరోధాలు. గులాబీ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ అంతరంగాన్ని బం«ధువులు గుర్తించి సహాయపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనయోగం. విద్యార్థుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో ఒక విషయంలో కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంతనెమ్మదిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రుణభారాలు కొంత తగ్గుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి అన్నింటా విజయమే. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మొదట్లో కుటుంబసమస్యలు ఎదురై కాస్త చికాకు పరుస్తాయి. అలాగే, ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. క్రమేపీ వీటి నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం, వైద్యసేవలు. వృథా ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠనం మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆటంకాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలోశుభవార్తలు. ధనలాభం. తీర్థయాత్రలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి సేవలకు తగిన ప్రోత్సాహం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు 

13 జనవరి నుంచి  19 జనవరి 2019 వరకు
 టారో

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. అధికార పదవులు వరించే సూచనలు ఉన్నాయి. కీలక అంశాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోరుకున్న రంగంలో వరుస విజయాలతో దూసుకు పోతారు. సంప్రదాయాలకు దూరం కాకుండానే, కొత్త పద్ధతులనూ అనుసరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అనూహ్యంగా సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఇంట్లో ఆనందభరిత వాతావరణం ఉంటుంది. అదృష్టం కలసి వస్తుంది. ఘన విజయాలను సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భంలో ఊగిసలాటలో ఉన్న సమయంలో పరిచయమైన ఒక వ్యక్తి మీకు సరైన దిశా నిర్దేశం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల మన్ననలు అందుకుంటారు. దాన ధర్మాల కోసం డబ్బు వెచ్చిస్తారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వాక్చాతుర్యంతో సమస్యలను పరిష్కరిస్తారు. యోగ్యత కలిగిన వ్యక్తి ఒకరు మీతో ప్రేమలో పడతారు. స్థిరాస్తి లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. శుభవార్తలు వింటారు.
లక్కీ కలర్‌: ఊదా

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇదివరకటి కంటే ప్రత్యేకంగా ఉండే కాలం ఇది. వరుస విజయాలు మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతాయి. జీవితంలో కోరుకున్న లక్ష్యాల్లో కొన్ని ముఖ్యమైన వాటిని సాధిస్తారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాల్లో అమోఘంగా రాణిస్తారు. భోజనం వేళ తప్పడం వల్ల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవితంలో గొప్ప ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సాహితీ కళారంగాల వారు సత్కారాలను అందుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. పదోన్నతులు దొరికే సూచనలు ఉన్నాయి. ఆదాయం మెరుగుపడుతుంది. అద్భుతమైన అవకాశాలు కలసి వస్తాయి. కీలక నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. వివాదాలు కలవరపరుస్తాయి. చికాకుపరచే వ్యక్తులు తారసపడే సూచనలు ఉన్నాయి. లౌక్యంగా వ్యవహరించడమే మేలు.
లక్కీ కలర్‌: మీగడ రంగు


సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో లక్ష్యాలను అందుకోవడంలో శరవేగంగా ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు ఎన్ని సమస్యలు సృష్టించాలనుకున్నా, మీవైన ప్రత్యేక నైపుణ్యాలే మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. అన్ని విధాలా అదృష్టం వరిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. సృజనాత్మక కళా రంగాల వారికి గుర్తింపు, ప్రభుత్వ సత్కారాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. పెద్దలు, గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కొంత గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. పోటీ వాతావరణంలో ఎదురయ్యే సవాళ్లకు దీటుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉండటంతో అలసటకు, విసుగుకు లోనవుతారు. పని పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఆరోగ్యం మందగించవచ్చు. ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. 
లక్కీ కలర్‌: లేత గోధుమరంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
పనులు సానుకూలమవుతాయి. త్వరలోనే లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఇదివరకటి కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. పదోన్నతులు పొందే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల కోసం మరింత సమయం కేటాయించాల్సి వస్తుంది. అవసరాల్లో ఉన్న మిత్రులను ఆదుకుంటారు. మౌనంతోనే చాలా సమస్యలను అధిగమిస్తారు. విదేశీయాన సూచనలు ఉన్నాయి. సృజనాత్మక కళారంగాల్లోని వారికి లాభసాటి అవకాశాలు వస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.
లక్కీ కలర్‌: లేతనీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
పోరాట పటిమను చాటుకుంటారు. ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీదైన శైలిలో రాణిస్తారు. ఘర్షణలకు దూరంగా ఉంటేనే మంచిది. వివాదాల్లో విజయం సాధించినా మనశ్శాంతి దూరమవుతుందని గ్రహిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఒత్తిడికి లొంగకుండా ఆచి తూచి ఆలోచించాల్సి ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆశించిన లక్ష్యాలను సాధించడానికి కొత్త మార్గంలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: నారింజ


ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. విహారయాత్రలకు వెళతారు. కొత్త అనుభవాలు ఎదురవుతాయి. నిజాయతీతో ప్రేమను గెలుచుకుంటారు. ప్రేమానుబంధంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంటికి కొత్తగా అలంకరణలు చేపడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్వంతో పొంగిపోతారు.
లక్కీ కలర్‌: తెలుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
క్రమశిక్షణతో, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలతో లక్ష్య సాధన దిశగా దూకుడు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలను సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. చిరకాలంగా సాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. ప్రేమికులతో కలసి విహారయాత్రలకు వెళతారు. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. అలంకరణ సామగ్రి, మహిళల వస్తువులకు సంబంధించిన వ్యాపార సంస్థను కొత్తగా ప్రారంభిస్తారు.
లక్కీ కలర్‌: లేత గులాబి

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అనిశ్చితిలో ఊగిసలాడుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది. ముఖ్యంగా వ్యాయామంపై దృష్టి సారించి శారీరక దారుఢ్యాన్ని కాపాడుకున్నట్లయితే, చాలా సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రేమ ప్రతిపాదనకు ప్రియతముల నుంచి ఆమోదం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో లౌక్యం ప్రదర్శించడం మంచిది. ముక్కుసూటితనం వల్ల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తారు. పిల్లల ఆరోగ్య సమస్యల కారణంగా కలత చెందుతారు. విశ్రాంతి కోరుకుంటారు.
లక్కీ కలర్‌: గోధుమరంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
భయాలను, సంకోచాలను పక్కనపెట్టి ముందుకు సాగితేనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు. విద్యా సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. పెంపుడు జంతువులపై శ్రద్ధ చూపుతారు. పొగడ్తలతో ముంచెత్తే భజనపరుల ప్రభావంలో పడకుండా అప్రమత్తంగా ఉండటం మేలు. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా చేపట్టే ఒక పని ద్వారా ఆర్థిక పురోగతిలో వేగం పుంజుకుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇతరుల ప్రవర్తన మనస్తాపం కలిగించే సూచనలు ఉన్నాయి. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
కలిసివచ్చే రంగు : నాచురంగు

ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు