వారఫలాలు

30 Sep, 2018 02:04 IST|Sakshi

30 సెప్టెంబర్‌ నుంచి 6 అక్టోబర్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న పనుల్లో అవాంతరాలు. బంధువులతో కొద్దిపాటి తగాదాలు. మీకష్టం ఎదుటవారికి లాభిస్తుంది. కొన్ని విమర్శలు భరించాల్సిన సమయం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. మరోవైపు రుణదాతల ఒత్తిడులు తప్పవు. ఒక సమాచారం నిరుద్యోగులను నిరాశ పరుస్తుంది. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, పైస్థాయి నుంచి ఒత్తిడులు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధనలబ్ధి. వస్తులాభాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  మీ సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కాస్త ఊరట కలిగిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. విచిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయవర్గాల వారి యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం.దేవీస్తుతి మంచిది.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలలో విజయంతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసభ్యులు పూర్తిస్థాయిలో సహకరిస్తారు. బంధువుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. అందరిలోనూ విశేష ఆదరణ పొందుతారు. ఉద్యోగయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.  పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్య సూచనలు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
రుణ విముక్తులవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి. అనుకోని సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. మీపై వచ్చిన విమర్శల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వృద్ధి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నేరేడు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
మొదట్లో నెలకొన్న సమస్యల నుంచి క్రమేపీ బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. చిరకాల మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. పారిశ్రామికరంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, నలుపు రంగులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. రుణాలు తీరతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. దూరపు బం«ధువులను కలుసుకుంటారు.  ముఖ్య నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు వ్యూహాత్మకంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నేరేడు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యయప్రయాసలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఎంతటి కార్యాన్నైనా నేర్పుగా పూర్తి చేస్తారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది.  వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతశ్రేణి నుంచి ప్రోత్సాహం అందుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో  కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యం మందగిస్తుంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదించినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల రిజిస్ట్రేషన్లు జరిపించుకుంటారు. సంఘంలో ఎనలేని గౌరవం. సోదరుల నుంచి కీలక సమాచారం రాగలదు. ధార్మిక కార్యక్రమాలు, వేడుకలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

30 సెప్టెంబర్‌ నుంచి  6 అక్టోబర్, 2018 వరకు
టారో

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కలలను సాకారం చేసుకుంటారు. ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. కోరుకున్న సుదూర ప్రదేశాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలను ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి, బాధ్యతలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ అవకాశాలను అంది పుచ్చుకుంటారు. స్థిరాస్తులపై పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు ముందుకేయాల్సి ఉంటుంది. ప్రేమ సఫలం కావాలంటే మరికొంత నిరీక్షణ తప్పదు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలకు శక్తిమేరకు చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అతిగా ఏమీ ఆశించవద్దు. ఏ అంశంలోనైనా ఇతరుల నుంచి ఏదైనా ఆశించడానికి అనువైన కాలం కాదు. ఓరిమితో ఎదురు చూడటం మినహా ప్రస్తుతానికి మరో మార్గం లేదు. జీవిత భాగస్వామితో తలెత్తే వాదులాటలను తెగేవరకు లాగకుండా ఉండటమే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో అజ్ఞాత శత్రువుల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటమే మంచిది. నిరాశకు లోను చేసే వార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నా, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సానుకూలమైన కాలం. కొత్త భాగస్వామ్యాలు మీ వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. కొత్త అవకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది. కొందరికి పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పొదుపు చేయడానికి, దీర్ఘకాలిక పథకాల్లో మదుపు పెట్టడానికి ఇది అనువైన కాలమే అయినా, స్పెక్యులేషన్‌ లావాదేవీలకు పరిస్థితి అనుకూలం కాదు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహార జాగ్రత్తలు అనివార్యమవుతాయి.
లక్కీ కలర్‌: పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే గడ్డు సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. లేనిపోని దుస్సాహసాలకు దూరంగా ఉంటేనే మంచిది. అనాలోచితంగా చేసిన పనులకు ఫలితంగా ఎదురయ్యే పర్యవసానాలకు సిద్ధంగా ఉండక తప్పదు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంట్లోని పెద్దల ఆరోగ్య పరిస్థితి కలవరపెట్టే సూచనలు ఉన్నాయి. విదేశాల నుంచి అవకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులు దీక్షతో సత్ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంతకాలం ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే అవకాశాలు ఉన్నాయి. 
లక్కీ కలర్‌: ఊదా

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలకు సంబంధించి ఊగిసలాటకు లోనవుతారు. అనవసరమైన సందిగ్ధతలను విడిచిపెట్టి పని మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ప్రేమకు సంబంధించిన ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. అవసరాలు తీర్చుకోవడం కోసం మీ చుట్టూ తిరిగే వారిని దూరం పెడతారు. అసలైన మిత్రులెవరో తేల్చుకుంటారు. అనాథలను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీదైన శైలిలో ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే మీ వ్యవహార శైలితో జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటారు. మిత్రులతో కలసి ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు జరుపుకొంటారు. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. భావసారూప్యత గల వ్యక్తులతో కలసి సామాజిక కార్యక్రమాలను చేపడతారు. సాహితీ కళా రంగాల్లోని వారికి తగిన గుర్తింపు దొరుకుతుంది. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జీవిత భాగస్వామి తారసపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలకు పెద్దల ఆమోదం లభిస్తుంది.
లక్కీ కలర్‌: నాచు రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మొహమాటాలకు పోయి సమస్యలను కొని తెచ్చుకునే సూచనలు ఉన్నాయి. ఎంత కావలసిన వారైనా, పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శక్తికి మించిన పనులు చేయాలనే ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో నిర్మొహమాటంగా ‘కుదరదు’ అని చెప్పడం నేర్చుకుంటేనే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో లౌక్యంగా వ్యవహరిస్తేనే సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు. ముక్కుసూటితనం వల్ల చిక్కులు తప్పకపోవచ్చు. సృజనాత్మక రంగాల్లోని వారు అద్భుతంగా రాణిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది.
లక్కీ కలర్‌: ముదురు నీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఇతరులకు సంబంధించిన తప్పొప్పుల మీమాంసలను పక్కనపెట్టి, మీ జీవితాన్ని పూర్తిగా మీరే అదుపులోకి తీసుకోండి. మీ జీవితంలో ఇతరుల ప్రమేయాన్ని కనీస స్థాయికి కుదించడం మేలు. ప్రతి పనిలోనూ విమర్శలకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించండి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. అడుగడుగునా శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మిమ్మల్ని అర్థం చేసుకునే మిత్రుల సమక్షంలో సాంత్వన పొందుతారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: బంగారు రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అభివృద్ధి మార్గంలో శరవేగంగా దూసుకుపోతారు. జటిలమైన సమస్యలను చిటికెలో పరిష్కరించి ఇతరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీరు పనిచేసే చోట మీదైన ముద్ర వేస్తారు. ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరచుకునేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇంటికి మరమ్మతులు చేపడతారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. ఆర్థిక సమస్యల్లో చిక్కకున్న మిత్రుల్లో ఒకరికి చేయూతనిస్తారు. విహార యాత్రలకు వెళారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు.
లక్కీ కలర్‌: లేత ఊదా

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ వద్దకొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచి తూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ధ్యానంతో ఊరట పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. 
లక్కీ కలర్‌: పసుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. 
లక్కీ కలర్‌: ముదురు గులాబి
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు