వారఫలాలు

14 Oct, 2018 01:24 IST|Sakshi

14 అక్టోబర్‌ నుంచి 20 అక్టోబర్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల్లో  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు.  వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. లాభాల బాటపడతారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది.  కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
లక్ష్య సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి విముక్తి. సోదరుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన, గృహయోగాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.  రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో వృథా వ్యయం. అనారోగ్యం. బం«ధువిరోధాలు. పసుపు, లేత నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నాగదేవతస్తుతి మంచిది.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఎంతో నేర్పుగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కుతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. పసుపు, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తుతి మంచిది.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రుల సాయంతో ముందుకు సాగుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. భూవివాదాల పరిష్కారంపై చర్చలు  సఫలం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం. సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. వస్తులాభాలు. నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు, లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. గతం గుర్తుకు వచ్చి ముఖ్య విషయాలు మననం చేసుకుంటారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుతాయి.  వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. కళారంగం వారి సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. సోదరులతో  కలహాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో నిరాశ తప్పదు. పెట్టుబడుల్లో జాప్యం.  ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల వారు నిర్ణయాలలో తొందరపడరాదు. వారం మధ్యలో   శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. గులాబీ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి కాగలవు.  ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూ, గృహయోగాలు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.  కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి  శుభవర్తమానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు కొలిక్కివస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన రీతిలో ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్తగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాగలవు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగినా ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం చేకూరుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. పాతమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.  వ్యాపారాలలో అనుకున్న మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి, ఉన్నతశ్రేణి ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవీయోగం.వారం చివరిలో బంధువిరోధాలు. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యవహారాలు సాïఫీగా  పూర్తి చేస్తారు. ఒక సమాచారం నూతనోత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాల వారు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.  వారం మధ్యలో  కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టర్లు దక్కుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో అనుకోని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా వ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబీ,లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(14 అక్టోబర్‌ నుంచి  20 అక్టోబర్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఆత్మనియంత్రణ పాటించడం ద్వారా సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ప్రతికూల భావనలు మనసును చికాకుపరచే సూచనలు ఉన్నాయి. మిత్రుల సహకారంతో సానుకూల భావనలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యసనాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి అవరోధాలు ఎదురు కావచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో జాప్యం తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు అందుకుంటారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొత్త పనులు ప్రారంభించడానికి పూర్తి సానుకూలమైన సమయం. ఇప్పటి వరకు ప్రణాళికలకే పరిమితమైన పనులను ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టండి. సత్ఫలితాలను పొందగలరు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. పని మీద మరింతగా దృష్టి సారిస్తారు. పురోగతిలో వేగం పెంచుకోవడానికి కృతనిశ్చయంతో దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఏర్పడిన అపార్థాలు తేలికగా సమసిపోతాయి.
లక్కీ కలర్‌: నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
అనవసరంగా అభద్రతాభావానికి లోనవుతారు. మీ అతిజాగ్రత్త ఇతరులకు చాదస్తంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని భయాల వల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలను జాప్యం చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలకు కూడా అతిగా చింతిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోతారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం కొంత ఊరటనిస్తుంది. ఆత్మస్థైర్యం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇంతకాలం ఎలాంటి విజయాల కోసం అర్రులు చాస్తూ వచ్చారో, అలాంటి విజయాలను అందుకుంటారు. చాలా విషయాల్లో చెక్కుచెదరని పట్టుదలతో ఉంటారు. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనిలో భాగంగా దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులపై మంచి లాభాలను అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పెద్దలను సంతోషపెడతారు. గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: ఎరుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జీవితంలో అనూహ్యమైన మార్పులు ఎదురవుతాయి. ఈ మార్పులతో ఉద్విగ్నత చెందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట తారసపడే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. పెరిగిన బాధ్యతలకు తగినట్లుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తీరిక దొరక్కపోవడం వల్ల భోజనాన్ని నిర్లక్ష్యం చేసే సూచనలు, ఫలితంగా ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. మార్పులను స్వీకరించడం ద్వారా అభివృద్ధిలో వేగాన్ని పెంచుకుంటారు.
లక్కీ కలర్‌: నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
త్వరలోనే దశ తిరగబోతోంది. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది.
లక్కీ కలర్‌: పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: మీగడ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్‌: పసుపు
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

మూడోసారి తండ్రి అయిన హీరో!

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..