వారఫలాలు

23 Dec, 2018 00:51 IST|Sakshi

23 డిసెంబర్‌ నుంచి 29 డిసెంబర్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు బంధువులతో పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. ఒక దీర్ఘకాలిక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నిర్వíß స్తారు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నీలం, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం లభిస్తుంది. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికీ శిరోధార్యంగా ఉంటాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  ఆస్తుల వ్యవహారంలో చికాకులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, గృహయోగాలు కలుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీహోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబి, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పఠనం మంచిది. 

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఇంటాబయటా సమస్యలు తీరతాయి. ఊహలు నిజం చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం రాగలదు. వివాహాది వేడుకలకు హాజరవుతారు. భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు. గులాబి, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగులు ఉపా«ధి అవకాశాలు అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. లేత పసుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పట్టుదలతో విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను పరిష్కరించుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. గృహయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్‌ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, లేత గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
విశేష గౌరవంతో పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకుంటారు. గృహయోగ సూచనలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు అప్రయత్న కార్యసిద్ధి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
రుణఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహయోగాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.


మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. నీలం, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులు మరింత ఆదరిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. గతం గుర్తుకు వస్తుంది. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో కలహాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. శక్తియుక్తులతో సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 ∙టారో
23 డిసెంబర్‌ నుంచి 29 డిసెంబర్‌ 2018 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అంతా శుభదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అన్న రీతిలో అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి గణనీయమైన ఆర్థిక లబ్ధితో పాటు పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అధికార లాభం, వాహనయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులతో ఆలోచనలు పంచుకుంటారు. భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే లక్ష్యంతో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. శుభకార్యాలు తలపెడతారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
చేపట్టిన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అధికారుల అండ లభిస్తుంది. రెట్టించిన ఉత్సాహంతో ఒక్కొక్కటిగా లక్ష్యాలను సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త ఇంటి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం వైపు దృష్టి సారిస్తారు. ఒంటరిగా ఉంటున్నవారు ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: బూడిద రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. పనిచేసే చోట మీరు కోరుకున్న రీతిలోనే భావి పరిణామాలు ఉంటాయి. ప్రత్యర్థులను కట్టడి చేస్తారు. వివాదాస్పద పరిస్థితుల నుంచి బయటపడతారు. జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంకల్పబలంతో ఘన విజయాలను సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి. వారాంతంలో పని ఒత్తడి పెరగవచ్చు. ఆధ్యాత్మిక సాధనతో ప్రశాంతత పొందుతారు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఉన్నత లక్ష్యాలను పెట్టుకుంటారు. లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకుని, వాటిని కార్యాచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు సన్నిహితుల సహకారంతో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. శ్రమకు, ఫలితానికి వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుని, మార్పు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కోరుకున్న మార్పు కోసం నిరీక్షణ తప్పకపోవచ్చు. ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
లక్కీ కలర్‌: లేత గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
అనూహ్యమైన మార్పులు అనివార్యమవుతాయి. స్థిరత్వాన్ని కోరుకుంటున్న సమయంలో ఎదురయ్యే ఈ మార్పులు కొంత ఆందోళనకు గురి చేస్తాయి. ఆందోళన పడాల్సిందేమీ లేదు. మార్పు మంచిదేనని అనుభవంపై తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు శక్తి సామర్థ్యాలను చాటుకుంటారు. అద్భుతమైన ఫలితాలు సాధించి సహచరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తారు. వ్యాపారరంగంలోని వారు భాగస్వామ్య ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో శుభకార్యాలను తలపెడతారు. ప్రేమికుల పెళ్లికి మార్గం సుగమమవుతుంది.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. సహజమైన మీ ప్రతిభా పాటవాలతో అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంటారు. ఆచి తూచి అడుగులు ముందుకేస్తారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. పని ఒత్తిడి నుంచి కొంత విరామం కోరుకుంటారు. ఇదివరకు చూడని ప్రదేశాలకు విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇబ్బందుల్లో ఉన్న మిత్రులను ఆదుకుంటారు. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెనవేసుకుంటాయి.
లక్కీ కలర్‌: గులాబి

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశ నిరాశల ఊగిసలాట నుంచి బయటపడతారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. దైవబలాన్ని నమ్ముకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని సమస్యలు నెమ్మదిగా ఒక కొలిక్కి వస్తాయి. ప్రత్యర్థులు పుట్టించే వదంతులు మనస్తాపం కలిగించే సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. గొప్ప అవకాశం తలుపు తడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచవలసి వస్తుంది. ఆహార విహారాల్లో మార్పులు అనివార్యం అవుతాయి. ప్రేమికులు ప్రణయ రసాస్వాదనలో తన్మయులవుతారు. విదేశయాత్రల కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి.
లక్కీ కలర్‌: నీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
సంపదను పెంచుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అధికార పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. సామాజికంగా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. సాహితీ కళా రంగాల్లోని వారికి సభా మర్యాద, సన్మానాలు దక్కే సూచనలు ఉన్నాయి. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక అద్భుతమైన వ్యక్తి మీతో ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. ఆరోగ్యం కాస్త మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో మార్పులు చేయాల్సి రావచ్చు. 
లక్కీ కలర్‌: నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను దారికి తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు సద్దుమణుగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సకుటుంబంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సకాలానికి రుణాలు అందుతాయి. అందంపై, ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. ప్రేమికుల మధ్య అనుకోని ఎడబాటు మానసికంగా కుంగదీసే సూచనలు ఉన్నాయి. 
లక్కీ కలర్‌: ముదురు గులాబి

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వలమైన భవిష్యత్తు కోరుకుంటారు గాని, ఊహాలోకంలో విహరిస్తారు. ఊహాలోకం నుంచి బయటపడితేనే భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. ఆలస్యం చేయకుండా ఆలోచనలను ఆచరణలో పెట్టండి. సత్ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను మోయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సంయమనం పాటించి, సవాళ్లను స్వీకరిస్తేనే మీ సత్తా లోకానికి రుజువవుతుంది. సంతృప్తికరమైన రీతిలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఊదా

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి అనువైన సమయం ఇది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లాభాలు సంతృప్తికరమైన స్థాయిలో ఉంటాయి. అనూహ్యమైన రీతిలో విజయాలు సాధిస్తారు. ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మదుపు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వివాదాస్పద వ్యక్తుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ ఫలిస్తుంది.
లక్కీ కలర్‌: వెండి రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అవరోధాలను అధిగమిస్తారు. ప్రణాళికల రూపకల్పన కోసం కాలాన్ని వృథా చేసుకోకండి. జరిగే పరిణామాలను గమనిస్తూ ఉండండి. సమస్యలు వాటంతట అవే సద్దుమణుగుతాయి. ఇదివరకటి కఠోర పరిశ్రమ తాలూకు ఫలితాలు ఇప్పుడిప్పుడే అందడం మొదలవుతుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వాహనాన్ని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు. సన్నిహితులకు కానుకలు ఇస్తారు. ప్రియమైనవారితో విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి