వారఫలాలు : 3 సెప్టెంబర్‌ నుంచి 9 సెప్టెంబర్‌ 2017 వరకు

3 Sep, 2017 00:05 IST|Sakshi
వారఫలాలు : 3 సెప్టెంబర్‌ నుంచి 9 సెప్టెంబర్‌ 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భూ,వాహనయోగాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. విద్యార్థుల యత్నాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. మీ సహనానికి పరీక్షా సమయంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబి, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరీలు, సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపార లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఇంతకాలం ఎదురుచూసిన అవకాశాలు నిరుద్యోగులకు అందుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. బంధుమిత్రులతో వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు విద్యావకాశాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కార్యజయం. శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. మీ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. విద్యార్థులకు చేజారిన అవకాశాలు దగ్గరకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విశేష ఆదరణ లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆదాయానికి మించిన ఖర్చులు మీదపడతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబి, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతగా కష్టించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త మందగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు అంచనాలు తప్పే అవకాశం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి.  కళాకారులకు ప్రయత్నాలు ముందుకు సాగవు. వారం ప్రారంభంలో విందువినోదాలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం లేక నిరాశ చెందుతారు. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగస్తుల సేవలకు తగిన గుర్తింపు కష్టమే. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. వారం మధ్యలో వాహనయోగం. ధనప్రాప్తి. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వీరికి  ఏపని చేపట్టినా విజయమే. ఆర్థిక బాధలు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలలో ఊహించని విధంగా పెట్టుబడులు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగ సూచనలు. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం.  నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మీరిచ్చే సలహాలు కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యం. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం మధ్యలో విందువినోదాలు. స్వల్ప ధనలాభం. నలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల ప్రశంసలు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో  వృథా ఖర్చులు. అనారోగ్య సూచనలు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మరిన్ని వార్తలు